New Swarnima Scheme For Women: కేంద్ర పథకం ద్వారా మహిళలకు గొప్ప వరం.రూ.2,00,000 ల వరకు ఇలా సహాయం పొందండి.
New Swarnima Scheme For Women : కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మహిళలు రూ.2,00,000 పొందవచ్చు. దానికి కావాల్సిన అర్హతలు, కావాల్సిన పత్రాలు, ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
New Swarnima Scheme For Women : మహిళలకు సమయ పరిమితితో కూడిన రుణాలను ఇప్పించేందుకు కేంద్రం ఈ స్వర్ణిమ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా పేద మహిళలు వ్యాపారం చేసేందుకు రూ.2,00,000 దాకా రుణ సహాయంను పొందగలరు. ఈ రుణంపై వడ్డీ సంవత్సరానికి 5% మాత్రమే ఉంటుంది.
New Swarnima Scheme For Women : ఈ డబ్బుల ద్వారా BC మహిళలు సామాజికంగా, ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని National BC Finance and Development Corporation (NBCFDC) పరిచయం చెయ్యగా,దీనికి రాష్ట్ర ఛానలైజింగ్ ఏజెన్సీలు (SCAs) నోడల్ ఏజన్సీగా ఉంటాయి.
స్వర్ణిమ పథకం యొక్క ప్రయోజనాలు :
మహిళ తన కాళ్లపై తాను నిలబడి,స్వయంగా ఉపాధి పొందేందుకు రూ.2,00,000 లక్షల దాకా రుణాన్ని పొందవచ్చు. అంతకంటే ఎక్కువ కావాలంటే మాత్రం ఆమె సొంతంగా పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. వ్యాపారానికి అయ్యే, ఖర్చు రూ.2,00,000 లోపు అయితే మాత్రం రుణంగా మీరు పొందవచ్చు.
స్వర్ణిమ పథకము పొందడానికి ఉండాల్సిన అర్హతలు :
1.దరఖాస్తుదారులు మాత్రం తప్పనిసరిగా స్త్రీ అయి ఉండాలి. 2.దరఖాస్తుదారు వయస్సు ఖచ్చితంగా 18, 55 సంవత్సరాల మధ్య ఉండాలి. 3.దరఖాస్తుదారు తప్పనిసరిగా పారిశ్రామికవేత్త అయి ఉండాలి. 4.దరఖాస్తుదారు మొత్తం వార్షిక కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.3 లక్షల కంటే తక్కువ ఉండాలి.
స్వర్ణిమ పథకానికి కావాల్సిన పత్రాలు :
ID proof కోసం ఆధార్ కార్డు వంటిది లేదా రేషన్ కార్డు, స్థానిక ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో వంటివి అవసరం.
స్వర్ణిమ పథకానికి దరఖాస్తు చేసే విధానం:
అర్హురాలైన మహిళ,తనకు దగ్గర్లోని SCA ఆఫీసుకి వెళ్లాలి. ఆ ఆఫీస్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారిక పోర్టల్ (https://nsfdc.nic.in/channel-patrners/scas)లో చెక్ చెయ్యవచ్చు.
ఈ ఆఫీసు దగ్గరకు వెళ్తే, స్వర్ణిమ పథకం యొక్క దరఖాస్తు ఫారం ఇస్తారు. అందులో అడిగిన వివరాలను రాయాలి. ఎందుకు రుణం కావాలో, ఎలాంటి ట్రైనింగ్ కావాలో చెప్పాలి. దరఖాస్తు పత్రంతోపాటూగా అడిగిన పత్రాల జిరాక్సులు కూడా దానికి జతచేసి, సమర్పించాలి. దరఖాస్తును పరిశీలించాక, లోన్ ఇస్తారు.