Butterfly Pea Flower in Telugu:ఈ పుష్పాల టీ ని ప్రొద్దున్నే తాగితే చాలు.మీకు మీ అందంతో పాటు మీ ఆరోగ్యం కూడా రెట్టింపు !

ఈ పుష్పాల టీ ని ప్రొద్దున్నే తాగితే చాలు.మీకు మీ అందంతో పాటు మీ ఆరోగ్యం కూడా రెట్టింపు ! Butterfly Pea Flower in Telugu.

Butterfly Pea Flower in Telugu శంఖు పుష్పం లేదా బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ టీ (Butterfly Pea Flower Tea) అనేది నీలం రంగులో ఉండే ప్రత్యేకమైన పుష్పాలతో తయారు చేసినటువంటి ఒక ఔషధ పానీయం. ఈ టీ కి ఆయుర్వేదంలో మరియు ఇతర ప్రాచీనమైన ఔషధ విధానాలలో ఒక ప్రత్యేకమైన స్థానంను కలిగి ఉంది.

Butterfly Pea Flower Tea Benefits శంఖు పుష్పంతో తయారు చేసుకున్నటువంటి టీని త్రాగడం వల్ల బ్రెయిన్ యొక్క ఆరోగ్యం మరియు ఇమ్యూనిటీ పవర్ , అందమైన చర్మం, జీర్ణక్రియపని తీరు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ టీకి ప్రత్యేకమైన నీలం రంగు కారణంగా ఇది అట్రాక్టివ్ గా కనిపించడం మాత్రమే కాకుండా, శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Shankhpushpi Syrup శంఖు పుష్పం ప్రాధానంగా Mental health ని మెరుగుపరిచే ఔషధ మొక్కగా చెప్పబడుతుంది. వీటి నీలి పుష్పాల నుంచి తీసినటువంటి రసంలో యాంటీ ఆక్సిడెంట్లు నాడీ వ్యవస్థకు చాలా బాగా సహాయపడుతాయి. ప్రశాంతతని అందిస్తాయి. ఇది మెదడు ఫంక్షన్లను పెంపొందించి, మానసిక స్థైర్యాన్ని మెరుగుపరుస్తుంది.

Butterfly Pea Flower in Telugu ఈ శంఖు పుష్పాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వలన , అవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో దోహద పడుతుండడమే కాకుండా, కణజాలాల యొక్క పునరుద్ధరణకు సాయపడుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడటానికి, వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయడంలో, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ఈ టీ తరచుగా తాగడం వల్ల ఇమ్యూన్ పవర్ బలపడుతుంది. శంఖు పుష్పంలో ఉండే ఫ్లావనాయిడ్లు , ఇతర పోషకాలు శరీర నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రకృతిలో కలిగే,మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు వంటి వ్యాధులను నయం
చేస్తాయి.

Butterfly Pea Flower in Telugu శంఖు పుష్పాన్ని డిటాక్సిఫికేషన్ గుణాలు ఉన్నవిగా భావిస్తారు. రక్తంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపించడానికి, కాలుష్య ఫ్రీ రక్తప్రసరణను ప్రోత్సహిస్తుంది.దీని వలన రక్తంలో పోషకాలు సులభంగా ప్రసరిస్తాయి, శరీరంలో ఇమ్యూనిటీ , ఉల్లాసం నింపడంలో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది.

Butterfly Pea Flower in Telugu శంఖు పుష్పం యొక్క ఆకులలో గ్లూకోజ్ Absorptionను నియంత్రించేటువంటి గుణాలు ఉన్నాయి. ఇది షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని యాంటీ డయాబెటిక్ గుణాలు తక్కువ శక్తివంతమైన మధుమేహ నియంత్రకంగా ఉపయోగపడుతాయి, దీని వల్ల మధుమేహంతో బాధపడేవారికి మంచి సహాయం అందిస్తుంది.

ఈ టీని తాగడం వలన జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శంఖు పుష్పం టీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలు, గ్యాస్, అల్సర్ వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది.

శంఖు పుష్పం టీ రెగ్యులర్ గా తాగడం మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఇది నాడీ సంబంధిత టెన్షన్, ఆందోళనను తగ్గిస్తుంది. ఇది మానసిక ప్రశాంతతనిచ్చి ఆందోళన, నిరాశ వంటి భావజాలాలను నియంత్రిస్తుంది.

శంఖు పుష్పం యొక్క యాంటీ హైపర్టెన్సివ్ లక్షణాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయి. ఈ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటు, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలను నియంత్రించుకోవచ్చు.

శంఖు పుష్పం లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలతో కూడి ఉండటం వల్ల సీజనల్ వ్యాధులకు వ్యతిరేకంగా ఉంటూ, రక్షణనిస్తుంది. ఈ గుణాలు శరీరాన్ని వివిధ వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి కాపాడటంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఉంటాయి.

శంఖు పుష్పం టీ తాగడం వల్ల నిద్ర సమస్యలు ఉన్నవారికి సహాయపడుతుంది. రాత్రి భోజనము చేసిన తర్వాత ఈ టీ త్రాగితే, నిద్రకు అవసరమైన ప్రశాంతత, సౌకర్యాన్ని అందిస్తుంది. దీనివల్ల తేలికగా నిద్రపోవచ్చు.

గమనిక : ఈ సమాచారాన్ని అంతర్జాలం నుడి మరియు నిపుణుల సలహా మేరకు తీసుకోవడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసము మాత్రమే.దీన్నీ అతిగా తీసుకునే,వారు మాత్రం వైద్యుల , నిపుణుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top