MRF Share Price : MRF షేర్లు మంగళవారం రోజున ఒక్కో MRF షేర్ కు రూ . 1 లక్ష మైలురాయిని అధిగమించాయి, ఇంట్రాడే లో 1.5% లాభపడింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ టైర్ మేకర్ కంపెనీగా నిలిచింది. నిన్న NSE లో రూ . 98,968. వద్ద ముగిసిన తర్వాత షేరు వాల్యూ కొన్ని లాభాలను తగ్గించి కీలక మార్పు క్రిందకి పడిపోయేముందు ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ . 1,00,439.95 ను తాకింది, భారతదేశంలో టైర్ మేజర్ షేర్లు ఈ మైలురాయిని సాధించిన మొదటివి గా చెప్పుకోవచ్చు
గత ఒక సంవత్సరంలో MRF షేర్ ధర 52.4% పెరిగింది అలాగే జూన్ 17, 2022 న దాని 52 వరాల కనిష్ట స్థాయి రూ . 65,878.35 నుండి మంగళవారం జరిగిన ట్రేడ్ లో తాజా జీవితకాల గరిష్ట స్థాయికి తాకింది, రెండేళ్ల క్రితం రూ . 90,000 మరుకును తాకిన తర్వాత , స్క్రిప్ 10 % కదిలి ఈ మైలు రాయిని చేరుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇదిలా ఉంటె ” గత 10 సంవత్సరాలలో కేవలం మూడు సంవత్సరాల ప్రతి కూల రాబడితో అలాగే 2018 లో గరిష్టం గా 7% డ్రా డౌన్ తో కంపెనీ గతంలోనే అద్భుతమైన పని తీరును నమోదు చేసింది ” అని స్టాక్ బాక్స్ రీసెర్చ్ హెడ్ అయిన మనీష్ చౌదరి చెప్పారు.
అలాగే MRF అనే సంస్థ టైర్ పరిశ్రమలో వైవిధ్య భరితమైన ఉత్పత్తుల సమర్పణతో బలమైన ఉనికిని కలిగి ఉండగా అలాగే ఈ రంగంలో పెరుగుతున్నటువంటి పోటీ తీవ్రత కంపెనీ పని తీరును ముందుకు తీసుకు వెళ్లేందుకు కీలకంగా పర్యవేక్షించదగినదని అయన తెలిపారు, కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయి అలాగే ప్రస్తుత వాల్యుయేషన్ లో స్టాక్ ఖరీదైనదిగా కనిపిస్తున్నందున తక్కువ స్థాయి లలోస్టాక్ లోకి ప్రవేశించామని పెట్టుబడిదారులు సలహా ఇస్తున్నారు , Q4 ఆదాయాల తో పాటు ముడిసరుకుల ధరల్లో బలమైన తగ్గింపు ధరలో బుల్లిష్ సెంటిమెంట్ కు దోహద పండించి ఇది ర్యాలీ కి దారితీసిందని టిప్స్ 2 ట్రేడ్ సహ వ్యవస్థాపకుడు మరియు శిక్షకుడు AR రామచంద్రన్ తెలిపారు
MRF Share Price రూ.1,25,000 పై కన్నేసిందా ?
” 82000 నుండి 1 లక్ష వరకు బలమైన ర్యాలీ తరువాత మనం చూడగలిగి నట్లుగా స్టాక్ కన్సాలిడేషన్ లో ఉంది అలాగే ప్రస్తుతానికి దీని వేల్యూ 95000 దగ్గర బలమైన మద్దతు ఉంది కాబట్టి ఇది 95000 పైన ట్రేడ్ అవుతున్న సమయం వరకు దీపావళి వరకు అతి త్వరలో 125000 ని తాకవచ్చు అలాగే ఇన్వెస్టర్లు స్టాక్ పట్ల సానుకూలంగా ఉండాలి ” అని జి సి ఎల్ బ్రోకింగ్ రీసెర్చ్ అనలిస్ట్ వైభవ్ కౌశిక్ అన్నారు
అలాగే విస్తృత మార్కెట్ సూచీలతో పోలిస్తే MRF గత కొన్ని నెలల్లో మరుగైనటువంటి పని తీరును కనబరిచింది, ఈ స్టాక్ ప్రస్తుతం వీక్లి చార్ట్ లలో బుల్లిష్ ఫ్లాగ్ నమూనాను రూపొందిస్తోంది. అని వివిధ రకాల అనలిస్ట్ లు MRF గురించి తెలియజేయడం జరిగింది
MRF స్టాక్ ఇంకా పైకి ఊపు అందుకునే అవకాశం ఉంది ” భారతీయ స్టాక్ మార్కెట్ లోని ప్రముఖ స్టాక్ లలో ఒకటైన ఈ సంస్థ 1 లక్ష మైలు రాయిని అధిగమించిన తరువాత మొదటి 6 అంకెల స్టాక్ గా చరిత్ర సృష్టించింది, అలాగే టెక్నికల్ చార్ట్ విశ్లేషణ వృద్ధికి మరింత సంభావ్యత ఉందని సూచిస్తుంది ఎందుకంటే క్లాసికల్ ఫ్లాగ్ ఫార్మేషన్ అని పిలువ బడే బ్రేక్ అవుట్ నమూనాను మనం గమనించవచ్చు అలాగే ఈ నమూనా దాదాపుగా 110000 సంభావ్య లక్ష్యంతో స్టాక్ ఉపందుకొని కొనసాగే అవకాశం ఉందని సూచిస్తుంది తాత్కాలిక ఫుల్ బ్యాక్ లు ఉన్నప్పటికినీ మునుపటి బ్రేక్ అవుట్ స్థాయి 95000 బలమైన మద్దతును అందించగలదని మరియు స్టాక్ కు బలమైన పునాదిగా పని చేస్తుందని అంచనా వేయడం చాలా ముఖ్యం అని ” స్వస్తిక ఇన్వెస్టమార్ట్ రీసెర్చ్ హెడ్ అయినా సంతోష్ మీనా అన్నారు.
For More Articles
Online ద్వారా నిజంగానే లక్షలు సంపాదించవచ్చా ? – How to Earn Money From Home in Telugu