లాజిక్ చిన్నదైనా లాభం మాత్రం పెద్దది.. సేవింగ్స్ కి బదులుగా ఎందుకు పెట్టుబడి పెట్టాలి? Money Investment Tips in Telugu.
Money Investment Tips in Telugu : ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న కుటుంబంలో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని చెప్పవచ్చు. వారు తమ అవసరాల కోసం ఆర్థిక ప్రణాళికను అనుసరిస్తూ తమజీతంలో కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం భద్రపరుస్తుంటారు. తమ యొక్క భవిష్యత్తు అవసరాల కోసం చాలా మంది బ్యాంకు డిపాజిట్ల వంటి సంప్రదాయకరమైన పొదుపు పథకాల్లోనే తమ యొక్క డబ్బులను జమ చేస్తుంటారు.
ఇలా షార్ట్ టర్మ్ సేవింగ్స్ పథకాల్లో డబ్బులు జమ చేయడం ద్వారా ఇంటి అవసరాలు, ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇన్సూరెన్స్ పాలసీల వంటి,వాటిని సరైన సమయంలో చెల్లించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ భవిష్యత్తుకు సేవింగ్స్ ఎంతగానో ఆసరాగా నిలుస్తాయి. అయితే, భార్యాభర్తలు ఉద్యోగం చేస్తూ శాలరీలో కొంత మొత్తాన్ని సేవింగ్స్ చేయడం వరకు బాగానే ఉన్నా,కానీ అసలు కిటుకు ఇక్కడే ఉంటుంది.
Money Investment Tips in Telugu : ఎవరైనా తమ భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రత పొందాలనుకుంటున్న వారు మాత్రం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం పొదుపు మరియు పెట్టుబడుల మధ్య తేడా. సేవింగ్స్ చేయడం అనేది డబ్బులు పోగు చేయడం. అలాగే చాలా సులభంగా వాటిని పొందడగలగడం. ఎలాంటి ప్రమాదం అనేది ఇందులో ఉండదు.
ఉదాహరణకు బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు. తమ అవసరాలకు అనుకూలంగా వీటిని ఎంచుకోవచ్చు.ఎటువంటి ప్రమాదం ఉండదు, స్థిరమైన రాబడి ఉంటుంది. ఇలాంటివి తమ తక్షణంగా వచ్చే మరియు ఊహించని, అవసరాలను తీర్చుకునేందుకు మాత్రమే సేవింగ్స్ ఉపయోగపడతాయి. పొదుపు పథకాల్లో తక్కువ రిటర్న్స్ అనేవి ఉండడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఖర్చులకు సరిపడవు. దీంతో నష్టపోవాల్సి వస్తుంది.
తమ దీర్ఘకాలిక లక్ష్యాన్ని చేరుకునేందుకు డబ్బులను పొదుపు చేయకూడదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.దీర్ఘకాలిక లక్ష్యాలని వేగంగా చేరుకునేందుకు పెట్టుబడులు పెట్టాలని చెబుతున్నారు. తమ సాలరీ నుంచి కొంత భాగాన్ని వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు పెద్ద మొత్తంలో రిటర్న్స్ అనేవి ఉంటాయి. దీంతో తమ లక్ష్యాలను చేరుకోవడమే కాదు తమ జీవన శైలిని సైతం మరింతగా మెరుగుపరుచుకోవచ్చు.
అయితే, పెట్టుబడులు అనేవి రిస్క్ తో కూడుకున్నవి. ఏదైనా రిస్క్ తీసుకున్నప్పుడే మనకు రివార్డ్ దక్కుతుందనేది ఆర్థిక నిపుణులు చెప్పే మాట.తమ డబ్బులను పెట్టుబడి చేసే ముందు ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని, సరైన మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా తాము ఊహించినదానికంటే ఎక్కువ తిరిగి పొందవచ్చు. బ్యాంకు అకౌంట్లలో డబ్బులు ఉంచడం కన్నా, వాటిని పెట్టుబడి పెట్టడంతో పెద్ద మొత్తంలో నగదును పొందవచ్చు.
పెట్టుబడులు అనేవి హైరిటర్న్స్ అందిస్తాయి. అయితే, రిస్క్ కూడా ఉంటుంది, లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. హెచ్చుతగ్గులు ఉంటాయి. తమ యొక్క లక్ష్యాలను చేరుకునేందుకు ఒక టైం ని నిర్ణయించుకుని, దానికి తగినట్లుగా పెట్టుబడి పెట్టే ,మార్గాలను ఎంచుకోవాలి. తమ రిస్క్ వెయిటేజ్‌ని అంచనా వేసుకుని స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడులను పెట్టవచ్చు.
అయితే, తమ యొక్క అత్యవసర అవసరాల కోసం కావాల్సిన నిధులు మాత్రం బ్యాంకు అకౌట్లలో ఉంచుకోవాలి. కానీ, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం తప్పకుండా పెట్టుబడి మార్గాల్లో డబ్బులు పెట్టాలి. మరోక వైపు,పెట్టుబడి పెట్టి,అలా వదిలేయకుండా తమ డబ్బులు ఏ విధంగా పెరుగుతున్నాయి? అని వాటి పనితీరును తారీపు వేసుకుంటూ , ప్రణాళికలను చేంజ్ చేసుకుంటూ, ముందుకు వెళ్లడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చు.Money Investment Tips in Telugu