Ola S1 X పై దీపావళి పండగ బంపర్ ధమాకా ఆఫర్ !

Ola S1 X పై దీపావళి పండగ బంపర్ ధమాకా ఆఫర్ !

Electric స్కూటర్ల ఆవిష్కరణలో సంచలనం Ola Electric దీపావళికి ఒక అద్భుతమైన Offer ను తీసుకొచ్చింది. Ola S1 X 2KWh ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై ఆకర్షణీయమైన తగ్గింపు ఆఫర్ ను ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.

దీవాళి పండుగ సందర్భంగా అందిస్తున్న Discount offer గురించి Ola Electric ప్రత్యేక ప్రకటన చేసింది. అన్ని రకాల కస్టమర్లకు రూ.5,000 Discount ఇస్తోంది. అంతేకాకుండా ఎంపిక చేసిన కొందరు కస్టమర్లకు రూ.25,000 వరకు అదనపు తగ్గింపు అందుబాటులో ఉంటుందని, కంపెనీ ధృవీకరించింది. ఇది స్టాక్ అయిపోయే వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమేనని, ధరలో మార్పు కాదని నొక్కి చెప్పింది.

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ Ola Electric తన Ola S1 X 2KWh ఎలక్ట్రిక్ స్కూటర్పై డిస్కౌంట్ ఆఫర్ను స్పష్టం చేసింది. ప్రకటించిన డిస్కౌంట్లకు సంబంధించిన Ola Electricపై ఆరోపణలు వచ్చాయి. ఈ విధానంలో Ola స్టాక్ 3 శాతం పడిపోయిందని మీడియా కథనాలు సూచిస్తున్నాయి. దీనికి Ola కంపెనీ ప్రతిస్పందించింది. తగ్గింపు లిమిటెడ్ పిరియడ్ పండుగ ఆఫర్ అని, స్కూటర్ అధికారిక ధర చేంజ్ కాలేదని Ola Electric ఒక ప్రకటనలో తెలిపింది.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)కి రాసిన లేఖలో Ola Electric డిస్కౌంట్ను వివరించింది. పండుగ టైంలో అన్ని రకాల కస్టమర్లకు రూ.5,000 Discount ఇస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఎంపిక చేసుకున్న కొందరు కస్టమర్లకు రూ.25,000 వరకు అదనపు తగ్గింపు అందుబాటులో ఉంటుందని తెలిపింది. స్టాక్ అయిపోయే వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, Ola స్కూటర్ కొనుక్కోవాలనుకున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరింది.

Ola స్కూటర్లు దేశవ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాయి. Stylist, New Looking Face తో Ola తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లు వినియోగదారులకు చాలా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా వాటి Look కోసమే చాలా మంది ఈ స్కూటర్లు కొంటున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. Ola ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఇప్పటికే అనేక ఆఫర్లు ఇచ్చి ప్రజల ఫేవరేట్ గా మారిపోయింది. ఇప్పుడు దీపావళి సందర్భంగా మరి కొన్ని ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.

Ola S1 X 2KWh రూ.49,999కి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. ఈ ధరలో మార్పుల గురించి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) ఓలా కంపెనీని ప్రశ్నించింది. స్కూటర్ ధర మారలేదని Ola స్పందించింది. ధరను రూ.25,000 డిస్కౌంట్ ఆఫర్ గణనీయంగా తగ్గిస్తుందని, కానీ ఇది పరిమిత స్టాక్కు ఉన్నంత వరకేనని ARAIకి రిప్లై ఇచ్చింది. దీంతో Ola స్కూటర్ ధరల చేంజ్ పై స్పష్టత వచ్చినట్లు అయ్యింది.

ఓలా స్కూటర్ ధరలో మార్పు లేదని, ప్రకటించిన Maximum discount రూ.25 వేలు మాత్రమే వర్తింపజేసినట్లుగా ఓలా రుజువు చూపింది. October 6, 2024 నాటి ఇన్వాయిస్ను Ola అందించింది. అదనపు డాక్యుమెంటేషన్ కూడా ARAIకి సమర్పించింది. వాటిని పరిశీలించిన అధికారులు ola స్కూటర్ల ధరల్లో చేంజ్ లేవని గుర్తించారు.

స్టాక్ ఎక్స్ఛేంజ్కు తన ప్రతిస్పందనలో, తన వాటా ధరలో ఇటీవలి మార్పుకు ఎటువంటి బహిర్గతం కాని కారణాలు లేవని Ola హామీ ఇచ్చింది. SEBI నిబంధనలకు పారదర్శకత, కట్టుబడి ఉండటాన్ని ధృవీకరించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top