Black Rice Benefits In Telugu : బ్లాక్ రైస్ గురించి విన్నారా ? వాటిని తినడం వల్ల కలిగే లాభాలను తెలుసుకోండి..
Black Rice Benefits In Telugu : మన రోజు వారి ఆహారంలో బియ్యం తో వండిన ఆహారాన్ని మనం తింటూనే ఉంటాం.అవి చూడటానికి తెల్లగా ఉంటాయి కానీ మీకు తెలుసా బియ్యం లో కూడా అనేక రకాల కలర్ లో ఉంటాయి అని. వైట్, బ్లాక్, బ్రౌన్, బ్లాక్/పర్పల్ ఇలా అనేక రాకలో ఉంటాయి.ఇక్కడ మనం బ్లాక్ రైస్ యొక్క ఉపయోగాలు అలాగే వాటిలోని పోషకాలను ఇపుడు తెలుసుకుందాం.బ్లాక్ రైస్ ని అనేక దేశాలలో ఉపయోగిస్తారు,ఐతే మన దేశంలో మాత్రం ఇటీవల బాగా ప్రభున్యతను పొందుతుంది.
మన భారత దేశం విషయానికి వస్తే నార్త్ ఇండియా లో దీనిని ఎక్కువగా పండిస్తారు.వెస్ట్ బెంగాల్, ఒర్రిస్సా, జార్ఖండ్, మణిపూర్, మరియు అస్సాం ప్రదేశాలలో వీటిని ఎక్కువగా పండిస్తుంటారు.మరిన్ని వివరాలు క్రింద తెలియజేయడం జరిగింది.
బ్లాక్ రైస్ ని మనం అనేక విధాలుగా సేవించవచ్చు సలాడ్స్, సైడ్స్ ,స్టిర్ ఫ్రైస్, డెస్ర్టీస్(బ్లాక్ రైస్ పుడ్డింగ్) మరియు వేగన్ చీజ్ లాగా ఉపయోగిస్తారు. అనేక ఉపయోగాలను కలిగిన బ్లాక్ రైస్ వాటి ఉపగోగాలని క్రింద జత చెయ్యడం జరిగింది క్లుప్తంగా చదవండి
బ్లాక్ రైస్‌లో అనేక పోషకాలు విరివిగా ఉంటాయి. ఈ బియ్యం రోజువారీ మన ఆహారంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడమేకాకుండా.. కళ్లకు కూడా ఎన్నో ఉపయోగాలను చేకూరుస్తుంది..
బ్లాక్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
బ్లాక్ రైస్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడం లో తోడ్పడుతూ వుంటాయి.తద్వారా గుండె సంబందించిన వ్యాధుల నుంచి రక్షణ ఏర్పడుతుంది.
బ్లాక్ రైస్ తినడం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుతుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడే కెరోటినాయిడ్స్ బ్లాక్ రైస్‌లో ఎక్కువ మోతాదులో ఉంటాయి. సూర్య రశ్మి, ఇతర హాని కలిగించే ప్రకాశవంతమైన వెలుగులు లేదా కాంతి కిరణాల నుంచి కళ్ళకు రక్షణగా లుటిన్, జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్లు ఈ బియ్యంలో ఉండటం మూలంగా కంటి ఆరోగ్యం మంచిగా ఉంటుంది.
Black Rice Benefits In Telugu బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్ రైస్ ప్రతి రోజూ తమ ఆహారంగా తీసుకోవచ్చు. ఈ బియ్యంలోని ప్రొటీన్లు, ఫైబర్ కారకాలు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేసి, త్వరగా ఆకలికాకుండా చేస్తుంది.
గమనిక : బ్లాక్ రైస్ వినియోగించడం లో ఎక్కువ శాతం లాభాలు కలిగిన సరే , వాటిని అధికంగా లేక అనవసర సమయంలో వాటిని తింటే కడుపులో గ్యాస్ సమస్యలకు దరి తీసే అవకాశం వుంది. కాబ్బటి వాటిని మితంగా తినడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.