సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం చేసుకోవాలంటే ..? దీన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి : Ghee in Telugu : 2024 సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం చేసుకోవాలంటే ..? దీన్ని

Ghee in Telugu : చాలా మంది నెయ్యి అంటే బాగా ఇష్టపడుతుంటారు. నెయ్యి తినడం వల్ల ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకుని తింటే, అబ్బా ఆ రుచియే వేరు. అయితే నెయ్యి వల్ల రుచి, వాసనను పెంచడమే కాకుండా,ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే ఇండియా లో నెయ్యి తినే పద్ధతి పురాతన కాలం నుండి కొనసాగుతూ వస్తోంది. నెయ్యి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడ్డాయి. అనేక ఉపయోగాలు ఉన్న కారణంగా నెయ్యిని “liquid gold” అని కూడా పిలుస్తారు. మీ రోజువారీ ఆహారం తీసుకోవడం లో కొద్దిగా నెయ్యి ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యితో ఎన్నో ఆరోగ్యకరమైన Benefits ఉన్నాయని అంటున్నారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.

Ghee Benefits in Telugu:

ఈ రోజుల్లో నెయ్యి వాడకం అనేది బాగా పెరిగింది. ఎందుకంటే, దాని వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, లాభాలు ప్రజలకు బాగా తెలుస్తున్నాయి. నెయ్యి మనం తినేటువంటి పదార్థాలకు కూడా మంచి రుచిని ఇవ్వడంతో పాటు . అది శరీరంలోకి వెళ్లాక , చాలా మంచి పనులు చేస్తుంది. కాబట్టి అసలు మన దేశంలో శతాబ్దాలుగా నెయ్యి వాడకం ఉన్న చారిత్రగా మిగిలింది మన దేశం. విదేశీయులకు నెయ్యిని పరిచయం చేసిందే కూడా మన దేశ ఘనతే..!

Ghee in Telugu : మొదట్లో విదేశీయులు,నెయ్యిని చూసి, ఏంటి ఇది ఇలా ఉంది అని వింతగా Face పెట్టేవారు. తర్వాత వాసన చూసి, భలే ఉందే అని అనుకున్నారు. కానీ దాన్ని ఆహారంలో వేడి వేడి నెయ్యి వేసుకుని తిన్నాక, చూడు వాళ్లకు లైట్ వెలిగింది. అమ్మ…, ఇండియన్స్ ఇంత మంచి Tasty food తింటున్నారా..! అని అనుకొని , క్రమ క్రమంగా వాళ్లూ కూడా వాడటం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడైతే, విదేశీయులు నెయ్యి తెగ వాడేస్తూన్నారు. ఎందుకంటే దానితో ఆరోగ్య ప్రయోజనాలపై వాళ్లకు మనకంటే ఎక్కువగా మక్కువ కలిగేసింది. నెయ్యి వల్ల కొవ్వు బాడీ అవుతుందేమో అనే Doubt ఉండొచ్చు. అలా ఏమి జరగదు. నెయ్యి మనకు అవసరమైన మంచి కొవ్వును శరీరానికి అంది ఇస్తుంది.

నెయ్యి రోగనిరోధక శక్తి పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మన దేశీ నెయ్యిలో Anti-bacterial, anti-fungal, anti-oxidant లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది Viruses, flu, cough, cold మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడటంతో ఎంతగానో సహాయపడుతుంది.
నెయ్యి మనలో ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఇందులో కొవ్వులో కరిగే విటమిన్లు డి , కె , ఇ , ఎ ఉంటాయి. ఈ విటమిన్స్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సహాయ పడతాయి. మనం తినే ఆహారంలో, కొవ్వులో కరిగే విటమిన్లను నెయ్యి గుర్తించి, వాటిని అడ్డు పెడుతుంది. అవి వ్యాధిని తెచ్చే వైరస్‌లతో పోరాడడంలో తోడ్పడుతుంది.

Ghee in Telugu : నెయ్యి తినడం వల్ల మన జీర్ణ శక్తి పెరుగుతుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెంచడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. నెయ్యిలో ఉండే పదార్థాలు ఆలోచనా శక్తిని పెంచడంలో సహయ పడతాయి. ఇది కణాలు, కణజాలాలను దెబ్బతినకుండా కాపాడడంలో సహాయపడతాయి. ఖాళీ కడుపుతో ఉదయం నెయ్యి తినడం వల్ల కణాల పునరుత్పత్తి ప్రక్రియ కూడా చాలా మెరుగుపడుతుంది. నెయ్యి చర్మాన్ని కాంతివంతంగా మరియు అందంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉండేందుకు , చర్మంపై ముడతలు రాకుండా కూడా కాపాడుతుంది. ఇది సహజ Moisturizer గా పనిచేస్తుంది. నెయ్యి Skin , Hair కు ప్రకాశాన్ని తెస్తుంది.

Ghee in Telugu : ఎక్జామ్స్ టైం లో పిల్లలు తెగ చదువుతూ ఉంటె, వాళ్ళ బుర్ర వేడేక్కిపోవడం జరుగుతుంది. అందుకే వాళ్లకు నెయ్యితో కూడిన ఆహారం ఇవ్వాలి . నెయ్యిలోని Saturated fats, వాళ్ళని బాగా ఆలోచించేలా చేస్తాయి. కణాలు, కణజాలాలూ నాశనం కాకుండా కూడా కాపాడతాయి. పడిగడపున ఒక చెంచా నెయ్యి తాగితే, కొత్త కణాలు వృద్ధి అవుతాయి. అంటే తెల్లారే మన శరీరంలో మృతకణాల్ని తరిమేసి, కొత్త కణాలు వచ్చేలాగా నెయ్యి వృద్ధి చేస్తుంది.

అలాగే, నెయ్యిలో ఆరోగ్యకరమైన Omega fatty acids ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. హృదయం ఆరోగ్యంగా, ప్రకాశవంతమైన కంటి చూపు, క్యాన్సర్ నివారణ, మలబద్ధకం నివారణకు మంచి ఔషధంగా ఇది ఉపయోగపడుతుంది.

Ghee in Telugu : మల బద్ధకం సమస్య ఉన్నవారు ఆయుర్వేద టాబ్లెట్లు, అవీ ఇవీ అంటూ ఏవేవో వాడి మీ ఆరోగ్యం పాడుచేసుకోవద్దు. Simple గా రోజూ 3 పూటలా కాస్తంత నెయ్యి వాడండి. అది మూత్ర నాళాలను బలపరుస్తుంది. పేగుల్లో సమస్యలను తరిమేసి, మూత్రం సులభంగా అయ్యేలా చేస్తుంది. ఈ తేడాను మీరు చాలా తొందరగానే గుర్తిస్తారనే నిపుణులు చెబుతున్నారు.

నా హృదయం హాయిగా ఉంది. నా గుండెకు ఏమీ కాదు, అని అనుకుంటూ మీరు గుండెపై చెయ్యి వేసి చెప్పుకోవాలనుకుంటే,మీరు నెయ్యి వాడాలి. నెయ్యి మీ కంటి చూపును కాంతివంతంగా చేస్తుంది. కాన్సర్ ని కూడా ఒక అంతు చూస్తుంది. మొత్తానికి ఆరోగ్యాన్ని పెంచుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ వివరాలను అందిస్తున్నాము. మీకు ఏదైనా సందేహాలుంటే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me