Corn Tomato Recipe కార్న్ టమాటో : ఎంతో రుచికరమైన కార్న్ టమాటో తయ్యారి విధానాన్ని ఇక్కడ చూసేయండి !
కార్న్ టమాటో తయారీ విడనాంకి కావాల్సిన పధార్థాలు
- స్వీట్ కార్న్ : ఒక కప్పు
- ఉల్లిపాయ : ఒకటి
- టొమాటో గుజ్జు : అరకప్పు
- టొమాటో : ఒకటి
- అల్లంవెల్లులి పేస్టు : రెండు చెంచాలు
- జీడిపప్పు పేస్ట్ : టేబుల్ స్పూన్
- పచ్చి మిర్చి : మూడు
- కారం : రెండు చెంచాలు
- ఉప్పు : తగినంత
- నూనె : రెండు టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క : ఒక చిన్న ముక్క
- లవంగాలు : రెండు
- యాలకులు : రెండు
- జీలకర్ర : ఒక చెంచా
- కొత్తిమీరా తరుగు : పావుకప్పు
Corn Tomato Recipe తయ్యారి విధానం
ముందుగా స్టవ్ మీద కడాయి అయినా లేదా వేరే మీరు యెంచుకున్న పాత్ర పెట్టి…నూనె వేసి అది కాస్త వేడి అయ్యాక అందులో….జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు, యలకుల్ని వేసి అవి వేయించుకోవాలి, ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయలు ముక్కలు వెయ్యాలి. అవి వేగుతునప్పుడు
అందులో టొమాటో తరుగు, అల్లంవెల్లులి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలపాలి. ఆ తరువాత కారంపొడి, గరం మసాలా, హల్దీ, కసూరి మెంతి, మిశ్రమానికి తగినంత సాల్ట్, టొమాటో గుజ్జు వేసి కలపాలి . ఈ మిశ్రమాన్ని కాస్త మగ్గుతున్న సమయంలో కార్న్ వేసి అందులో అలాగే కప్పు నీళ్లు పోసి కాసేపు మూత పెటేసేయ్యాలి . కాసేపటికి మూత తీసి అది ఉడికి… దగ్గరకు అయ్యే సమయంలో కాస్త వెన్న, కొత్తిమీర వేసి కలిపి దింపెయ్యాలి..తర్వాత ఆ కర్రీని మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చు.. అంతే ఎంతో రుచికరమైన టేస్టీ కార్న్ టొమాటో రెడీ…