Black Hair Tips in Telugu : తల స్నానము చేసే ముందు ఇలా చేయండి. మీ జుట్టు నల్లగా మారుతుంది.

Black Hair Tips in Telugu : తల స్నానము చేసే ముందు ఇలా చేయండి. మీ జుట్టు నల్లగా మారుతుంది.

Black Hair Tips in Telugu : జుట్టు నల్లగా, ఒత్తుగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా.. జుట్టు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే, మీ జుట్టు బ్లాక్ గా ఒత్తుగా మారుతుంది.

చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటించి,మీ జుట్టును Black Hair గా మార్చుకోవచ్చు. అంతేకాదు.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు సమస్యలు(Hair Problems) వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నాయి. స్ట్రెస్ , ఆందోళన, పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం కారణంగా,మీ జుట్టు సరిగా ఉండకపోవచ్చు. ఇలాంటి సమస్యల నుంచి ఇంట్లోనే చిట్కాలను పాటించి, బయటపడొచ్చు.

Black Hair Tips in Telugu : ఈ టిప్స్ లను తయారు చేసుకునేందుకు మెంతులు, కాళోంజి సీడ్స్ ను(Kalonji Seeds) ఉపయోగించాలి. మెంతులు, కాలోంజి విత్తనాల్లో చాలా పోషకాలు ఉంటాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వాటితో మీ జుట్టు బలంగా(Strong Hair) తయారు అవుతుంది. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

మెుదట ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. అందులో రెండు టీ చెంచాల మెంతులు, రెండు టీ చెంచాల కాళోంజి విత్తనాలను వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడకట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.ఇప్పుడు ఇందులో నిమ్మరసం(Lemon) వేసి కలుపుకోవాలి. ఇలా తయారు అయిన నీళ్లు చల్లగా అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్లలోకి స్ప్రే చేసుకోవాలి. ఆ నీటిలో దూదిని ముంచి మీ జుట్టు కుదుళ్లకు పట్టించుకోవచ్చు. తర్వాత సున్నితంగా మర్దనా చేయాలి. అలా ఓ అరగంట నుంచి గంటవరకూ ఉంచుకోవాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

అలా వారానికి రెండుసార్లు చేస్తే.. జుట్టు ఒత్తుగా పెంచుకోవచ్చు. ఈ టిప్ ని తయారుచేసుకునేందుకు,మొదట మీరు మెంతులు, కాళోంజి విత్తనాలను ఏ రెండింటిని పౌడర్ చేసుకుని,హెయిర్ ప్యాక్ లాగా ఉపయోగించుకోవచ్చు. జుట్టు సమస్యలతో బాధపడేవారు.ఈ టిప్ ను పాటించడం వలన నల్లజుట్టు(Black Hair) మీ సొంతం అవుతుంది. జుట్టు బలంగా ఉంటుంది. ఒత్తైన, పొడవైన, కాంతివంతంగా మీ జుట్టు తయారు అవుతుంది.

Black Hair Tips in Telugu : అంతేకాకుండా , ఉల్లిపాయ రసం (onion juice for hair) అనేది కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి శతాబ్దాల నుండి ఉపయోగించబడుతుంది. ఇందులో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, జుట్టును బలంగా పెరగడానికి సహాయపడుతుంది. ఈ ఉల్లిపాయ రసాన్ని కొబ్బరినూనె(Coconut Oil) మరియు మందార, కరివేపాకు వంటి మూలికలతో కలిపి అప్లై చేయడం వల్ల కుదుళ్లకు మంచి పోషణ లభిస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. దీన్ని మీ జుట్టుకు పెట్టుకుని కనీసం 30 నిమిషాలు అలాగే ఉంచండి.

ఉసిరి,కూడా మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, జుట్టు రాలడాన్ని(Hair Loss) నిరోధించడంలో ఉపయోపడుతుంది. ఇందులో విటమిన్ C ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ను నిర్మించడంలో, ఆరోగ్యకరమైన జుట్టుకు సహాయపడుతుంది. దీన్నివినియోగించడానికి, కొంచెం ఉసిరి పౌడర్ ని నీటితో కలిపి పేస్ట్‌గా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు Apply చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత కడిగేయండి. మీరు కొబ్బరి నూనె(Coconut Oil)తో ఉసిరి పొడిని మిక్స్ చేసి జుట్టుకు మసాజ్ చేయవచ్చు.

గమనిక : ఇక్కడ మీకు అందించినటువంటి ఈ సమాచారం మరియు సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే.దీనిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me