మహిళలకు ప్రభుత్వం చెప్పిన భారీ శుభవార్త? సున్నా వడ్డీకే రూ.10 లక్షల వరకు రుణాలు. Lakhpati Didi Yojana .

మహిళలకు ప్రభుత్వం చెప్పిన భారీ శుభవార్త? సున్నా వడ్డీకే రూ.10 లక్షల వరకు రుణాలు. Lakhpati Didi Yojana .

మహిళలకు మంచి ఊరట. ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేయాలని భావిస్తోంది. ఆ ఉద్ద్యేశంతోనే 0 వడ్డీకే రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. స్వయం ఉపాధి యూనిట్ల విస్తరణకు రూ.20 లక్షల వరకు లోన్ ను పొందొచ్చు.

Lakhpati Didi Yojana మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్ద్యేశంతో ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం కలిసి మహిళలకు లక్షాధికారులను చేయాలని, పక్కా ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తున్నాయి.

అందులో భాగంగానే ఈ లఖ్‌పతి దీదీ పథకాన్ని కూడా తీసుకువచ్చాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన 1.23 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ మేరకు రుణాలు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది.

Lakhpati Didi Yojana అహేవిధంగా ఈ మేరకు లబ్ధిదారుల యొక్క వివరాల జాబితాను సేకరించి, జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్‌ వెబ్‌సైట్‌లో కూడా నమోదు చేశారు. ప్రస్తుత స్వయం ఉపాధి యూనిట్లను మరింత విస్తరించేందుకు రుణాలను కూడా పెంచారు. వీరికి రుణాన్ని రూ.లక్ష నుంచి గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు March నెలాఖరులోపు అందించే అవకాశం ఉంటుంది.

స్వయం సహాయక సంఘంలో దాదాపు ఎనిమిది నుంచి పది మంది వరకు మహిళలు ఉన్నారు. బ్యాంక్‌ లింకేజీ కింద ఒక్కో సంఘానికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు లోన్ రావడం జరుగుతుంది.

Lakhpati Didi Yojana ఈవిధంగా తీసుకున్న రుణాల ద్వారా చిన్న చిన్న వ్యాపారాలను పచ్చళ్లు, అగర బత్తులు, కాగితపు ప్లేట్లు తయారీ, టీ కప్పులు, ఫినాయిల్, యాసిడ్ వంటి తదితర వంటి వాటిని తయారు చేస్తున్నారు. వీటన్నింటిని మార్కెటింగ్‌ చేస్తూ, ఆర్థికాభివృద్ధి వైపుగా పరుగులు పెడుతున్నారు.

అంతేకాకుండా వీరితో పాటుగా ఇంకా కొంత మందికి ఊపాధిని కల్పిస్తున్నారు. అందువల్ల సమాజం కూడా అభివృద్ధి దిశలో దూసుకుపోతుంది. దీని వల్ల చాలా మందికి ఊరట కూడా లభిస్తుందని అనుకోవచ్చు.

ఇదివరకు రూ.3 లక్షల రుణం వరకు సున్నా వడ్డీ పథకం అమలు జరిగింది. కాబట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వం గరిష్ఠంగా ఒక సంఘానికి రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ అమలు చేయనున్నట్లు హామీ ఇచ్చినటువంటి విషయం అందరికి తెలిసిందే.

ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న PMEGP, PMFME, PMMSY వంటి పథకాల ద్వారా రుణాలపై 35 % రాయితీ వర్తింపజేయనున్నారు.

ఇంకా వీటితో సంబంధం లేకుండా lakhpati didi కింద హామీ పత్రాలు అవసరం లేకుండానే, అదనపు రుణాలు ఇచ్చేందుకూ కూడా జిల్లాలోని అన్ని బ్యాంక్‌లకు లక్ష్యాలు కేటాయించారు. దీని వల్ల మహిళల యొక్క జీవనోపాధి మెరుగుపడనుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me