Mahesh Babu New Movie Release Date Anounced #SSMB28 – మహేష్ బాబు కొత్త సినిమా
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మహేష్ బాబు అభిమానులకు ఇది ఒక మంచి మూవీ కాబోతుందని సినీ వర్గాల అంచనా, ఇకపోతే ఈ సినిమా కి పేరు ని అనౌన్స్ చేయకపోయినా తాత్కాలిక పేరు పెట్టబడింది SSMB28 ఈ సినిమా ప్రస్తుత తెలుగు సినిమాల్లో ఇదొక బెస్ట్ సినిమా అని అలాగే రికార్డు లను సొంతం చేసుకోగలదని నమ్ముతున్నారు, ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా తర్వాత మళ్లీ ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఈ సినిమా ఫామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి.
ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అలాగే ఈ చిత్రాన్ని ఎస్ రాధాకృష్ణ ( చినబాబు ) నిర్మిస్తున్నారు, ఈ చిత్రంలో కథానాయికలుగా పూజ హెగ్డే , శ్రీలీల లు నటిస్తున్నారు, అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ బాణీలు అందిస్తున్నాడు.
సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది
ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి 2024 సంక్రాంతి ని ఎంచుకున్నారు, సంక్రాతి మహేష్ బాబు కి ఎంతగానో కలిసి వచ్చిందని అలాగే చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ జనవరి 13 2024 చిత్ర యూనిట్ ప్రకటించారు, మహేష్ బాబు సిగార్ తాగుతున్న అద్భుతమైన పోస్టర్ ని విడుదల చేసారు.