Karthika Masam 2024 Telugu లో కార్తీకమాసం ఎప్పటి నుండి ప్రారంభం? ఈ మాసం యొక్క విశిష్టత ఏంటి?
Karthika Masam 2024 Telugu ఇంకా కొద్దీ రోజులలో ఆశ్వయుజ మాసం ముగిసి కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది దీపావళి పండుగ అయిపోయిన తర్వాత నవంబర్ 2 నుంచి కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. ఈ మాసం విశిష్టత ఏంటి? ఎందుకు ఇది పవిత్రమైన మాసంగా పరిగణిస్తారో తెలుసుకుందాం.
అన్ని మాసాలలో కెల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీకమాసం. తెలుగు సంవత్సరంలో వచ్చే ఎనిమిదో మాసం ఇది. ఈ మాసంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీకమాసం అనే పేరు రావడం జరిగింది.
Karthika Masam 2024 Telugu పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీకమాసం. ఈ కార్తీకమాస నెల రోజుల పాటు శివారాధన చేస్తూ, కార్తీక సోమవారాలు ఉపవాసాలు ఆచరిస్తూ, ఆ భోళా శంకరుడి అనుగ్రహం,కటాక్షం పొందటం కోసం ప్రయత్నిస్తారు. ఈ సంవత్సరం కార్తీక మాసం November 2 నుంచి ప్రారంభం అయి,December 1 న ముగుస్తుంది. అత్యంత మహిమాన్వితమైన మాసంగా చెప్పబడుతుంది.పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో ఈ మాసం మొత్తం భక్తిపారవశ్యంతో మునిగిపోతుంది.
శివారాధన :
ఈ కార్తీకమాసంలో శివలింగానికి బిల్వ పత్రాలతో అర్చన చేయడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, భక్తుల ప్రగాఢంగా విశ్వసిస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ పౌర్ణమి రోజు పవిత్ర నదీ స్నానాలు ఆచరించి, ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగిస్తారు. వాటిని పారే నీటిలో లేదా చెరువులో విడిచిపెడతారు. ఇక కార్తీక సోమవారాలు అత్యంత విశిష్టమైనవిగా పిలుస్తారు.
శివాలయానికి వెళ్ళి పూజలు చేసిన వారికి దోషాలు తొలగిపోతాయని, ఈతి బాధలు ఉండవని నమ్ముతారు. ప్రదోష కాలంలో చేసే శివారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే కార్తీకమాసంలో చేసే దీపారాధన చాలా మహిమ కలిగినది. సాయంత్రం వేళ భక్తులు గుడికి వెళ్ళి దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. కొంతమంది కార్తీక సోమవారం నాడు 365 ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని దర్శించుకుంటారు.
ఉసిరి పూజ :
కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టుకు పూజ చేస్తారు. ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నివాసంగా పేర్కొంటారు. అందుకే ఉసిరి చెట్ల కింద భోజనం చేయడం చేస్తారు. వీటినే వన భోజనాలు అంటారు. అలాగే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తారు.
అయ్యప్ప దీక్ష :
కార్తీక మాసం తొలి రోజు నుంచి అయ్యప్ప దీక్షలు ప్రారంభం అవుతాయి. నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప భక్తులు మండల పూజ దీక్షను చేపడతారు. ఈ సమయంలో దీక్షను చేపట్టిన భక్తులు కఠినమైన నియమాలను ఆచరించడంతో పాటు ఉపవాసాలు కూడా ఉంటారు. ఈ దీక్షను చేపట్టిన భక్తులు నలుపు రంగు దుస్తులు మాత్రమే,ధరించి ,భక్తులు నిత్యం పూజలు, భజనల్లో పాల్గొంటారు. ఇలా 41 రోజులు చేస్తూ,చివరకు మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం చేసుకుని,మండల పూజ దీక్షను విరమిస్తూ, భక్తులు పునీతులు అవుతారు.
మాంసాహారం నిషిద్ధం :
కార్తీక మాసంలో భక్తులు మాంసాహరానికి దూరంగా ఉంటారు. ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని కూడా దూరం పెడతారు. ఈ కార్తీక మాసం మొత్తం కేవలం పూజలు, వ్రతాలు, నోములు జరుపుకునేందుకు విశిష్టమైనది. అంతేకాకుండా, కార్తీక పురాణం చదివిన వారికి, విన్న వారికి కూడా ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని మరియు వివాహిత స్త్రీలకు వైధవ్యం రాదని నమ్ముతారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం మీ యొక్క నమ్మకాల మీదనే ఆధారపడి ఉంటుంది . ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా సేకరించడం జరిగింది. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు Teluguvanam.com ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.