TVS iQube :ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ధరలు ఇంత తక్కువనా? భారీగా డిస్కౌంట్స్ ప్రకటించిన TVS.

TVS iQube :ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ధరలు ఇంత తక్కువనా? భారీగా డిస్కౌంట్స్ ప్రకటించిన TVS.

బండిని కొనుక్కోవాలంటే సరైన సమయం ఇదే.ఈ దసరా పండగ సందర్భంగా భారీ భారీ డిస్కౌంట్లతో అనేక కంపెనీలలో స్కూటర్లు, బైకులు మార్కెట్ లో హంగామా చేస్తున్నాయి. వీటిలో TVS కంపెనీకి చెందిన iQube ఎలక్ట్రిక్ స్కూటర్లు భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. TVS ఐక్యూబ్ స్కూటర్లు రూ.27 వేలకు పైగా తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ ఆఫర్ ను ఎలా సొంతం చేసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రస్తుతం పండగ ఆఫర్లతో రూ.27,000 వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ ఆఫర్‌లో Cashback, credit card offers ను పొడిగించిన సరే, వారంటీలు కూడా ఉన్నాయి.


స్వదేశీ మార్కెట్లో అత్యంత విజయవంతమైన Electric scooters లో ఈ టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ ఒకటి. ఇది క్యాష్‌బ్యాక్, క్రెడిట్ కార్డ్ మొదలైన ఆఫర్‌లతో వస్తుంది. TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు Festive offerలతో ఇండియాఅంతటా అందుబాటులో ఉంది. TVS కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆఫర్లు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి.

టీవీఎస్ ఐక్యూబ్ 2.2kWh బ్యాటరీ ప్యాక్‌తో రూ. 17,300 క్యాష్‌బ్యాక్‌తో లభిస్తుంది.
నిర్దిష్ట బ్యాంక్ కార్డ్‌లపై రూ.7,700 అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

TVS iQube 3.4 kWh బ్యాటరీతో iQubeని ఎంచుకుంటే ఫ్లాట్ రూ.20,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తోంది.
కొనుగోలుదారులు నిర్దిష్ట బ్యాంకు కార్డులను స్వైప్ చేయడం ద్వారా అదనంగా రూ.10,000 ఆదా చేసుకోవచ్చు.

టీవీఎస్ ఐక్యూబ్ S మోడల్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే, కంపెనీ ఫ్రీగా పొడిగించిన వారంటీని కూడా అందిస్తోంది.
దసరా పండగ సందర్భంగా కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఆఫర్లు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ ఆఫర్లు అక్టోబర్ 31, 2024 వరకు వర్తిస్తాయి.

TVS ఈ ఆఫర్లు 2.2kWh బ్యాటరీతో 75 km ప్రయాణించవచ్చు. దీని మాక్సిమం స్పీడ్ 75 kmph. 2 గంటల్లో బ్యాటరీని 0-80 % వరకు ఛార్జ్ అవుతుంది. ఈ బండి స్టార్టింగ్ ధర రూ.89,999.

TVS iQube 3.4kWh బ్యాటరీ మోడల్ గరిష్ట వేగం 100 km. ఇది 4 గంటల్లో 0-80 % వరకు ఛార్జ్ అవుతుంది. దీని ధర రూ.1,26,628.
TVS iQube s 3.4kWh బ్యాటరీ మోడల్ గరిష్ట వేగం 100 km. ఇది నాలుగు గంటల్లో 0-80 % వరకు ఛార్జ్ అవుతుంది. దీని ధర రూ.1,44,420.
TVS iQube st 3.4kWh బ్యాటరీ మోడల్ గరిష్ట వేగం 100 km. ఇది మూడు గంటల్లో 0-80% వరకు ఛార్జ్ అవుతుంది. దీని ధర రూ.1,55,555.

పెరిగిన మార్కెట్ కు అనుగుణంగా సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలను (EV) ప్రోత్సహించడానికి ఇండియా ప్రభుత్వ చొరవకు అనుగుణంగా TVS మోటార్ దాని iQube EV శ్రేణిపై గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. అధికారిక TVS మోటార్స్ వెబ్‌సైట్ ప్రకారం TVS iCube SD 5.1 kWh మినహా, కొత్త PM E-డ్రైవ్ చొరవ కింద టీవీఎస్ ఐక్యూబ్ అన్ని మోడళ్ల యొక్క అసలు ధరల్లో రూ.10,000 తగ్గింపు వస్తుంది. ఎంట్రీ-లెవల్ 2.2 kWh వేరియంట్ మొత్తం రూ. 27,300 తగ్గింపుతో అందుబాటులో ఉంది.

TVS iQube స్కూటర్లపై రూ.17,300 క్యాష్‌బ్యాక్ ఉంది. 3.4 kWh, S 3.4 kWh వేరియంట్‌ల రేట్ లపై రూ. 10,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇచ్చారు. వీటితో పాటు 5 సంవత్సరాలు లేదా 70,000 కి.మీ. పొడిగించిన వారంటీ ఇస్తున్నారు. దీని విలువ సుమారు రూ. 5,999. SD 3.4 kWh మోడల్ పై ప్రత్యేకంగా రూ. 10,000 PM E-డ్రైవ్ ప్రోత్సాహంతో అందుతుంది. ఇది కాకుండా TVS మోటార్ HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌లతో కలిపి రూ. 7,500, రూ. 10,000 వరకు తగ్గింపులను అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఇంత భారీగా డిస్కౌంట్లు రావడం చాలా అరుదు. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలనుకున్న వారికి ఇదే మంచి సమయం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me