Guppedantha Manasu Serial Today Episode : June 27th వసుధారను పొగరు అన్న రంగా- తను రిషియే అనడానికి దొరికిన సాక్ష్యం ఇదే…..పాపం శైలేంద్ర పరిస్థితి….

Guppedantha Manasu Serial Today Episode: ఈ రోజు ఎపిసోడ్ లో వసుధారను పొగరు అని రిషి ఒక డైలాగ్ అంటాడు రంగా. దాంతో వసు సంతోషపడుతుంది. మరోవైపు మను, మినిస్టర్ Plan తో శైలేంద్రను దెబ్బ కొట్టడం . ఇది ఈ సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో DBST కాలేజీ బాధ్యతలు Government తీసుకుంటుందని Minister చెబితే అలా జరగనివ్వకండని, భూషణ్ ఫ్యామిలీనే కాలేజీని చూసుకుంటుందని కాబట్టి తనే చూసుకుంటానని, MD సీటులో తాను కూర్చుంటానని శైలేంద్ర Minister తో అంటాడు.

కానీ, అలా జరగనివ్వం కదా..! అని ఒక బోర్డు మెంబర్ అంటాడు. కానీ ఒక లేడి మెంబర్ మాత్రం శైలేంద్ర సారే ఎండీ సీటులో కూర్చోవాలి అని అంటుంది. దాంతో మీరు MD సీటు గురించే ఇలా కొట్టుకుంటే ఎలా చెప్పండి . రేపు నువ్వు MD సీటులో కూర్చుంటే నువ్ ఏం చేసిన తప్పుపడతారు. అని అంటూ , మరి ఎటువంటి ఫైల్స్‌పై కూడా ఎవరు Sign చేయకుండా వ్యతిరేకిస్తారు. కాబట్టి అది పెద్ద సమస్యగా మారుతుంది. అప్పుడు Student Future పాడవుతుందని Minister అంటాడు. ఇప్పటికే College వాల్యూ పడిపోయిందని ,మల్లి దీన్ని ఇప్పుడు Government తీసుకుంటే ఇంకా పడిపోతుందని Minister తో శైలేంద్ర అంటాడు.

నేను ఇప్పుడే అప్పజెప్పమనడం లేదు. One Week Time ఇస్తాను. . అప్పటి వరకు ఆలోచించుకొని చెప్పండి. రిషి, జగతి, వసుధార ల విషయంలో ఎలాంటి అనుమానాలు ఉండేవి కాదు. ఇప్పుడు మీరు MD కావాలనుకుంటే వసుధార రావాలి. అని Minister చెబుతాడు. అప్పుడు శైలేంద్ర అసలు వసుధార లేదు కదా అని అంటే.. అందరు షాక్ అవుతూ చూస్తారు. దానికి Minister గారు లేకపోవడం ఏంటీ అని అంటాడు. దానికి శైలేంద్ర అంటే రానని వెళ్లిపోయింది కదా. అని అంటూ … పైగా తనకు ఆత్మాభిమానం ఎక్కువ కదా .. మీలాగా,నాలాగా కాదు అని శైలేంద్ర Minister తో అంటాడు.

ఆ మాటలు విన్న Minister Sock అవుతాడు. రేయ్ ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా..! అని శైలేంద్ర వాళ్ళ నాన్న ఫణీంద్ర హెచ్చరిస్తాడు. దానికి శైలేంద్ర Sorry Sorry నాలాగా కాదు అని శైలేంద్ర మాట మారుస్తూ, మరి వసుధార ఎలా వస్తుందని మినిస్టర్ తో శైలేంద్ర అంటే.. దానికి Minister అయితే రిషి రావాలి అని అంటాడు. రిషి చనిపోయాడని Official గా ప్రకటించిన తర్వాత తాను ఎలా వస్తాడని శైలేంద్ర అంటే.. దానికి Minister Alternative అడిగితే.. ఇలాగే ఉంటుంది . కాబట్టి వసుధార రాని. అప్పటివరకు ఎలా జరుగుతుందో అలాగే జరగని అని మీటింగ్ అయిపోయిందని మంత్రి వెళ్లిపోతాడు.

