Mahila Udyogini scheme మహిళా ఉద్యోగిని స్కీం….. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే….?
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చాలా పథకాలు అమలు చేస్తోంది. కానీ పథకాల గురించి ప్రజలకు సరిగా చెప్పట్లేదు. దాంతో వీటి గురించి ప్రజలకు తెలియక, ఆ పథకాలు పొందలేకపోతున్నారు. ఇవాళ మనం ఓ ముఖ్యమైన పథకం గురించి తెలుసుకుందాం.
ఈ పథకం పేరు ఉద్యోగిని పథకం. దీన్ని కేంద్ర ప్రభుత్వం మహిళా వ్యాపారుల కోసం తెచ్చింది. కేంద్రం లోని మహిళా అభివృద్ధి Corporation ఈ పథకాన్ని అమలుచేస్తోంది. దీని ద్వారా పేద మహిళా వ్యాపారులకు కేంద్రం Money ఇస్తుంది. తద్వారా మహిళలు ఆ డబ్బుతో వ్యాపారం చేస్తూ.. అభివృద్ధి సాధిస్తారని కేంద్రం కోరుకుంటోంది.
ఈ డబ్బును కేంద్రం.. city ల్లో మహిళల కంటే.. గ్రామాల్లో మహిళలకు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అందువల్ల గ్రామాల్లో ఉండే మహిళలు ఎక్కువగా ఈ Money పొందగలరు. ఈ Money పొందడం ద్వారా.. లబ్దిదారులైన మహిళల ఆదాయం, కుటుంబ ఆదాయం పెరిగి.. దేశానికి మేలు జరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ఈMoney ని కేంద్రం ఉచితంగా ఇవ్వదు. వడ్డీ లేని రుణంగా ఇస్తుంది. అందువల్ల ఆ డబ్బును వ్యాపారానికి వాడుకొని మహిళలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ మహిళా రైతులు కూడా ఈ పథకం ద్వారా Bank ల్లో వడ్డీ లేని రుణం పొందవచ్చు.
Mahila Udyogini Scheme :
ఉద్యోగిని పథకాన్ని వాణిజ్య, ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలుచేస్తున్నాయి. Udyogini పథకం ద్వారా మహిళలు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణం మాత్రమే కాదు.. ప్రత్యేక Professional Devlopment Traning కూడా పొందుతారు. ఈ పథకం ద్వారా మహిళలు కేంద్రం నుంచి రూ.3 లక్షల దాకా వడ్డీ లేని రుణం ఇస్తుంది. ఈ రుణం పొందేందుకు మహిళలకి ఎలాంటి హామీ పత్రాలూ అవసరం లేదు. ఈ రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ఎలాంటి Fee లు తీసుకోవు.
Mahila udyogini scheme (అర్హతలు):
ఈ పథకం కింద Loan పొందాలంటే.. కుటుంబ సంవత్సర ఆదాయం రూ.1.5 లక్షలు లేదా అంత కంటే తక్కువ ఉండాలి. భర్త లేని మహిళలు, దివ్యాంగులై ,ఒంటరి మహిళలు కుటుంబ ఆదాయానికి ఎలాంటి పరిమితులూ లేవు. ఈ Loan ఇచ్చేటప్పుడు sc/st మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మహిళ వయస్సు 18 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండొచ్చునని పేర్కొన్నారు . ఏదైనా వ్యాపారం చేసే మహిళలు ఈ Loan పొందేందుకు అర్హులు. Loan పొందాలనుకున్న మహిళలు, ఇదివరకు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను తగిన గడువులో చెల్లించి ఉండాలి.
రుణం పొందేందుకు కావాల్సిన పత్రాలు:
ఉద్యోగిని స్కీమ్ కింద loan పొందడానికి ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, జన్మ ధృవీకరణ పత్రం, addres prof , ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, bpl , కుల ధృవీకరణ పత్రం, Bank Pass book తో పాటు Bank కోరే ఇతర పత్రాలు అవసరం
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
ఉద్యోగిని పథకాన్ని పొందాలనుకునే మహిళలు.. తమకు దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లి.. Money కోరాలి. వారు కావాల్సిన పత్రాలను కోరతారు. వాటిని సమర్పించాలి. అలాగే ఓ ఫారం ఇస్తారు. దాన్ని పూర్తి చేసి ఇవ్వాలి. ఆ తర్వాత అన్నీ పరిశీలించి loan ఇస్తారు. లేదంటే.. బ్యాంకుల అధికారిక website లో కూడా apply చేసుకోవచ్చు. ఐతే.. online కంటే, డైరెక్టుగా వెళ్లి అడగడం ద్వారా మరింత త్వరగా పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది