Mango Leaves in Telugu : షుగర్‌కు అద్భుతంగా పనిచేసే ఈ ఆకులు ఎక్కడ కనిపించినా.. విడిచిపెట్టకుండా తెచ్చుకోండి..!
Mango Leaves in Telugu : మామిడికాయల సీజన్ అయితే అయిపోయింది. మామిడికాయలను తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే కేవలం మామిడి పండ్లే కాదు, మామిడి ఆకులు కూడా మనకు ఎన్నో రకాల మేలు చేస్తాయి.
Mango Leaves in Telugu : వీటిల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల మామిడి ఆకులతో మనం పలు రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు. మామిడి ఆకులు మనకు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటాయి. వీటిని పలు విధాలుగా వాడి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మామిడి ఆకుల్లో విటమిన్లు సి, బి, ఎ లతోపాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి మామిడి ఆకులతో మన శరీరానికి ఎంతో బాగా పోషణ లభిస్తుంది.
షుగర్‌కు :
ఈ మామిడి ఆకులను నీళ్లలో వేసి, మరిగించి ఆ నీటిను తాగుతుంటే, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. షుగర్ ఉన్నవారికి ఇలా చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇక Pre-diabetes ఉన్నవారు కూడా మామిడ ఆకులతో తయారు చేసిన నీళ్లను తాగుతుంటే డయాబెటిస్ పూర్తిగా రాకుండా కూడా నివారించవచ్చు. దీంతో ట్యాబ్లెట్లను వాడాల్సిన అవసరం తప్పుతుంది.
హైబీపీకి :
మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గిస్తాయి. రక్తనాళాలను ఆరోగ్యంగా మారుస్తాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. అధిక బరువును తగ్గించడంలోనూ మామిడి ఆకులు ఎంతగానో పనిచేస్తాయి.
ఈ ఆకులతో తయారు చేసిన నీటిని తాగితే Lipid metabolism మెరుగు పడుతుంది. దీంతో కొవ్వులు సులభంగా కరిగిపోతాయి. దీని వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు. మామిడి ఆకుల టీ అనేది నాచురల్ మెడిసిన్ మాదిరిగా పనిచేస్తుంది. కాబట్టి శరీరంలో పేరుకుపోయినటువంటి అధిక కొవ్వు సైతం కూడా కరిగిపోతుంది.
శ్వాసకోశ సమస్యలకు :
మామిడి ఆకులను ఉపయోగించి ఆస్తమా, బ్రాంకైటిస్, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ మామిడి ఆకులతో తయారు చేసినటువంటి టీని తాగడం వల్ల గొంతు నొప్పి, మంటలు నయం అవుతాయి. అలాగే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు.
మామిడి ఆకుల నీళ్లను తాగుతుంటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా విరేచనాలు తగ్గుతాయి. మామిడి ఆకుల వలన జీర్ణాశయ ఎంజైమ్‌లను తయారు చేయడంలో ఇవి ఎంతగానో సహాయం చేస్తాయి. దీంతో మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది.
ఆర్థరైటిస్ నొప్పులకు :
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు మామిడి ఆకులను నేరుగా కూడా తినవచ్చు. లేదా వాటితో తయారు చేసిన నీటిని తాగవచ్చు. దీంతో నొప్పులు తగ్గుతాయి. మామిడి ఆకుల్లో అనాల్జెసిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ నీళ్లను సేవిస్తుంటే నొప్పుల నుంచి బయట పడవచ్చు. వాపులు కూడా తగ్గుతాయి.
Mango Leaves in Telugu : చర్మంపై కాలిన గాయాలు, దద్దుర్లు మరియు మొటిమలను తగ్గించడంలోనూ ఈ మామిడి ఆకులు ఉపయోగపడతాయి. ఈ ఆకుల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మంపై వచ్చే దురద తగ్గుతుంది. ఎరుపుదనం పోతుంది. చర్మ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ విధంగా మామిడి ఆకులతో మనం అనేక విధాలా ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక : ఈ సమచారాన్ని అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహా మేరకు తీసుకొని అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా వైద్యులని సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.