మెంతులతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ? fenugreek seeds in telugu

Fenugreek Seeds in telugu ను హిందీలో మెంతి దాన అని కూడా పిలవబడే మెంతి గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మీ ఆరోగ్యానికి అద్భుతమైన రుచిని అందించడం నుండి వివిధ సాధారణ వ్యాధుల నుండి ఉపశమనం పొందడంలో మెంతి దాన సహాయపడుతుంది. మరియు యాంటాసిడ్ గా పని చేస్తుంది. మెంతుల్లో పోలిక్ ఆసిడ్,రైబోఫ్లెమిన్,కాపర్,పొటాషియం,కాల్షియమ్,ఐరన్,మగ్నిషేయం తో పాటు విటమిన్ ఎ,బి6,సి,కే,పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. Fenugreek Seeds తీసుకోవడం వల్ల జీర్ణక్రియ,బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రాత్రిపూట నానబెట్టిన మెంతులు గోరువెచ్చని నీటిలో ఉదయం తీసుకోవడం వల్ల అవాంఛిత క్రొవ్వును తొలగించే గుణం ఉంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ని సమతుల్య స్థాయిలో ఉంచడానికి ఉపయోగిస్తారు.
మెంతి టీ త్రాగొచ్చు.మీరు రోజు మెంతి త్రాగితే కొలెస్ట్రాల్ లెవెల్ మీ శరీరంలో సమతుల్య స్థాయిలో ఉంటుంది. ఈ మెంతి టీ ని సిద్ధం చేయడానికి ముందుగా మెంతి గింజలను అవసరమైన మొత్తంలో తీసుకొని వాటిని చూర్ణం చేసి మీడియం వేడి మీద 1 గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఈ నీళ్ళని వడపోసి ఆందులో 1 టీ స్పూన్ తేనె కలుపుకొని రోజు ఉదయాన్నే తాగితే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి అంటి-యాక్సిడెంట్ స్థాయి పెరుగుతుంది.

మొలకెత్తిన మెంతికూరలో గెలక్టోమన్ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల శరీరం అదనపు కొలెస్ట్రాల్ని గ్రహించి,పేగుల్లో ఎక్కువ బైల్ యాసిడ్ ని స్రవిస్తుంది. ఒక పిడికెడు మెంతులను తీసుకొని నీటిలో తడిపి వస్త్రంలో కట్టాలి. మెంతులు మొలకైతే వరకు వేచి ఉంది ఉదయాన్నే మొలకెత్తిన మెంతులను తినండి ఫ్రై లా వండుకొని తినచ్చు.
మెంతులు – ఇంతులు
మహిళలు సౌందర్య పోషణలో కూడా మెంతులను విరివిగా వాడవచ్చు. బాగా మెత్తగా దంచిన మెంతి పౌడర్ లో కొద్దిగా తేనె కలిపిన మిశ్రమంలో ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి ఎండిన తర్వాత నీటితో చక్కగా కడిగేసుకుంటే …….. చర్మం భలే స్మూత్ గా ఉంటుంది. మెంతులలో ఉండే లెసిథిన్ కనుబొమ్మలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. నానబెట్టిన గుప్పెడు మెంతులను మెత్తని ముద్దగా నూరుకోవాలి. దీన్ని కనుబొమ్మలకు రాసుకొని 20,25 నిముషాలు తర్వాత తడి గుడ్డతో చాలా సున్నితంగా క్లీన్ చేసుకోవాలి. ఈలా వారానికి 3,4సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.ఇది మహిళలకి నెలసరి సమయంలో వచ్చే కండరాల నొప్పులకు మెంతులు దివ్యఔషదం అని చెప్పవచ్చు. వీటిని మన రోజు వారి వంటింట్లో ఉపయోగిస్తారు. fenugreek seeds in telugu వీటివల్ల మన చర్మానికి,ముఖానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

మన చర్మ ఆరోగ్యాన్ని పెంచే అంటి-ఆక్సిడెంట్లు,విటమిన్లకు మెంతులు పవర్ హౌస్ లాంటివి. వీటిని రెగ్యూలర్ గా వినియోగించడం వల్ల ముఖానికి సహజమైన కాంతి ఏర్పడుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన,మెరిసే ఛాయతో ఉన్న చర్మం మీ సొంతం అవుతుంది.

