Electric Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ గా కూడా వచ్చేసింది. దీని ఫీచర్స్ ఇక అదుర్స్.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ గా కూడా వచ్చేసింది. దీని ఫీచర్స్ ఇక అదుర్స్.Electric Royal Enfield.

Royal look కి కేరాఫ్ అడ్రస్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ Production లోకి అడుగుపెట్టింది. భవిష్యత్తును అంచనా వేస్తూ, ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు Tech నిపుణులు చెబుతున్నారు. ఇటీవలే రాయల్ ఎన్ ఫీల్డ్ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ‘Flying Flea C6’ని విడుదల చేసింది. మరి ఈ బైక్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి? మైలేజ్, కలర్స్ తదితర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

రాయల్ ఎన్ఫీల్డ్ ఒక An Indian multinational motorcycle manufacturing company. అత్యంత పురాతనమైన ప్రపంచ మోటార్‌సైకిల్ బ్రాండ్. 1 st రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను 1901లో The Enfield Cycle Company ఇంగ్లండ్ లో తయారు చేయడం జరిగింది. స్వదేశీ ఇండియన్ మద్రాస్ మోటార్స్ ద్వారా అసలైన ఇంగ్లీష్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి లైసెన్స్ పొందింది.

ఈ కంపెనీ ఇప్పుడు ఇండియా వాహన తయారీ సంస్థ అయిన Eicher Motors యొక్క అనుబంధ సంస్థ. ఈ కంపెనీRoyal Enfield Bullet, Classic 350, Royal Enfield Thunderbird, Meteor 350, Classic 500, Interceptor 650, Continental, Hunter 350 వంటి క్లాసిక్ లుక్ ఉండే మోటార్‌సైకిళ్లను తయారు చేస్తుంది.

Royal Enfield తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఇటలీలోని మిలాన్ నగరంలో ఇటీవల ఆవిష్కరించింది. ‘Flying Flea C6’ మార్చి 2026 నాటికి విడుదల కానుంది. ‘Flying Flea’ అనేది రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం కొత్త Sub brand. త్వరలోనే S6 Scrambler కూడా రానుంది.

రెండవ ప్రపంచ యుద్ధంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారు చేసిన మోటార్‌సైకిల్ ఆధారంగా Flying Flea C6 ను డిజైన్ చేశారు. Low slung bobber style, rake out, girder style fork లతో 1940ల నాటి సస్పెన్షన్ స్టైల్‌ను ఇది పోలి ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్, వృత్తాకార హెడ్‌లైట్, టెయిల్-లైట్, ఎల్‌ఈడీ ఇండికేటర్లు ఇందులో ఉన్నాయి.

వృత్తాకార TFT Instrument cluster బండి వేగాన్ని, ప్రయాణించిన దూరం,Battery,Range వంటి వివరాలను చూపిస్తుంది. నావిగేషన్ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉండవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS, క్రూయిజ్ కంట్రోల్, ఐదు రైడింగ్ మోడ్‌లతో ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి బైక్ అని చెప్పొచ్చు.

Electric Royal Enfield ఫ్లయింగ్ ఫ్లీ C6 అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఇది బడ్జెట్ EVలలో చాలా అరుదు. ఈ ఫ్రేమ్ లోపల మెగ్నీషియం బ్యాటరీ కవర్ ఉంది. Battery pack గురించి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇది 5kWh కంటే పెద్ద Battery pack ను కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 నుంచి 200 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు.

Electric Royal Enfield C6 చిన్న టైర్లను కలిగి ఉంది. ఇవి నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. రోలింగ్ రెసిస్టెన్స్‌ను తగ్గించడం ద్వారా రేంజ్ పెరుగుతుంది. 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ మధ్యలో ఇ-మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇరువైపులా డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఒకే సీటు ఉంది. వెనుక కూర్చునే వారికి పిలియన్ సీటును ఆప్షన్‌గా అందించవచ్చు లేదా డ్యూయల్ సీట్లతో మరో వేరియంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.Electric Royal Enfield .

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me