E Rikshaw : కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఒక్కసారి ఛార్జింగ్ తో 95 కి.మీ తీసుకెళ్తుంది.. దీని ధర ఎంతంటే..?

E Rikshaw : కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఒక్కసారి ఛార్జింగ్ తో 95 కి.మీ తీసుకెళ్తుంది.. దీని ధర ఎంతంటే..?

E Rikshaw : పట్టణాల్లో రిక్షా నడపాలి అనుకునేవారికి ఒక గుడ్ న్యూస్. కొత్తగా గోదావరి ఎలక్ట్రిక్ మోటర్స్ వారు ఈ రిక్షాను లాంచ్ చేసింది. ప్రయాణికులను ఇందులో సౌకర్యవంతంగా తీసుకెళ్లవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 95 కి.మీ పరిధి వరకు ఇస్తుంది.

E Rikshaw :ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయినటువంటి Godavari ఎలక్ట్రిక్ మోటార్స్ వారు ప్రపంచ EV దినోత్సవం సందర్భంగా Eblu Cety పేరుతో ఒక కొత్త ఆటో మోడల్‌లో ఈ ఆటో రిక్షాను విడుదల చేసింది. రూ. 1,99,999/- ఎక్స్-షోరూమ్ ధరతో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ వాహనం పట్టణ రవాణా పరిసరాల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా అప్‌డేట్‌గా రూపొందించారు. డ్రైవర్ తో నలుగురు ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే విధంగా సీటింగ్ కెపాసిటీతో, సిటీ వీధుల్లో డ్రైవింగ్ చేయడానికి అనువైన ఎంపిక అని కంపెనీ పేర్కొంది.

ఈ రిక్షాలో అధిక విజిబిలిటీ, ఆటోమేటిక్ వైపర్ ఉన్నాయి. దీని పనితీరు వారీగా, Eblu Cety గరిష్టంగా 25kmph వేగాన్ని అందుకోగలదు. ఒక్క ఛార్జ్‌కి 95 కి.మీ దూరం వెళ్లగలదు. దీని గ్రేడబిలిటీ, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ పట్టణ ప్రయాణానికి పూర్తి సమర్థవంతమైన ఎంపికగా ఉంటుంది.

E Rikshaw : WCT, 51.2V వోల్టేజ్, 100Ah సామర్థ్యం కలిగిన శక్తివంతమైన Li-Ion బ్యాటరీ గరిష్టంగా 1.6kW శక్తిని, 20Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బలమైన పవర్‌ట్రెయిన్ వాహనం ఫార్వర్డ్, రివర్స్ మోడ్‌లతో ప్రతిస్పందించే డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఈ-రిక్షా డ్రైవర్, ప్రయాణికులకు సౌకర్యాన్ని అందిస్తుంది. హ్యాండిల్ లాక్ ఫీచర్ అదనపు భద్రతను అందిస్తుంది. వాహనం ఒక ఏడాది అంటే 12 నెలలు లేదా 20,000 కిమీల వారంటీతో పాటు బ్యాటరీ, ఛార్జర్‌తో 3 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ వరకూ వారంటీ ఇస్తారు.

పొడవు చుస్తే , 2170mm వీల్‌బేస్, 993mm వెడల్పు, 2795mm పొడవు, 1782mm ఎత్తుతో డిజైన్ చేయడం జరిగింది. కనీసం 240 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌‌తో ఈ-రిక్షా వివిధ పట్టణ ప్రాంతాల గుండా సులభంగా నడపడానికి అనుమతిస్తుంది. ఈ వెకిల్ ముందు భాగంలో DCPD, వెనుక భాగంలో షీట్ మెటల్ బాడీ ఉంది. వాహనం 48V, 20Amp హోమ్ ఛార్జర్‌తో వస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్స్ ప్రకారం, only 4 గంటల 30 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్‌తో కూడిన డ్యూయల్ ఫ్రంట్ ఫోర్క్, ముందువైపు కాయిల్ స్ప్రింగ్‌లు, వెనుకవైపు 6-లీఫ్ స్ప్రింగ్‌‌లు ఉన్నాయి. ఇది సరిగాలేని రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణాన్ని అందిస్తుంది. మెకానికల్ Drum brake system 3.75×12 అంగుళాలు, 4PR టైర్‌లతో స్థిరత్వం, పట్టును అందిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me

Leave a comment

error: Content is protected !!