Fenugreek Seedsల్లోని అంటి-ఇన్ఫలమేటరీ లక్షణాలు మొటిమల్ని ఎదుర్కొవడంలో సాయపడుతాయి. మెంతికూరను పెస్ట్ లా చేసి గాని,లేదా దాని నూనెను గాని మొటిమలున్న ప్రాంతాల్లో పూయడం వల్ల మంట తగ్గుతుంది. అంతేకాకుండా వాటి వల్ల వచ్చిన ఎరుపును సైతం తగ్గిస్తాయి. కొత్త మొటిమలను ఏర్పడకుండా నిరోధిస్తాయి.

మెంతులు, విటమిన్ సి,నియాసిన్ లాంటి కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. కొల్లాజెన్ యవ్వనంగా కనబడేందుకు తోడ్పడుతుంది. ఈ సమ్మేళనాలు ముఖం పై ఉన్న ముడతల్ని తగ్గించడంలో ఉపయోగపడుతాయి.

మెంతుల వల్ల జుట్టుకి ఎన్ని ఉపయోగాలో :చాలా మంది జుట్టు సమస్యతో భాధపడుతుంటారు అయితే ఇంట్లోనే చిట్కాలను ఉపయోగించి చాలా సమస్యల నుంచి భయటపడొచ్చు. జుట్టుకి మెంతులు చాల చక్కగా ఉపయోగపడుతాయి.

జుట్టు రాలడం,చుండ్రు,జుట్టు పెరుగుదల ఆగిపోవడం,తలలో దురద వంటి జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ సమస్యలు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ సమస్యలన్నింటిని పరిష్కరించడానికి మీరు మెంతులను ఉపయోగించవచ్చు. విటమిన్ A ,C,K ,ఫోలిక్ ఆసిడ్,కాల్షియమ్ ,ఐరన్,పొటాషియం,ప్రోటీన్లు పుష్కలంగా ఉండడం వల్ల,మెంతులు శిరోజాలను ఆరోగ్యాంగా ఉంచుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తాయి. అంటి-ఫంగల్,అంటి-బాక్టీరియల్ లక్షణాలు ఉన్న కారణంగా ఇది చుండ్రు లెకుండా చేస్తుంది. తల,జుట్టుని రక్షిస్తుంది. మెంతులు స్కాల్ప్ దురద లేదా దద్దుర్లు కూడా తగ్గిస్తాయి.

మెంతుల్లో ఉండే బీటా కెరోటిన్ లో అంటి-ఆక్సిడెంట్,విటమిన్ ఎ ఉన్నాయి. ఇవి జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాక బీటా కెరోటిన్ వల్ల జుట్టు ఆరోగ్యం పెరుగుతుంది. హెయిర్ లో డెడ్ సేల్స్,కొన్ని లివింగ్ సేల్స్ ఉంటాయి. హెయిర్ స్ట్రాంగ్ గా ఉంచవలసిన భాద్యత లివింగ్ సీల్స్ మీదే ఉంటుంది. మెంతుల్లో అరవై శాతం కార్బో హైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఇవి లివింగ్ సేల్స్ ని కావాల్సిన ఎనర్జీని అందిస్తాయి.

వేసవి కాలం జుట్టు నిర్జీవంగా,గట్టిలా మారుతుంది. మీ జుట్టుని పట్టుకుచ్చులా మెరిపించడానికి మెంతులు సహాయపడుతాయి. పావుకప్పు మెంతుల్ని నానబెట్టి మొలకలు వచ్చేలా చేయాలి. తర్వాత ఆరబెట్టి పొడి చేసుకొని దానిని కొబ్బరి నూనెలో మరగనివ్వాలి. ఈ నూనెను తలకి పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే మీ జుట్టు సిల్కిగా మారుతుంది.

ఈ రోజుల్లో చాల మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది. తెల్ల జుట్టుని నివారించడానికి మెంతులు సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని కరివేపాకులాని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన మెంతుల్ని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని తలకి,జుట్టు కి పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి. ఇలాచేస్తే తెల్ల జుట్టు మాయం.

మెంతులు అందరికి ఒకే రకంగా ఉపయోగపడకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉండవచ్చు. దీన్ని వాడేముందు మరికొందరి సూచనలు,సలహాలు తీసుకోండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me