ఈ చెట్టులో ఉండే ఆరోగ్య రహస్యాలు తెలిస్తే,దీన్ని అస్సలు వదిలిపెట్టరు.Jilledu Chettu in Telugu.
Jilledu Chettu in Telugu మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉండే మొక్కలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి ఔషధ గుణాలు ఉండే మొక్కల్లో జిల్లేడు ఒకటి. ఇది మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా పల్లెటూర్లలో మనకు ఎక్కడ చూసినా సరే, ఇది కనిపిస్తుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కాబట్టి మనకు కలిగే వ్యాధుల నుంచి బయట పడడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
Jilledu Chettu in Telugu జిల్లేడులో పలు రకాలు ఉంటాయి. అందులో తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు అని ఉంటాయి. రథ సప్తమి రోజున ఈ జిల్లేడు ఆకులను ధరించి స్నానం చేస్తే మేలు జరుగుతుందని, చెబుతుంటారు. జిల్లేడు పువ్వులు లేదా ఆకులను సేకరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి నుంచి తెల్లటి పాలు వస్తాయి. అవి మన కళ్లలో పడకుండా మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. అవి చాలా విష పూరితం. కాబట్టి జిల్లేడు ఆకులు, పువ్వులను తుంచేటప్పుడు వాటి పాలు మాత్రం కళ్లలో పడకుండా చూసుకోవాలి.
Jilledu Chettu in Telugu ఇక జిల్లేడు ఆకులను సేకరించి, వాటికి కొంచెంగా నీటిని కలిపి, ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాస్తుంటే, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
జిల్లేడు ఆకులకు ఆముదం రాసి కీళ్ల నొప్పులు ఉన్న చోట కట్టుగా కూడా కడుతుండాలి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
జిల్లేడు ఆకులను ఎండబెట్టి, దాన్ని పొడి చేసి పుండ్లు, గాయాలపై రాయాలి. అవి త్వరగా మానుతాయి.
జిల్లేడు చెట్టు యొక్క వేరును సేకరించి, శుభ్రం చేసి రాత్రి నిద్రించే ముందు దాన్ని తలగడ కింద పెట్టుకోని పడుకోవాలి. దీంతో పీడకలలు అనేవి రావు. భయం తగ్గుతుంది. దీని వల్ల గ్రహ దోషాలు ఉన్నా కూడా పోతాయి. అన్నీ శుభాలే కలుగుతాయి. సమస్యల నుండి బయటపడతారు.
తెల్ల జిల్లేడును సిరిసంపదలకు గుర్తుగా కూడా భావిస్తారు. అందుకనే కొందరు ఇళ్లలో ఇప్పటికీ ఈ మొక్కలను పెంచుకుంటూ ఉంటారు.
జిల్లేడు ఆకులను తెచ్చి , వాటికి పసుపును కలిపి నూరి మిశ్రమంగా చేసి రాస్తుంటే,సెగ గడడ్లు, వేడి కురుపులు తగ్గిపోతాయి. అరికాళ్లు, చేతుల్లో బొబ్బలకు కూడా ఇది మంచి ఉపశమనంగా పనిచేస్తుంది. జిల్లేడు పాలను కట్ అయిన గాయాలపై రాస్తే, రక్తస్రావం వెంటనే ఆగిపోతుంది.
గజ్జల్లో బిళ్లలు అయినట్లు అనిపిస్తే,జిల్లేడు ఆకులకు ఆముదంను రాసి వేడి చేసి, వాటిపై కడుతుండాలి. బిళ్లలు పోతాయి.
జిల్లేడు వేరును కాల్చి,దానితో దంతాలను తోముకోవడానికి కూడా కొన్ని చోట్ల ఉపయోగిస్తారు. దీంతో దంతాలు, చిగుళ్ల సమస్యలు పోయి , అవి దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.అంటారు.
జిల్లేడు ఆకుల పేస్ట్‌ను పాము,తేలు కుట్టిన చోట రాసి కట్టుకడితే విష ప్రభావం కూడా తగ్గిపోతుంది. జిల్లేడు ఆకుల పొగను పీలిస్తే ఆస్తమా తగ్గుతుంది. అయితే జిల్లేడు ఆకులను వాడేటప్పుడు పాలు మాత్రం లోపలికి వెళ్లకుండా, కళ్లలో పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
గమనిక : ఈ సమాచారాన్ని అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహా మేరకు తీసుకోవడం జరిగింది. దీన్ని వాడే, ముందు వైద్యుల సలహా మేరకు వాడడం మంచిది.పైన తెలిపిన సమాచారానికి Teluguvanam.com ఎలాంటి భాద్యత వహించదు .