ఇంటర్మీడియేట్ అర్హతతో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ.CSIR CLRI Recruitment.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కి సంబంధించిన సెంట్రల్ లెథర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి 05 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు.
CSIR CLRI Recruitment ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు.10+2 లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి, 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారాన్ని చదివి వెంటనే అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకోండి.
అప్లికేషన్ చేసే ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 2nd నవంబర్ 2024.
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ : 1st డిసెంబర్ 2024.
అప్లికేషన్ ఆఖరి తేదీ తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేరు. కావున త్వరగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి.
ఉద్యోగాల వివరాలు, వాటి యొక్క అర్హతలు :
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కి సంబంధించిన సెంట్రల్ లేత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి 05 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. SC,ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు మరో 10 సంవత్సరాల వయో సడలింపు.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
Online లో అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు 2.30 గంటలపాటు 200 Objective ప్రశ్నల పై written test ని నిర్వహిస్తారు. పార్ట్ 1 లో 100 ప్రశ్నలు, పార్ట్ 2 లో 100 ప్రశ్నలు ఉంటాయి.మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయడం ఉత్తమము.
జీతభత్యాల వివరాలు:
ఎంపికైన అభ్యర్థికి నెలకి ₹ 35,000/- వరకు శాలరీలు ఉంటాయి. Govt Jobs అయినందున అన్ని విధాలా అలవెన్సెస్, TA,DA,HRA కూడా చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
CSIR CLRI Recruitment ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు ₹ 100/- ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కావలసిన పత్రాలు:
10th,10+2/ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు.
స్టడీ సర్టిఫికెట్స్ ( 1st నుండి 10 th వరకు)
ఎలా అప్లై చేయాలి:
ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద ఉన్న లింక్స్ ద్వారా వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోగలరు.
సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.