ICC World Cup 2023 ప్రపంచ కప్ క్రికెట్ 2023 పూర్తి వివరాలు
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రపంచకప్ 2023 షెడ్యూల్ ని ICC విడుదల చేసింది, 2023 లో ఇండియా లో జరగనున్న ఈ వన్డే ప్రపంచకప్ క్రికెట్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC ) ప్రకటించింది . ఈ టోర్నమెంట్ అక్టోబర్ 5 తారీఖున న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో 2019 ఫైనలిస్టులు, ఇంగ్లండ్ మరియు న్యూజిలాండ్‌లు ఒకరితో ఒకరు తలపడటంతో ఈ ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. మొదటగా అక్టోబరు 8 తారీఖున న చెన్నైలో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా తో తలపడుతుంది , 1,32,000 మంది ప్రేక్షకులు – 32,000 కంటే ఎక్కువ మంది సీటింగ్ కెపాసిటీ తో ప్రపంచం లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్ స్టేడియంలో అక్టోబర్ 15 వ తారీఖున న పాకిస్థాన్‌తో మ్యాచ్ ని ఆడనుంది . క్రికెట్ వన్డే ప్రపంచకప్ లో భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే ఎనిమిదో మ్యాచ్ కాగా గతంలో జరిగిన 7 మ్యాచ్‌ల్లో నూ భారత్ విజయం సాధించింది. 50 ఓవర్ల ప్రపంచకప్ లో చివరి సారిగా 2019 లో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగినటువంటి మ్యాచ్‌లో భారత్ 89 పరుగుల తేడాతో (DLS పద్ధతి న ) పాకిస్థాన్ ను ఓడించింది.
ఇదిలా ఉండగా భారత్ తో జరిగే తమ మ్యాచ్ ను చెన్నై , బెంగళూరు లేదా కలకత్తా కు మార్చాలని పాకిస్థాన్ గతంలో కోరింది , అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరియు ICC ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి.
ఈ కప్ లో 10 జట్లు పాల్గొంటున్నందున , ప్రతి జట్టు మిగిలిన 9 జట్లతో రౌండ్ – రాబిన్ ఫార్మాట్ లో ఆడుతుంది , మొదటి 4 నాకౌట్ దశ మరియు సెమీఫైనల్ లకు అర్హత సాధిస్తాయి . చివరగా గ్రూప్ స్టేజ్ మ్యాచ్ నవంబర్ 12 వ తారీఖున న కోల్‌కతా లో ఇంగ్లండ్‌తో పాకిస్థాన్‌తో తలపడనుంది.
ICC World Cup 2023 సెమీ ఫైనల్
ఇదిలా ఉండగా కలకత్తా మరియు ముంబైల లో సెమీఫైనల్స్ జరుగుతాయి మొదటి సెమీ ఫైనల్ నవంబర్ 15 బుధవారం రోజున ముంబైలో , అలాగే 2 వ సెమీ ఫైనల్ మరుసటి రోజున కలకత్తా లో జరుగుతాయి. ఈ 2 సెమీఫైనల్‌లకు రిజర్వ్ డే ఉంటుంది.
ICC World Cup 2023 ఫైనల్ మ్యాచ్
నవంబర్ 19 2023 న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది , అలాగే నవంబర్ 20 తారీఖును రిజర్వ్ డేగా నిర్ణయించబడుతుంది.
ICC World Cup 2023 లో పాల్గొనే జట్లు
ఈ ఏడాది 2023 ప్రపంచకప్ లో 10 జట్లు పాల్గొంటాయి . ఆతిథ్య దేశంగా భారత్ నేరుగా అర్హత సాధించిందని చెప్పవచ్చు 2020 – 2023 ICC క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ , ఆస్ట్రేలియా , ఇంగ్లండ్ , బంగ్లాదేశ్ , న్యూజిలాండ్ , పాకిస్తాన్ అలాగే దక్షిణాఫ్రికా వంటి దేశాలు పాల్గొంటున్నాయి ఇదిలా ఉండగా ప్రస్తుతం జింబాబ్వే వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు ఈ ప్రపంచకప్‌లోకి ప్రవేశించనున్నాయి. అలాగే మాజీ ఛాంపియన్‌లు అయిన శ్రీలంక మరియు వెస్టిండీస్ తో పాటు , క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్ , నేపాల్ , నెదర్లాండ్స్ , ఒమన్ , స్కాట్లాండ్ , UAE , USA మరియు ఆతిథ్య జింబాబ్వే కూడా ఉన్నాయి .
ICC World Cup 2023 వేదికలు
వార్మప్ గేమ్‌లతో సహా మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి 12 వేదిక లలో గౌహతి ఎంపిక చేయబడడంతో పాటు ఈ ప్రపంచ కప్ ఈశాన్య భారతదేశం లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు . మొత్తం 10 వేదికలు – హైదరాబాద్ , ధర్మశాల , అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, పూణే, లక్నో, ముంబై ,బెంగళూరు మరియు కోల్‌కతా ఈ టోర్నమెంట్ సమయంలో మ్యాచ్ లను సరిగ్గా నిర్వహిస్తాయి. అలాగే హైదరాబాద్ తో పాటు గౌహతి అలాగే తిరువనంతపురం సెప్టెంబర్ 29 తేదీ నుండి అక్టోబర్ 3 వ తేదీ వరకు వార్మప్ గేమ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ICC World Cup 2023 లో ఇండియా మ్యాచ్ లు
India Vs Australia | October 8 – 2023 | Chennai |
India Vs Afghanistan | October 8 – 2023 | Delhi |
India Vs Pakistan | October 15 – 2023 | Ahmadabad |
India Vs Bangadesh | October 19 – 2023 | pune |
India Vs New Zealand | October 22 – 2023 | Dharmashala |
India Vs England | October 29 – 2023 | Lucknow |
India Vs Qualifier | November 2 – 2023 | Mumbai |
India Vs South Africa | November – 5 -2023 | Kolkata |
India Vs Qualifier 1 | November – 11 – 2023 | Bengaluru |
ప్రపంచ కప్ క్రికెట్ 2023 పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ చూడండి – Click Here
మీరు 5G మొబైల్ కొనాలనుకుంటున్నారా? మీకో బంపరాఫర్Amazon 5G Revolution Sale