BSNL : భారత దేశం లో ఒక వెలుగు వెలిగిన Bsnl ఎందుకు పతనమైంది ? మల్లి Bsnl పుంజుకునే అవకాశాలు ఎంత వరకు వున్నాయి…పూర్తి వివరాలు !
Bsnl History : బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అంటే అసలు భారత దేశంలో తెలీని వాళ్ళు ఉండరు. Bsnl నెట్వర్క్ అనేది భారత ప్రభుత్వం చేత స్థాపించిన మరియు నడపబడిన ఏకైక నెట్వర్క్ అని చెపొచ్చు. బిఎస్ఎన్ఎల్ పూర్తి పేరు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. Bsnl నెట్వర్క్ ఇది సెప్టెంబర్ 15, 2000 న భారత ప్రభుత్వం యొక్క టెలికం సంస్థ దీనిని ప్రారంభించింది. Bsnl నెట్వర్క్ యొక్క ముఖ్య ఉదేశ్యం సర్వీస్, ఈ నేపం తోనే Bsnl తమ రీఛార్జి యొక్క రేట్లను ఎప్పుడు ప్రజాజాలు అందుబాటులో ఉంచుతుంది. అప్పట్లో కేంద్రం టెలికం సర్వీస్ విభాగాలు ( DTS ), టెలికం ఆపరేషన్స్ ( DTO ) నుండి టెలికం సర్వీస్ లు మొదలైన నెట్వర్క్ నిర్వహణ పనులను మొదలు పెట్టటం జరిగింది. అలాగే Bsnl ల్యాండ్ లైన్ మరియు బ్రాడ్‌బ్యాండ్ యొక్క సేవలను అందించడంలో అతి పెద్ద నెట్వర్క్ గా నిలిచింది. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అప్పట్లో భారత దేశం లో 60% మార్కెట్ వేల్యూ కంటే ఎక్కువ స్థిరాస్తిని టెలిఫోన్ రంగం లో నిలబెట్టుకుంది.
అలాగే ఇది ల్యాండ్ లైన్ మరియు బ్రాడ్‌బ్యాండ్ వీటి సేవలను అందించడంలో అతిపెద్ద ప్రొవైడర్ గా నిలిచి. బిఎస్ఎన్ఎల్ ఆరవ అతిపెద్ద మొబైల్ టెలిఫోనీ ప్రొవైడర్ గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అప్పట్లో 80% మంది ప్రజలు ఈ నెట్వర్క్ సేవలను పొందారు. కానీ కలం క్రమేణా ఈ నెట్వర్క్ యొక్క వినియోదారులు కనుమరుగైపోయారు..ఇప్పుడు కేవలం 10% మంది ప్రజలు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వాడుతున్నారు అని టెలికం సర్వే లు చెప్తున్నాయి.మరి అంత వెలుగు వెలిగిన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పతనానికి గల ముఖ్య కారణాలు ఎపుడు తెలుసుకుందాం.
Bsnl పతనానికి గల ముఖ్య కారణాలు :
- బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ముఖ్యంగా మన ఇండియా లోనే పరిమితి కలిగి ఉండటం. వేరే నెటవర్క్లు అన్ని కూడా వివిధ దేశాలతో పటు ఇండియా లో కూడా తమ సేవలను అందిస్తున్నాయి.
- బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ స్ట్రెంత్, వేరే ఇతర నెట్వర్క్స్ తో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ యొక్క సిగ్నల్ చాల వీక్ గా ఉంటుంది.
- బిఎస్ఎన్ఎల్ 4జి అందుబాటులో వున్న కూడా దాని నెట్వర్క్ స్పీడ్ తక్కువ రావటం. మరియు ఇప్పుడు వేరే నెట్వర్క్ 5జి సేవలను అందిస్తున్న క్రమంలో Bsnl సేవలు ఇంకా వెనుక బడి ఉండటం ముఖ్య కారణం గా చెపొచ్చు.
- బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ యొక్క సేవలను తొందరగా అమలు చెయ్యక పోవడం.
- బిఎస్ఎన్ఎల్ స్కాం ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.బారి స్కామ్ బిఎస్ఎన్ఎల్ లో జరగడం.
- మారుతున్న టెక్నాలజీ ప్రకారం వెనుక బడి ఉండటం.
- మొదలైనవన్ని కూడా బిఎస్ఎన్ఎల్ పతనాని కి ముఖ్య కారణాలు గా చెప్పొచ్చు.
Bsnl పుంజుకునే అవకాశాలు ఎంత వరకు వున్నాయి…?
బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మల్లి పూర్వ వైభవాన్ని పొందుతుందా…. అంటే పొందుతుంది అనే చెప్తున్నారు టెలికాం కి సమందించిన నిపుణులు…ఎప్పుడో కనుమరుగైపోవాల్సిన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ని మోడీ వచ్చాక ఆ సంస్థకు కొంత శాతం ను నియమించి దాని పనితీరు ని మెరుగు పరిచేలా చేస్తున్నారు. దీనితో ఇతర నెట్వర్క్ లో రీఛార్జిల ధరలు పెరగడం, బిఎస్ఎన్ఎల్ వైపు మల్లి మొగ్గు చూపేలా చేస్తున్నాయి. ఐతే బిఎస్ఎన్ఎల్ ముఖ్య ఉదేశ్యం సర్వీస్ కాబట్టి దీని ధరలు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాయి . దాదాపు ప్రజల ఎక్కువ శాతం బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపడంతో కేంద్ర ప్రభుత్వం కూడా నెట్వర్క్ స్పీడ్ ను పెంచే విధంగా కొన్ని పనులు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఆగస్టు 2024 లో 9000వేళా కు పైకా కొత్త టవర్ల కు ఏర్పాటు చేస్తునట్టు ఇప్పటికే వెల్లడించింది. వీటితో పటు తేజస్ టెక్నాలజీ 80% మరియు ఇండియన్ టెలి కమ్యూనికేషన్స్ కంపెనీస్ 20% బడ్జెట్ ను ప్రవేశ పెట్టె విధంగా ఇప్పటికే నియమాలను పూర్తిచేసింది. దీని ద్వారా బిఎస్ఎన్ఎల్ 4జి కి అప్డేట్ కానుంది. అలాగే వచ్చే ఏడాది ఇది 5జి కి కూడా అందుబాటులోకి రానుంది. బిఎస్ఎన్ఎల్ లో ప్రస్తుతం రూ.1515కె ఒక సంవత్సరం పాటు సేవలను పొందొచ్చు, రోజు 2జీబీ/ డే కి అందుబాటులో వుంది. మిగిలిన అన్ని నెటవర్క్లకు దీటుగా బిఎస్ఎన్ఎల్ మరోబోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి పోర్ట్ అయిపోండి. మన భారత దేశం ఏకైక నెట్వర్క్ ని సపోర్ట్ చెయ్యండి.
వేరే నెట్వర్క్ నుంచి Bsnl నెట్వర్క్ కి ఎలా మారాలి ?
Step 1 : ముందుగా, మీ ఫోన్లో Massage బాక్సని ను తెరిచి, అందులో “PORT” అని టైప్ చేసి, మీ 10-అంకెల మొబైల్ నంబర్ని కూడా టైప్ చేసి 1900 కి Massage ను పంపించండి. మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారో, ఆ నెట్వర్క్ నుండి ఒక ప్రత్యేక పోర్టింగ్ కోడ్ (universal porting code)ని అందుకుంటారు. ముఖ్యంగా,కాశ్మీర్ లో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్ అయితే, మీరు సాధారణ Text పంపడానికి బదులుగా 1900కి కాల్ చేయాలి. UPC సాధారణంగా 15 రోజులు లేదా మీ SIM BSNLకి Port చేయబడే వరకు చెల్లుబాటు అవుతూనే ఉంటుంది.అయితే, జమ్మూ మరియు కాశ్మీర్, అస్సాం మరియు North ఈస్ట్ లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లోని subscribersకు ఇది 30 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది.
Step 2 : ఇప్పుడు, మీరు సమీపంలోని BSNL Customer Center లేదా Retailer ను సందర్శించాలి. మీ చెల్లుబాటు అయ్యే ID రుజువు మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటోను తీసుకెళ్లండి. మీరు BSNL అందించిన Customer Application Form (CAF)ని పూరించాలి. మరియు మీ పత్రాలు మరియు UPCతో పాటు సమర్పించాలి.
Step 3 : Form ను సమర్పించిన తర్వాత, మీ ఓల్డ్ సిమ్ ఎప్పుడు డియాక్టివేట్ చేయబడుతుందో మరియు కొత్తది ఎప్పుడు యాక్టివేట్ చేయబడుతుందని మీకు తెలియజేసే సందేశంతో కూడిన కొత్త బిఎస్ఎన్ఎల్ SIM Card మీకు అందుతుంది.
Step 4 : మీరు మీ Phoneలో new sim ని Insert చేయవచ్చు. కానీ Porting ప్రక్రియ పూర్తయ్యే వరకు మీ ఇతర sim ని ఉపయోగించడం కొనసాగించవచ్చు. పోర్టింగ్ ప్రక్రియ సాధారణంగా 5 రోజుల వరకు ఉంటుంది.
Bsnl కస్టమర్ కేర్ నం.
మీరు ముందే బిఎస్ఎన్ఎల్ కస్టమర్ ఐతే | 1500 |
వేరే ఇతర నెట్వర్క్ నుంచి ఐతే | 1800 345 1500 |