Deepawali 2024 లో దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది?ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే…About Diwali in Telugu.
చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ ఈ Deepawali 2024. దీపావళి.. ఈ పండగ చెడుపై మంచి గెలిచిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. గృహంలో ప్రతికూల శక్తులను తొలగించి,నూతన వెలుగులు తీసుకొచ్చేటువంటి గొప్ప పండుగ.హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతస్తులు కూడా ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినమే Shubh Deepawali.
ఈ ఏడాది దీపావళి ఎప్పుడు వచ్చిందంటే..Deepawali 2024 పండుగ 2024 సంవత్సరంలో, ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 1వ తేదీ వచ్చింది. October 29 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు ఈ దీపావళి పండుగ ఉత్సవాలు జరుగుతాయి.ఈ తేదీని హిందూ చాంద్రమాన క్యాలెండర్ ద్వారా నిర్ణయించబడుతుంది, ఇది అశ్వినీ మరియు కార్తీక మాసాలలో వస్తుంది, ఇది సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్లో సెప్టెంబర్ మధ్య నుండి నవంబర్ మధ్య వరకు ఉంటుంది.
ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజున జరుపుకునే ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది Deepawali 2024 Date పండుగ నవంబర్ 1వ తేదీ వచ్చింది. October 29 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు ఈ దీపావళి పండుగ ఉత్సవాలు జరుగుతాయి.ఈ సందర్భంగా దీపావళి పండగ విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
About Diwali in Telugu : హిందువుల ప్రధాన పండుగల్లో దీపాల పండుగ దీపావళి ఒకటి. కులానికి , మతానికి , ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ కలిసి హ్యాపీగా దీపావళి పండుగ జరుపుకుంటారు. ఆశ్వయుజ అమావాస్య రోజున ఈ పండుగ జరుపుకుంటారు. రామాయణంలోను దీపావళి పండుగ గురించి ప్రస్తావించారు. పద్నాలుగు సంవత్సరాలు వనవాసంను పూర్తి చేసుకుని, రావణాసురిడిని సంహరించి శ్రీరాముడు అయోధ్యకు చేరిన సంతోషంతో ఈ పండుగని జరుపుకుంటారు.
Deepawali Wishes పండుగ రోజు లక్ష్మీదేవికి, వినాయకుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. చెడుపై మంచి గెలిచిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టి 2024 లో Happy Diwali పండుగ నవంబర్ 1వ తేదీ వచ్చింది. October 29 నుంచి November 3వ తేదీ వరకు దీపావళి పండుగ ఉత్సవాలు జరుగుతాయి. ధనత్రయోదశితో మొదలైనటువంటి ఈ దీపావళి పండుగ బాయ్ ధూజ్ తో ముగుస్తుంది.
దీపాలను వెలిగించి..
రామాయణంలోనూ Dev Deepawali 2024 ప్రస్తావన ఉంది. పురాణాల ప్రకారం.. భూదేవికి , వరహా స్వామికి అసుర టైంలో పుట్టిన అతనే ఈ నరకాసురుడు.. శ్రీహరి చేతిలో మృత్యువు లేని విధంగా తన తల్లి చేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు. ఇచ్చిన వరము గర్వంతో లోక కంటకుడిగా తయారైన ఈ నరకాసురుడి ముల్లోకాలను పట్టిపీడించాడు.
నరకాసురుడి యొక్క బాధలను భరించలేని దేవతాముర్తులు, మునులు, గంధర్వులు ఇలా అందరు కలిసి, ఆ శ్రీహరికి తమ యొక్క గోడు వెళ్లబోసుకున్నారు. కాబట్టి వారి మొర ఆలకించినటువంటి శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతారమును ఎత్తి, సత్యభామతో నరకాసురుని సంహరింపజేస్తాడు.నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు.ఈ చతుర్దశి నాడు నరకాసురుడు మరణించగా, ఆ మరుసటి రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.
దీపావళి అంటే దీపాల వరుస అన్ని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగగా కూడా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన ఈ దీపావళి పండగ వేడుకలు..కార్తీకమాస శుద్ద విదియ ‘భగినీహస్త భోజనం’’తో ముగుస్తుంది.
ధంతేరాస్ లేదా ధన త్రయోదశి..ధనలక్ష్మిపూజ.
ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, పాత సామాన్లను కూడా శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసినటువంటి వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెట్టుకుంటే, ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మీ, కుబేరులను ఇద్దర్ని కూడా భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.
Happy Diwali Wishes బంగారం, వెండి కాకుండా ధన త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసి కూడా మంచి ఫలిత ,శుభాలు జరుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ఈ ధన త్రయోదశి రోజునే లక్ష్మీ దేవి ఉద్భవించినట్టు కూడా పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ పండగ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృతభాండం అవుతుందని చాలా మంది యొక్క నమ్మిక.
Deepawali 2024 Wishes పండుగ ప్రారంభం రోజు ధన త్రయోదశి జరుపుకుంటారు.ఈ రోజును “ధంతేరాస్” అని కూడ పిలుస్తారు. ఆ రోజున కుబేరుడు, లక్ష్మీదేవిని పూజిస్తారు. 2024 లో ధన త్రయోదశి october 29 న వచ్చింది. ఈరోజు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి సంప్రదాయం ఉంది. ఇంటిని చక్కగా క్లిన్ చేసి సామాన్లు అన్ని శుభ్రం చేసుకుంటారు. నూతనంగా కొనుగోలు చేసిన బంగారు, వెండి వస్తువులు పూజలో పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు. ఆరోజున లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి యొక్క కటాక్షం పొందుతారని చెబుతుంటారు.
చోటీ దీపావళి :
చోటీ దీపావళినే ఇంకా నరక చతుర్ధశి అని కూడా పిలుస్తారు. భూదేవి, వరాహ స్వామికి నరకాసురుడు జన్మిస్తాడు. శ్రీహరి చేతిలో చావులేకుండా ,కేవలం తల్లి చేతిలోనే మరణించేటువంటి వరంను పొంది ఉంటాడు.తనకు చావు లేదనే గర్వంతో ముల్లోకాల మీద తన ఆధిపత్యం చేయాలని చూశాడు.
నరకాసురుడి పెట్టేటువంటి బాధలను భరించలేక దేవతలు అందరూ వెళ్ళి శ్రీహరికి తమ భాధను వెళ్లబోసుకుంటారు. వాళ్ళ మొర ఆలకించినటువంటి విష్ణుమూర్తి ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుడిని సంహరించేలా చేస్తాడు. నరకాసుర సంహారంతో అందరూ సంతోషంగా దీపావళి చేసుకుంటారు. చీకటిని పారద్రోలుతూ వెలుగును ఇచ్చిన పండుగగా, చెడు మీద మంచి గెలిచిన దానికి ప్రతీకగా ఈ Deepawali 2024 పండగ జరుపుకుంటారు. ఈరోజు హనుమంతుడిని కూడా పూజిస్తారు.
గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్ :
చోటీ Deepawali 2024 తర్వాత గోవర్ధన్ పూజ చేస్తారు. ఆ మరుసటి రోజు భాయ్ ధూజ్ నిర్వహిస్తారు. 2024 లో November 2వ తేదీన గోవర్దన్ పూజ జరిపితే, November 3 న భాయ్ ధూజ్ చేస్తారు. శ్రీకృష్ణుడు గోవర్థన పర్వతాన్నిచిటికెన వేలితో ఎత్తాడని కూడా పురాణాలు చెబుతున్నాయి. అందుకే గోవర్థన్ పూజని కూడా చేస్తారు.
Deepawali 2024 గోవర్థన పూజ చేసిన తర్వాత భాయ్ దూజ్ జరుపుకుంటారు. ఉత్తర భారతీయులు ఈ పండుగ ఎక్కువగా జరుపుకుంటారు. దీనికి ఉన్న మరొక పేరు భగినీ హస్త భోజనం అనే పేరుతో పండగ ఉత్సవాలు జరుపుకుంటారు. ఆ దినం సోదరులకి తమ సోదరీమణులు స్వయంగా తమ చేత్తోనే వంట చేసి తినిపిస్తారు. అందుకు బదులుగా సోదరులు తమ సోదరీమణులకి బహుమతులు ఇస్తుంటారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా ఈ వేడుకను జరుపుకుంటారు.
ధన్వంతరి జయంతి..
ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయినటువంటి ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే జరుపుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం.. అలాంటి మహాభాగ్యానికి అవసరమైనటువంటి ఔషధకర్త ఈ ధన్వంతరి. కాబట్టి ఆయన కూడా సముద్రమును చిలికినపుడు లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్యశక్తులతోపాటు ధన్వంతరి కూడా ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృతము ను , మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథం పట్టుకొని తను పాల సముద్రం నుంచి ఉద్భవిస్తాడు.అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుంచి త్వరిత ఉపశమనం కలగడానికి ఈ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తుంటారు.
ధన్వంతరి పూజ అనేది కూడా శ్రీమన్నారాయణుని అంశ అని భావిస్తారు.ఆయనను పూజించడంతో లక్ష్మీదేవి సంతోషించి, అనుగ్రహిస్తుందని కూడా అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధన త్రయోదశి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది.
దీపావళి అమావాస్య..
ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ. ఈ టైం లో ఇంటిని శుభ్రం చేసి, రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి పెరట్లో ఇలా దీపాలను వెలిగిస్తారు. గోగు కర్రలకు గడ్డి పరకలతో కాగడాలుగా తయారుచేసి వాటిలో దీపం కుందను పెట్టి, దానిలో నూనె ,వత్తులు వేసి దీపంను వెలిగిస్తారు.
అంతేకాకుండా గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి, వాటిని వెలిగించి, వాటిని గుమ్మాల్లో నేల మీద కొడుతూ… ఈ విధంగా ‘దిబ్బి దిబ్బి Deepawali 2024 , మళ్ళీ వచ్చే నాగులచవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుటుక్కు దెబ్బ! అని పాడతారు.అలా చేసిన తర్వాత గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోటవేసి, మల్లి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లి శుభానికి ప్రతీకగా మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని ఒక నమ్మకం.
తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నువ్వుల నూనెతో Diwali Rangoli లో దీపాలు వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం దగ్గర , తులసి కోట దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదంటే ఆవు నేయ్యి తో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మి దేవికి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు, సిరి సంపదలు ,అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి.ఈ Happy Deepawali రోజున లక్ష్మీపూజను చేయడంతో తమ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని వ్యాపారులు చాలా గట్టిగా నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే కూడా శుభప్రదం.
భగినీ హస్త భోజనం..
ఈ Rangoli for Diwali రోజును యమ ద్వితీయ, భాయిదూజ్‌గా జరుపుకుంటారు. సోదరులు తన సోదరి చేతితో స్వయంగా చేసిన వంటకాలతో భోజనం తింటే, వారికి మృత్యు భయాలు తొలగిపోతాయి. సూర్యభగవానుడి కుమారుడు యముడు, అతడి సోదరి యమున. యమి తన సోదరుణ్ని ఎంతగానో అభిమానించేది. రోజు తన మిత్రులతో గడుపుతూ , తాను ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో ఒక్క క్షణం తీరికలేక తన సోదరి అయిన యమున ఇంటికి యుముడు వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున ఒకరోజు ఇలా మాట తీసుకుంటుంది.అదేమిటంటే, కార్తీక శుక్ల విదియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది.
దీనికి యముడు ఇలా అంటాడు .నన్నెవరూ ఇంటికి పిలవరు.. అయినా నా తోబుట్టువైనటువంటి ఆడపడుచు స్వయంగా, ప్రేమగా ఆహ్వానించింది… కనుక వెళ్లితీరాలి అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, తన అన్నయ్యకి అభ్యంగన స్నానం చేయించి, తిలకంను దిద్ది, స్వయంగా తన చేతితో వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డింస్తుంది.
తన సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు తన సోదరి ఏటా ఈ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. దానికి తన సోదరుడైన యముడు తన కోరికకు సరే అని , వరం ఇవ్వడంతో , సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఈ పర్వదినం ఇప్పటికి ఆదర్శంగా నిలుస్తోంది.
బలి పాడ్యమి..
Deepawali 2024 మర్నాడు బలిపాడ్యమి. నరక చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి అవతారంలో పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతుంటారు. బలిచక్రవర్తికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును నవ దివస్‌గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజూ కూడా ఇదే Happy Deepawali 2024 .