మా తాత కట్టించిన College పై Government పెత్తనం ఏంటీ అని శైలేంద్ర తన మనసులో అనుకుంటాడు. రేయ్ ఎక్కువగా ఆశపడకు. నీకు Support చేసిన ఈవిడ నిజంగా నీ Talent చూసే చెప్పిందా. లేదా డబ్బులు ఇచ్చి చెప్పించావా అని ఫణీంద్ర అంటాడు. ఆవిడ నా టాలెంట్ గుర్తించింది. మీరే గుర్తించట్లేదు. నాకు బయట కాదు. ఇంట్లో నే వున్నారు శత్రువులు అది మీరే అని శైలేంద్ర అంటుంటే.. ఏడిచావ్‌లే అని అంటూ ఫణీంద్ర అక్కడి నుండి వెళ్లిపోతాడు. రేయ్ మనుగా నువ్ ఒక్కడివే అడ్డుగా ఉన్నావ్. ఏం చేయాలో తెలియట్లేదు అని శైలేంద్ర ఆలోచిస్తుంటాడు.

మరోవైపు వసుధార కనిపించట్లేదు, కనిపించిందా అని రాధమ్మను అడుగుతాడు రంగా. ఎక్కడ లేదని కంగారుపడతాడు రంగా. భోజనం చేసే సమయంలో మనం అన్న మాటలకు ఫీల్ అయి వెళ్లిపోయారా అని వసుధారను వెతికేందుకు వెళ్తాడు రంగా. అప్పుడు నేను కూడా వస్తా అని సరోజ అంటే వద్దులే నేను ఒక్కడినే వెలతాను అని వెళ్తాడు. ఊరంతా ఆటోలో వెతుకుతుంటాడు రంగా. తనకోసం రౌడీలు వెతుకుతున్నారు. ఇప్పుడు తను కనిపించడం లేదు. ఏం జరుగుతుందో ఏమో అని రంగా ఆలోచిస్తుంటాడు.

ఇంతలో ఒక TEA Shop వద్ద టీ తాగుతూ వసుధార రంగా కి కనిపిస్తుంది. అది చూసి కోపంతో హేయ్.. నిన్ను అని చేయెత్తి కొట్టబోతాడు రంగా. తర్వాత ఆగిపోతాడు. నీకు అసలు బుద్ధుందా లేదా. ఎవరినీ అడిగి వచ్చావ్. అసలు ఎందుకు వచ్చావ్ అని రంగా ప్రశ్నిస్తాడు. నాకు టీ తాగాలనిపించింది. ఇక్కడ బాబాయ్ సరిగా పెట్టలేదు. నేనే పెట్టుకుని తాగుతున్నాను అని వసుధార అంటుంది. మీకోసం ఊరంతా వెతుకుతున్నాను. మీకు ఎమైందో భయపడ్డాను అని రంగా అంటాడు.

నిజంగా నాకోసం వెతికారా అని సంతోషపడుతుంది వసుధార. నాకోసం ఎందుకు వెతికారు. నాకు ఏమైతో మీకేంటి అని వసుధార అంటుంది. మీకేమైనా అయితే అది నా బాధ్యత. మీకోసం రౌడీలు వెతుకుతున్నారు. మిమ్మల్ని కాపాడి తీసుకొచ్చాను. మీకు ఏమైనా అయితే పోలీసులకు నేను సమాధానం చెప్పాలి అని రంగా అంటాడు. అప్పుడు మరి దానికి బదులుగా మీరే రిషి సర్ అని ఒప్పుకోవచ్చు కదా అని రంగా తో వసుధార అంటే.. లేదు నేను రంగాను అని అంటాడు.

లేదు రిషి సార్ అని వసుధార వాదిస్తుంటే.. పొగరు అని రిషి డైలాగ్ రంగా కొడతాడు. దాంతో మరింత సంబరపడిపోతుంది వసుధార. ఇంకోసారి అనండి. అసలు నన్ను ఏదైనా అనే హక్కు మీకే ఉంది కదా రిషి సార్ అని వసుధార అంటుంటే.. దానికి రంగా మీరు అసలు తగ్గరా మేడమ్. ఎదుటి వాళ్ల Side నుంచి కూడా ఒక్కసారైనా ఆలోచించరా అని రంగా అంటాడు. నేను తగ్గను అని వసుధార అంటుంది. రండి మేడమ్ ఇంటికి వెళ్దాం అని రంగా అంటే రానని వసుధార మొండికేస్తుంది.

దాంతో వసుధార చేయి పట్టుకుని తీసుకెళ్తాడు రంగా. దాంతో మరింత హ్యాపీగా ఫీల్ అయిన వసుధార మీ స్పర్ష నాకు తెలుస్తోంది. మీరు రిషి సారే అని వసుధార అనుకుంటుంది. మరోవైపు మనం అనుకున్నట్లుగానే బోర్డ్ మీటింగ్‌లో చెప్పినందుకు థ్యాంక్స్ అని మను మంత్రితో అంటాడు. అది శైలేంద్ర వింటాడు. ఇదంతా వీళ్ల ప్లానా. అసలు నా వెనుక వీళ్ళు ఇంత ప్లాన్ చేశారా…అని శైలేంద్ర తన మనసులో అనుకుంటాడు. అలా చెప్పకుంటే ఈ College దుర్మార్గుల చేతిలోకి వెళ్లిపోతుందని చెప్పావ్ కదా! అందుకే అలాగ చెప్పాను .అని Minister అంటాడు.

