మునగాకు ను తక్కువగా అంచనా వేస్తున్నారా..! దీనిలో పొషకాలు తెలుస్తే అస్సలు వదిలిపెట్టరు… Munagaku Benefits in Telugu : 2024 మనగాకు ను తక్కువగా అంచనా వేస్తున్నారా..!

ప్రకృతి సంపదలో మునగాకు ఒకటి. మనకు తరచూ కనిపిస్తున్న వాటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవిమనకు ఈ ప్రకృతిలో ఉంటాయి. వాటి గురించి తెలుసుకుని, వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎంతో ఆరోగ్య ప్రయోజనాలను వాటి నుండి పొంద గలుగుతాం.

Munagaku Benefits in Telugu : మునగ ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం మునగ ఆకుల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, ఇనుము , మెగ్నీషియం, విటమిన్-A, C, B కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్‌, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. మునగ ఆకుల్లో Antitumor, antipyretic, antiepileptic, anti-inflammatory, antiulcer, antispasmodic, diuretic, antihypertensive, antidiabetic, hepatoprotective, antibacterial, antifungal లక్షణాలు ఉన్నాయి. మునగాకు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. మన చర్మాన్ని, జుట్టును సంరక్షించే గుణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మునగాకు పొడి, మునగాకు నూనె కూడా మన సౌందర్య సంరక్షణలో సహాయపడతాయి. మునగాకు మాత్రమే కాకుండా వాటి కాయలతో కూడా చాలా లాభాలు ఉంటాయి. వాటిని వంటలలో, వివిధ రకాల వాటిలలో కూడా వాటిని వినియోగిస్తారు.

Munagaku Benefits in Telugu : మునగ ఆకులోని పోషకాలు ఫ్రీ రాడికల్స్‌యొక్క డ్యామేజ్‌‌ను నివారిస్తాయి. మునగాకు ఫేస్‌ ఫ్యాక్‌, మునగాకు ఆయిల్‌ వాడటం వలన ముడతలు, గీతలు రాకుండా పరిరక్షిస్తుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. మీ బ్యూటీ రొటీన్‌లో మునగాకు చేర్చుకుంటే, ముడతలు, మచ్చలు రాకుండా చేసి మీ చర్మానికి కాంతివంతంగా చేయడంలో తోడ్పడుతుంది. దీంతో, మీరు యంగ్ గా కనిపిస్తారు. అలాగే ఇందులోని విటమిన్ ‘C’ కొలాజెన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేసి చర్మంపై ముడతలు పడకుండా కాపాడుతుంది. . కాబట్టి వృద్ధాప్య ఛాయలు దరికి చేరకుండా జాగ్రత్తపడచ్చు. ఒకవేళ ముఖంపై సన్నటి గీతలు కానీ మొటిమలు కూడా ఉంటె అవి కూడా తగ్గుముఖం పట్టి తాజాగా మరియు అందంగా కనిపించే చర్మంని మీ సొంతం చేసుకోవచ్చును.

Munagaku Benefits in Telugu : మునగ నూనెలో విటమిన్ C, E సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఇవి చర్మంపై ఉండే మచ్చలను పూర్తిగా తొలగిపోయేలా చేస్తాయి. కాబట్టి చర్మంపై ఉండే Black spots, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, Pigmentation వంటి సమస్యలకు మంచి పరిష్కారంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ ఆయిల్ లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాల వల్ల స్కిన్ పై కాలిన మచ్చలు, గాయాలు వంటివి త్వరగా తగ్గుతాయి.

Munagaku Benefits in Telugu : పెదవులకు రాసుకొనే లిప్‌ బామ్స్‌, పెదవుల సంరక్షించే,ఉత్పత్తులలో మునగాకు యొక్క నూనెను విరివిగా వాడుతుంటారు. ఇది పెదవుల సున్నితమైన చర్మాన్ని తేమతో ఉండేలా సహాయపడుతుంది. అంతేకాకుండా మృదువుగా అయ్యేలా మారుస్తుంది. చలి కాలంలో మీ పెదవుల సంరక్షణకు మునగాకు చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్స్, మినరల్స్, చర్మానికి తగినంత తేమతో పాటు పోషణ కూడా అందెలా చేస్తాయి.

మునగాకుల్లోని పోషకాలు ముఖంపై మచ్చలను నివారించడంలో సహాయపడతాయి. ఇది మీ ముఖానికి ఇవెన్‌ టోన్‌ ఇవ్వడం ద్వార, మీ ముఖ ఛాయ మెరుగుపడుతుంది.

మునగాకు నూనె ముఖంపై అప్లై చేస్తే , దాని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాల కారణంగా మొటిమలను నివారించవచ్చు. మునగాకు మీ రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే , శరీరంలోని Toxins బయటకు వస్తాయి. బ్లడ్ లో మలిన పదార్థాల కారణంగానూ , మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది . మునగాకు మనకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీంతో మొటిమలను నివారించవచ్చు, ఆరోగ్యకరమైన చర్మం ని పొందవచ్చు.

Munagaku Benefits in Telugu : మునగాకు ఓపెన్‌ పోర్స్‌ను తగ్గిస్తుంది. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంచే, కొల్లాజెన్‌ ప్రొటిన్‌ను మెరుగుపరుస్తుంది. ఇది చర్మ రంధ్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది.


మునగ నూనె కేవలం చర్మానికే కాకుండా జుట్టుకు కూడా కావల్సినంత తేమని కూడా అందిస్తుంది. ఇందుకోసం కాస్త మునగ నూనె తీసుకొని జుట్టు తడిగా ఉన్నప్పుడే కుదుళ్లలోకి చేరేలా మృదువుగా నెమ్మదిగా మర్దన చేయాలి. ఈ నూనెని తరచూ వాడడం ద్వారా దృఢమైన కురులు అందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే చుండ్రు, జుట్టు చివరన చిట్లినటు వంటి సమస్యలు కూడా మునగ నూనె తో దూరం అవుతుంది.

Munagaku Benefits in Telugu :

మునగాకు పొడి – 2 టేబుల్ స్పూన్లు
రోజ్ వాటర్ – సరిపడినంత
నీరు – సరిపడినంత
తేనె – అర టీస్పూన్
నిమ్మరసం – పావు టీస్పూన్

ఇవన్నీ, కలిపి పేస్ట్‌లా చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసిన 10 మినిట్స్ పాటు ఆరబెట్టండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. తర్వత మీ ముఖాన్ని పొడి టవల్‌తో తుడవండి. మీ ముఖంపై మాయిశ్చరైజర్‌ని అప్లై చేయండి. ఇలా చేస్తే మృదువైన చర్మం కూడా మీ సొంతం అవుతుంది.

మునగాకు పొడి – 5 టేబుల్ స్పూన్లు
పెరుగు – అర కప్పు

రెండింటినీ కలిపి ఒక Paste లాగా చేసి జుట్టు మొదళ్ళ నుంచి, చివర్ల వరకు బాగా అప్లై చేయండి. తర్వతా షవర్‌ క్యాప్‌తో జుట్టును కవర్‌ చేయండి. అరగంట తర్వాత మీ జుట్టును గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఈ ప్యాక్‌ ని వారములో 2 సార్లు అప్లై చేసుకుంటే, జుట్టు దృఢంగా మృదువుగా మారుతుంది, చుండ్రు సమస్య నుండి కూడా దూరం అవుతుంది. జుట్టు ఒత్తుగా, పొడువుగా పెరుగుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీ యొక్క అందం మరియు ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me