Red Rice: ఎర్ర బియ్యం తినడం వల్ల లాభాలు ఏమిటి? …. దీనిని తీసుకుంటే ……

Red Rice ఈ ఎర్రటి బియ్యంలో పోషకాలు అనేకం దాగి ఉన్నాయి. సాధారణంగా Polish చేసిన బియ్యం కన్నా,బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇంకా ఇందులో మెగ్నేషియం,కాల్షియమ్,విటమిన్లు B1,B2 ఉన్నాయి. చాలా కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది.ముఖ్యంగా తృణ ధాన్యాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను చాల ఎక్కువగానే ఆచరిస్తున్నారు. మన సాంప్రదాయ పంటలలో ధాన్యం విషయానికి వస్తే చాలా రకాల ధాన్యాలు సాగు చేస్తున్నారు. వాటిలో Brown rice,red rice,Black rice ఇలా చాల రకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. Red rice ఎర్రటి బియ్యం విషయానికి వస్తే ఇందులో అనేక పోషకాలున్నాయి.
ఎర్ర బియ్యంలో ఆంథోసైనిన్ అనే విలక్షణమైన పదార్థము ఉంది. ఇది ఎర్ర ఉల్లి,ఎర్ర beetroot లలో కనిపిస్తూ ఉంటుంది. ఈ బయో ఫ్లెవనాయడ్స్ కు దగ్గరి సంబంధం ఉండడం వల్ల ఈ ఎర్ర బియ్యం తీసుకుంటే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తాయి. ఈ ఎర్ర ధాన్యం ప్రపంచం మొత్తం సాగులో ఉంది. ఈ ఎరుపు ధాన్యంలో అధిక Fiber,Iron కంటెంట్ కలిగి ఉన్నాయి.


ఎర్రటి బియ్యంలో అనేకమైన పోషకాలు దాగి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పాలిష్ చేసిన తెల్ల బియ్యం కన్నా,ఈ ఎర్ర బియ్యంలో అనేక విటమిన్లు,ఖనిజాలు ఉన్నాయి. ఇంకా ఇందులో మెగ్నేషియం,కాల్షియమ్,విటమిన్లు బి1,బి2 ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల కండరాలు,నరాల పనితీరుతో సహా అనేక శారీరక విధులకు మెగ్నీషియం కీలకంగా పని చేస్తుంది. ఈ ఎర్రటి బియ్యం వల్ల బలమైన ఎముకలు,దంతాలకు కాల్షియం అవసరం. ఈ ఎర్రటి బియ్యం మెదడు ఆరోగ్యానికి పని చేస్తాయి.

ఈ ఎర్ర బియ్యంలో Fiber బాగా ఉంటుంది. కప్పు బియ్యంలో… 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ప్రతీ వ్యక్తికీ రోజూ 8 గ్రాముల ఫైబర్ అవసరం. వైట్ రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఎర్ర బియ్యం తినేవారికి మల బద్ధకం సమస్య అనేది ఉండదు. అలాగే గుండె జబ్బులు, అధిక బరువు సమస్యలు అనేవి రావు.

ఎర్రబియ్యంలో షుగర్ను తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గితే ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల డయాబెటిస్ కంట్రోల్లో ఉండాలంటే ఎర్ర బియ్యం సరైనవి.

Blood లో కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి ఎర్ర బియ్యానికి ఉంది. ఎప్పుడైతే చెడు కొవ్వు తగ్గుతుందో… గుండెకు రక్త సరఫరా అనేది సరిగ్గా సాగుతుంది. అంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎర్రబియ్యంలోని మెగ్నీషియం… బీపీని క్రమబద్ధీకరిస్తుంది. అందువల్ల బీపీ వచ్చేవారికి తరచూ వచ్చే హార్ట్ ఎటాక్ ఈ రైస్ తినేవారికి పెద్దగా రాదు.

ఎర్రబియ్యంలో Fiber ఎక్కువగా ఉండటంతో… అది అధిక బరువు రాకుండా చేస్తుంది. ఎర్రబియ్యాన్ని మనం ఎక్కువగా తినం కాబట్టి కొద్దిగా తినగానే పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఐతే… ఈ రైస్ ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది.

బీ6 Vitamin గ్రూప్ మనకు చాలా అవసరం. DNAలో ఎర్రరక్త కణాలు తయారవ్వాలంటే ఈ విటమిన్ కావాలి. మన ఆర్గాన్లు చక్కగా పనిచెయ్యాలంటే ఇది కావాలి. ఇంకా చాలా ప్రయోజనాలు ఈ గ్రూప్ విటమిన్లతో వస్తాయి. కాబట్టి ఎర్రరైస్ తినడం శరీరానికి చాల మంచిది.

ఎర్ర బియ్యం ఆంథోసియానిన్, మాంగనీస్, జింక్ ఉంటాయి. ఇవన్నీ మన బాడీలో విషవ్యర్థాల్ని వెంటపడి తరుముతాయి. ఏవైనా సూక్ష్మక్రిములు ఉన్న శరీరంలో వ్యర్దాలను బయటకు పంపేస్తాయి. అందువల్ల మన శరీరం లో కణాలు హాయిగా ఉంటాయి. అందువల్ల మన చర్మం త్వరగా ముడుతలు పడదు. కాన్సర్ వంటి రోగాలు రావు. గాయాలు త్వరగా తగ్గిపోతాయి.

ఎర్ర బియ్యంలో కాల్షియం, మాంగనీస్ ఉంటాయి. అవి ఎముకల్ని పుష్టిగా, గట్టిగా, బలంగా, పటిష్టంగా మార్చేస్తాయి. అప్పుడు ఎముకలు చిట్లే, పగిలే, బీటలొచ్చే ప్రమాదం ఉండదు. ముసలితనంలో అస్థియోపోరోసిస్ వ్యాధి సోకదు.మెనోపాజ్ తర్వాత మహిళలు చాలా బాధ, నొప్పిని అనుభవిస్తారు. వాళ్లు ఎర్ర బియ్యం తింటే ఉపశమనం పొందుతారు. ఆస్తమా నుంచీ ఉపశమనం పొందేందుకు కూడా ఎర్ర బియ్యం ఉపయోగపడతాయి. తిరిగి ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తుంది. ఇన్నాళ్లూ వైట్ రైస్ తింటున్న మనం… క్రమంగా రెడ్ రైస్ వైపు మళ్లితే మంచిదే.


నోట్:ఈ ఎర్ర బియ్యం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికినీ మరికొందరి సలహాలు,సూచనలు తెలుసుకొని వాడడం మంచిది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!