మీరు చెప్పిన కారణాలకు వాళ్లు ఒప్పుకున్నారు. రిషి సార్ రావడం అసాధ్యం. వసుధార వచ్చిన శైలేంద్రను MD గా చేయడానికి అని మనో అంటాడు. అవును, ఈ కాలేజీ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో గొప్ప పనులు చేశారు. అటువంటి College Down అవ్వడం నాకు ఇష్టం లేదు అంటూ వెళ్లిపోతాడు Minister . మను తిరిగి వెనక్కి వస్తుండగా శైలేంద్ర ఎదురెళ్తాడు. Minister గారు అలా మాట్లాడటానికి నువ్వా కారణం అని మనో తో శైలేంద్ర అంటే.. అవును అని మనో చెబుతాడు.

నా వెనుక ఇంతపెద్ద నాటకం ఆడుతారా. నా వెనుకే గోతులు తీస్తారా అని శైలేంద్ర అంటాడు. ఈ బోర్డ్ మీటింగ్‌లో అయినా ఆ మినిస్టర్ గాడు నా పేరు చెబుతాడనుకున్నా. కానీ, నువ్ అడ్డు పడ్డావ్. ఇన్నిసార్లు అడ్డుపడటం మంచిది కాదు. శత్రు శేషం ఉంచుకోకూడదు. నా చరిత్ర నీకు తెలియదని శైలేంద్ర అంటాడు. నేర చరిత్రను గొప్పగా చెప్పుకోవడం అలవాటు అయింది వెధవలకు. నువ్ చెప్పడం తప్పా ఏం చేయలేవని మను అంటాడు.

డైలాగ్స్ కాదు. యాక్షన్ కూడా చేస్తాను. రెడీగా ఉండు అని శైలేంద్ర అంటే.. గుడ్ లక్. ఏం చేస్తావో చేసుకో అని మను వెళ్లిపోతాడు. వెంటనే రౌడీకి కాల్ చేసి మను గాడిని చంపేయాలని శైలేంద్ర చెబుతాడు. ఒకసారి College లో Attack చేశావ్‌గా వాడే అని శైలేంద్ర వాడితో అంటాడు.అప్పుడు దానికి వాడు వాడా ఒక్కసారి నా చేతిలో నుంచి తప్పించుకున్నవాడిపై మళ్లీ Attack చేయను.అని అంటూ.. ఎందుకంటే వాడికి భూమ్మీద నూకలు ఉన్నట్లే. అది దైవ నిర్ణయం. దాన్ని మనం మర్చలేం సార్. డబుల్ కాదు. దానికి రెట్టింపు డబ్బులు ఇచ్చిన ఇక ఆ పని చేయలేను అని రౌడీ అంటాడు.

నేను చేయలేను. మీరే చంపేయండి. లేదంటే మార్కెట్‌లో చాలమంది ఉన్నారు అని రౌడీ చెబుతాడు. మరోవైపు వసుధార చెప్పకుండా వెళ్లినందుకు చాలా కంగారుపడ్డామని, అలా ఇంకోసారి వెళ్లకని, రంగా చాలా ఫీల్ అయ్యాడని, అసలు ఎందుకు వెళ్లావని రాధమ్మా అడుగుతుంది. అప్పుడు వసుధారా నా జ్ఞాపకాలు, నా గతం గుర్తుకు వచ్చి, నాకు ఒంటరిగా ఉండాలనిపించి వెళ్లానమ్మా అని వసుధార చెబుతుంది. అప్పుడు వాళ్ళంతా అసలు నీ గతమేంటీ,ఈ రిషి సార్ ఎవరు, ఆయన కథేంటీ అని వసుధారను అడుగుతారు.

నా రిషి సార్ జెంటిల్‌మెన్. ఒక ప్రిన్స్. ఒక Serious సింహం అని, మొదలు పెట్టిన వసుధార తన జీవితంలో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ, రిషి కథ గురించి చాలా గొప్పగా చెబుతుంది వసుధార. అలా చెబుతూ ఎమోషనల్ అవుతుంది వసుధార. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me