ఆధార్ కార్డు యొక్క అవసరం మనకు నిత్యజీవితంలో ఎంత అవసరం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు, ఈ మధ్య చాలా సర్వీసెస్ కి ఈ ఆధార్ కార్డు తో అనుసంధానం చేయడం జరిగింది , ఆధార్ కార్డు ఎంత అవసరం ఉంటుందో అంత నష్టాన్ని తెచ్చిపెడుతుంది ఈ మధ్య కాలంలో ఈ కార్డు పైన online మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి, మన ఆధార్ కార్డు యొక్క details చోరీ చేసి మన బ్యాంకు అకౌంట్ లోంచి డబ్బులు డ్రా చేయడం లేదా అనేక రకాలుగా మోసం చేయడం జరుగుతుంది మరి మన ఆధార్ కార్డు details చోరీ కాకుండా ఉండాలి అంటే Online లో ఆధార్ కార్డు బయోమెట్రిక్ Lock / Unlock ఎలా చేయాలి? Aadhar Biometric Unlock Online అనేది చూద్దాం.
Online లో ఆధార్ కార్డు బయోమెట్రిక్ Lock / Unock ఎలా చేయాలి?
ముందుగా మీరు ఆధార్ కి సంబందించిన official Website ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
Easy Steps
Step 1:
గూగుల్ లో ఆధార్ బయోమెట్రిక్ లాక్ ( Aadhar Biometric Lock ) అని టైపు చేయండి తర్వాత సెర్చ్ చేయండి
Step 2 :
ఆధార్ సంబందించిన కొన్ని website లు ఓపెన్ అవుతాయి అందులో మొదటగా ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.
Step 3:
క్లిక్ చేయగానే మరొక విండో ఓపెన్ అవుతుంది ( welcome to my aadhar ) అని చూపిస్తుంది పక్కనే fingerprint సింబల్ ఉండుంది దాని కిందనే లాగిన్ అని కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి
Step 4:
వెంటనే మిమ్మల్ని మరొక పేజీ కి తీసుకెళ్తుంది అందులో మీ
ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి
క్రింద బాక్స్ లో Captcha ఎంటర్ చేయమని అడుగుతుంది.
Step 5:
ఆధార్ కార్డు నెంబర్ captcha ఎంటర్ చేశాక Send OTP ఆప్షన్ పైన క్లిక్ చేయండి
Step 6:
తర్వాత మరొక పేజీ ఓపెన్ అవుతుంది ( services ) అందులో చాలా సర్వీసెస్ ఉంటాయి Lock / Unlock Biometrics అనే ఆప్షన్ ఉంటుంది . దాని పైన క్లిక్ చేయండి
Step 7:
ఇప్పుడు How to Lock / Unlock Biometrics Works అనే ఒప్షన్స్ కనిపిస్తాయి, అక్కడ మీకు కొన్ని instructions ఉంటాయి అందులో మీరు బొయిమెట్రిక్ లాక్ చేస్తే ఏ ఏ సర్వీసెస్ ఆఫ్ అవుతాయి అని ఉంటుంది, Next పైన క్లిక్ చేయండి.
Step 8:
Please Select to Lock అనే ఆప్షన్ వస్తుంది , నెక్స్ట్ I Understand అనే ఆప్షన్ వస్తుంది అది టిక్ చేసి Lock Biometric temporarily అని ఉంటుంది దాని కిందనే Lock Biometrics Permanantly అని ఉంటుంది Next పైన క్లిక్ చేసినట్లయితే మీ బయోమెట్రిక్ సర్వీస్ అనేది లాక్ అయిపోతుంది . మళ్ళీ unlock చేయాలంటే మళ్ళీ అదే పేజీ లోకి లాగిన్ అయి unlock చేయొచ్చు .
Conclusion
మీ ఆధార్ బయోమెట్రిక్ యొక్క సర్వీస్ అనేది మీరు ఎప్పుడైనా lock చేయొచ్చు లేదా unlock చేయొచ్చు, మీరు ఆన్లైన్ ఫ్రాడింగ్ నుండి తప్పించుకోవాలంటే మీకు ఈ ఆప్షన్ అనేది
ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో 2 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది 1. Lock / Unlock permanent or Temporary.