PAN Aadhar Link చేశారా ? మరో కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ

PAN Aadhar Link చేశారా ? మరో కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ

PAN Aadhar Link : పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసుకునే గడువు జూన్ 30 ( శుక్రవారం ) తో ముగిసింది. అయితే ఇదిలా ఉండగా లింక్ చేసుకునే వారికి చివరి నిమిషాల్లో అవాంతరాలు తప్పలేదు చలాన్ Download చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురుకావడంతో ఆదాయపన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. అయితే ఆధార్ తో పాన్ కార్డు లింక్ చేసుకోవాలని పలుమార్లు గడువు పెంచుతూ వస్తుంది. చివరి గా 1000 రూ ఫైన్ తో జూన్ 30 వరకు లింక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఇప్పుడు ఆ గడువు కూడా ముగిసింది ఈ గడువు శుక్రవారంతో పూర్తి అయింది, పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం కోసం చెల్లింపులు చేసిన తర్వాత చాలా మంది Download చేసుకునే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్న విషయం తమ దృష్టికి వచ్చింది అని తెలిపింది, ఈ నేపత్యంలో చలాన్ కోసం చెల్లింపులు చేసినవారు తర్వాత ఐటీ వెబ్ సైట్ లో మళ్ళీ లాగిన్ అయి E – PAY టాక్స్ సెక్షన్ లో పెమెంట్స్ పూర్తి అయిందా లేదా అనే విషయాన్నీ తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది.

అందులో గనక మీ Transaction పూర్తి అయినట్లు చూపిస్తే ఆధార్ పాన్ లింక్ చేసుకోవచ్చని వెల్లడించింది అదే విదంగా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం కోసం కచ్చితంగా చలాన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఐటీ శాఖ తెలిపింది పేమెంట్ పూర్తి చేసిన వెంటనే పాన్ కార్డు Holder రిజిస్టర్డ్ E -Mail అడ్రస్ కి చలాన్ కి సంబందించిన రశీదు కాపీ వస్తుందని పేర్కొంది, పేమెంట్ చేసిన తర్వాత కూడా ఆధార్ పాన్ కార్డు అనుసంధానం కాకుంటే ఆ విషయాన్నీ తమ దృష్టికి తీసుకుకురావాలని ఆదాయ పన్ను శాఖా పరిగణనలోకి తీసుకుంటుందని ఒక ప్రకటనలో తెలిపింది

PAN Aadhar Link

మీ ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అయిందో లేదో తెలుసుకునేందుకు ఆదాయపన్ను శాఖ Website లో తెలుసుకోవచ్చు దీనికిగాను పాన్ కార్డు ఆధార్ కార్డు నంబర్లు ఎంటర్ చేసి కాప్చ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు లింక్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ display లో చూపిస్తుంది, ఒకవేళ ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ కాకుంటే చాలావరకు మీ ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతాయి ఇదే కాకుండా ఇట్ రిటర్న్స్ దాఖలు చేయడంలో కూడా చాలా అవాంతరాలు ఎదురవుతాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me