క్యాన్సర్‌తో బాధ పడే వారికి ఈ పువ్వు దివ్యౌషధం లాంటిది.Cauliflower in Telugu.

క్యాన్సర్‌తో బాధ పడే వారికి ఈ పువ్వు దివ్యౌషధం లాంటిది.Cauliflower in Telugu.

Cauliflower in Telugu : శీతాకాలంలో ఎక్కువగా దొరికే కూరగాయలలో క్యాలీఫ్లవర్ ఒకటి. క్యాలీఫ్లవర్తో మనం కూర, వేపుడు, మంచూరియా, క్యాలీఫ్లవర్ పకోడీలూ, రైస్ ఐటమ్స్ పాటు ఇలా చాలా వెరైటీలను చేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ను ఎలా చేసినా టేస్ట్ మాత్రం అదుర్స్ అనిపించేలా ఉంటుంది. క్యాలీఫ్లవర్ సూపర్ ఫుడ్గా నిపుణులు చెప్తుంటారు.


Cauliflower in Telugu : దీనిలో అధికంగా ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. క్యాలీఫ్లవర్లో Vitamin-B, C, K లతో పొటాషియం, క్యాల్షియం, ఫొలేట్, ప్రొటీన్లు, ఇనుము, సోడియం, పాస్పరస్ , మాంగనీస్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.క్యాలీఫ్లవర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా,యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల అంటువ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడతాయి.

ఇందులోని Sulforaphane అనే యాంటీఆక్సిడెంట్ హృదయ జబ్బులను నివారిస్తుందని వివిధ అధ్యయనాల్లో తేలింది. క్యాలీఫ్లవర్లోని పోషకాలు రక్త నాళాలు బిరుసెక్కడం,బ్లడ్ప్రెజర్ లాంటి సమస్యలను రాకుండా చేస్తుంది. రక్తం ఐరన్ను గ్రహించడంలో తోడ్పడుతుంది.అందువల్ల హిమోగ్లోబిన్ పెర్సెంటేజ్ పెరుగుతుంది. కాలిఫ్లవర్లో కొలెస్ట్రాల్ దాదాపుగా ఉండదు. కాబట్టి హృదయ జబ్బులు ఉన్న వాళ్లు తింటే మంచిది. అలాగే అన్ని రకాల హృదయ జబ్బులను అది నివారించడంలో తోడ్పడుతుంది.

Cauliflower in Telugu : క్యాలీఫ్లవర్లోని గ్లూకోబ్రాసిసిన్, గ్లూకోరాఫనిన్, గ్లూకోనాస్ట్రిన్లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. క్యాలీఫ్లవర్లో కోలిన్ ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తికి, నరాల వ్యవస్థకు కోలిన్ అనేది కీలకం. మనలో చాలామంది కొన్ని సార్లు అకస్మాత్తుగా మానసిక స్థితి బాగోకపోవడం, ఏ పని కూడా చేయాలనిపించదు. ఇలాంటి వారికి క్యాలీఫ్లవర్ ఒక పవర్ ఫుల్ మెడిసిన్లాగా పనిచేస్తుంది. దీనిలోని కొలీన్ మెదడు యొక్క పనితీరుని మెరుగుపరచడంతో పాటు అల్జీమర్స్ లాంటి సమస్యలు రాకుండా రక్షణ కలిగిస్తుంది. క్యాలీఫ్లవర్లోని యాంటీ ఆక్సిడెంట్లు శారీరక, మానసిక ఇబ్బందులను తొలగించి, ఉత్సాహంగా ఉంచుతాయి.

శరీరంలో Vitamin K లోపం ఉంటే, ఎముకలు పెళుసుబారడం, విరగడం, ఆస్టియో పొరాసిస్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. క్యాలీఫ్లవర్లో Vitamin K పుష్కలంగా ఉంటుంది. దీన్ని తరచుగా మన డైట్లో తీసుకుంటే,ఎముకలు బలంగా ఉంటాయి. ఇందులోని K Vitamin గాయాలను త్వరగా నయం చేస్తుంది.

క్యాలీఫ్లవర్ యాంటీ క్యాన్సర్, యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. కాలీఫ్లవర్లోనిIndole-3-carbinol is అనే స్టెరాల్ క్యాన్సర్ కి విరుద్ధంగా పోరాడుతుంది.
కాలిఫ్లవర్ ఎక్కువగా తీసుకుంటే, ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, అండాశయమునకు సంబంధించిన క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

క్యాలీఫ్లవర్ వ్యాధినిరోధక శక్తిని పెంచడంతో పాటు దంతాలనూ చక్కగా మెరిపిస్తుంది. ఇందులో పీచు ఎక్కువ కాబట్టి తినేటప్పుడు నోట్లో ఊరిల్లు ఊరుతుంది. ఇది దంతాల ఎనామిల్పై మరకలను పడకుండా చూస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీరు ఏదైనా అతిగా ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడమే ఉత్తమమైన మార్గం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me