Index mutual fund : ఇండెక్స్ ఫండ్ అంటే ఏమిటి ? దీనిలో పెట్టుబడిని పెడితే పొందే లాభాలు….!2024
Index mutual fund : Index mutual fund అనేది అర్థం చేసుకోవడం చాలా సులభమైన విషయం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అని అనుకుని, ఎనాలసిస్కు టైమ్ లేని వారు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరి ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి?
Index mutual fund : మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ను ఎంచుకోవడమే చాలా కష్టం ఐనా పని గా ఉంటుంది . మ్యూచువల్ ఫండ్స్లో ఎన్నో రకాలు ఉంటాయి, ఎన్నో ఫండ్ హౌజ్లు ఉంటాయి. వాటి పేర్లను చూసే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ చాలా సింపుల్గా ఉంటుంది. చాలా సులభంగా దీని గురించి అర్థం చేసుకోవచ్చు. పైగా.. ఇందులో రిస్క్ కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి?
Index mutual fund అర్థం.. దాని పేరులోనే ఉంది. ఈ రకం యొక్క మ్యూచువల్ ఫండ్.. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వంటి ఇండెక్స్ మొదలైన వాటిలో పెట్టుబడులు పెడుతుంది..
ఉదాహరణకు నిఫ్టీ 50లో.. 50 సంస్థల స్టాక్స్ ఉంటాయి. అవి పెరుగుతూ ఉంటే.. నిఫ్టీ 50 వృద్ధిచెందుతుంది. ఆయా స్టాక్స్ పడితే.. నిఫ్టీ పతనమవుతుంది. నిఫ్టీ 50 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ కూడా ఇంతే! ఇందులో నిఫ్టీ 50కి చెందిన స్టాక్సే ఉంటాయి. అందువల్ల.. Nifty 50 రిటర్నుల తగ్గట్టుగానే Nifty 50 మ్యూచువల్ ఫండ్లోనూ రిటర్నులు ఉంటాయి.
ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు.. ఒక ఇండెక్స్ని ఎంచుకుని అందులోని స్టాక్స్లో క్రమంగా ఇన్వెస్టర్ల నగదును పెట్టుబడిగా పెడతారు. అదే యాక్టివ్ Mutual Funds లో అయితే.. ఇన్వెస్టర్లకు మంచి రిటర్నులు తెచ్చిపెట్టేందుకు వివిధ రకాల స్టాక్స్ను పరిశీలించాల్సి ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల Index mutual fund ఫండ్లో.. ఫండ్ మేనేజర్ల పని పెద్దగా ఉండదు..
ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ ఎవరికి ఉపయోగం?
Equity Market లో పెట్టుబడులు పెట్టాలనుకుని, స్టాక్స్ని ఎనలైజ్ చేసేందుకు సమయం లేని వారికి Index mutual fund ఉపయోగపడుతుంది. ఇండెక్స్కి తగ్గట్టే రిటర్నులు కూడా వస్తాయి కాబట్టి.. అవి ఆశించిన స్థాయిలోనే ఉంటాయి..
Index mutual fund in India : ఫండ్ మేనేజర్ల నిర్ణయాలు ఒక్కోసారి తిప్పికొడతాయి. అప్పుడు ఇన్వెస్టమర్లకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. Index mutual fund లో ఫండ్ మేనేజర్ల పాత్ర చాలా తక్కువ కాబట్టి.. ఎ భయాలు అవసరం లేదు. అందువల్ల ఇతర మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే .. ఇందులో రిస్క్ యొక్క ఆస్కారం తక్కువగా ఉంటుంది.
కానీ.. అధిక రిటర్నులు పొందాలంటే.. అందుకు తగ్గ రిస్క్ కూడా చేయాలి. అందువల్ల.. నిపుణులు ఇచ్చే రిటర్నుల కన్నా అధిక రిటర్నులు పొందాలి అని, అనుకునే వారికి Index mutual fund ఉపయోగపడకపోవచ్చు.
ఇవి పరిగణించాలి..
రిస్క్- రివార్డ్:- మార్కెట్లు పెరుగుతుంటే.. సూచీలు కూడా వృద్ధిచెందుతాయి. అప్పుడు ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ కూడా పెరుగుతుంది. కానీ మార్కెట్లు పడితే.. ఇన్వెస్టర్లు, ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ కూడా పడిపోతుంది. సాధారణంగా వేరే ఫండ్స్లలో .. మార్కెట్లు యొక్క వాల్యూ పడిపోతుంటే.. ఫండ్ మేనేజర్లు తమ నిర్ణయాలతో నగదును వేరే స్టాక్స్కు తిప్పే అవకాశం ఉంటుంది. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లో అలాంటి వెసులుబాటు ఉండదు. అందువల్ల ఇండెక్స్తో పాటు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుబడి పెట్టడం చాల వరకు శ్రేయస్కరం.
ఎక్స్పెన్స్ రేషియో:- మీ పెట్టుబడులను మేనేజ్ చేస్తుంది కాబ్బటి ఫండ్ హౌజ్ మీకు వచ్చే రిటర్నుల నుంచి కొంత మేర మొత్తం తీసుకుంటుంది. దానినే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. దీని విషయంలో అతి పెద్ద ఉపయోగం ఇక్కడే. ఫండ్ మేనేజర్ ప్రమేయం తక్కువ కాబట్టి.. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లో ఎక్స్పెన్స్ రేషియో కూడా తక్కువగానే ఉంటుంది.
మీ గోల్స్ ముఖ్యం:- కనీసం 7 సంవత్సరాల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న ఇన్వెస్టర్లకు ఈ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ సహాయపడుతుంది. స్వల్పకాలంలో ఈ రకం ఫండ్స్లో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. 7ఏళ్ల కాలంలో 10-12శాతం రిటర్నులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దీర్ఘకాలం పెట్టుబడుల కోసమే Index mutual fund వైపు చూడాలి.
ట్యాక్స్:- Equity Fund కావడంతో ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చే డబ్బులపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఫండ్ హౌజ్.. డివిడెండ్లు చెల్లిస్తే.. అందులో 10శాతం డీడీటీ(Divident Distribution Tax ) కట్ అవుతుంది.
గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం ప్రచురించిన కథనం మాత్రమే.తెలుగువానం.కం కు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడి పెట్టేముందు మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.