బియ్యం కడిగిన నీటితో చర్మం నిజంగానే షైన్ అవుతుందా…! Rice Water For Skin.
పూర్వ కాలం నుంచే, బియ్యం నీటిని సౌందర్యం పెంచుకునేందుకు వాడుతున్నారు. ఇప్పుడు ఇది బ్యూటీ చిట్కా గా మారింది. దశాబ్దాల నుండి మహిళలు బియ్యం కడిగిన నీటిని చర్మం తెలుపుగా మారడానికి, మెరవడానికి మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు బియ్యం కడిగిన నీరుతో ఏజ్ వల్ల ఏర్పడే ముడతలు, మచ్చల్ని కూడా పోగొట్టడంలో సహాయపడతాయి.
Rice Water For Skin బియ్యం నీరు చర్మంపై చాలా మృదువుగా పని చేస్తుంది. Sodium Lauryl Sulfate వల్ల కలిగే చికాకును ఈ నీరు తగ్గిస్తాయి. అంతేకాదు వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల వల్ల కలిగే చర్మ సమస్యల నుంచి బయట పడేలా చేస్తుంది. చర్మాన్ని మృదువుగా చేయడానికి బియ్యం నీరు సాయపడుతుంది. Sensitive, combination skin ఉన్న వారు దీన్ని ఉపయోగించొచ్చు.
అసలు బియ్యం నీటిలో ఏం ఉంది?
అన్నం వండే టైంలో బియ్యాన్ని ముందుగా కొద్దిసేపు నీటిలో నానబెట్టి కడుగుతాం. కదా ..! ఈ నీటిలో అనేకమైనటువంటి విటమిన్లు, ఖనిజాలు, అమినో యాసిడ్లు, ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇందులో చర్మాన్ని మృదువుగా చేసే, యాంటీ యాక్సిడెంట్లు, Ferulic acid ఉంటాయి. ఇవి చర్మానికి జీవం ఇవ్వడానికి సహాయ పడతాయి.
ఎలా తయారు చేయాలి?
నానబెట్టిన బియ్యం నీరు :
నానబెట్టిన Rice Water ని సిద్ధం చేసుకోవడం ఎంతో తేలిక. దీని కోసం మీరు ముందుగా అర కప్పు బియ్యం తీసుకుని అందులోని పైపై చెత్త ఏదైనా ఉంటె, తొలగించుకోవాలి. తర్వాత కొన్ని నీరు పోసి, కడగాలి. ఆ తర్వాత రెండు కప్పుల నీరు పోసి.. 30 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత బియ్యాన్ని జార్ సాయంతో పక్కకు తీసేయండి. వీటిని ఫ్రిడ్జ్ లో ఉంచుకుని దాదాపు 7 రోజుల పాటు ఉపయోగించొచ్చు.
బాయిలింగ్ రైస్ వాటర్ :
Rice Water For Skin ముందుగా బియ్యంలోని మురికిని తొలగించేందుకు నీరు పోసి శుభ్రం చేయాలి. ఆ తర్వాత కప్పు బియ్యానికి నాలుగు కప్పుల నీరు కలిపి, stove పై పెట్టి,బాయిల్ చేయండి. ఎక్కువ ఉడికించొద్దు. కాసేపు మాత్రమే ఉంచి.. పక్కకు తీసేయాలి. గది ఉష్ణోగ్రతలోనే, చల్లబరచాలి. ఆపై బియ్యాన్ని, నీటిని వేరు చేయాలి. ఉడకబెట్టడం చేసిన ఈ నీటిని మీరు 7 రోజుల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచి, వాడుకోవచ్చు.
పులియబెట్టిన బియ్యం నీరు :
దీని కోసం పైన చెప్పిన విధంగా నానబెట్టిన బియ్యం నీళ్లని తీసుకోవాలి. వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచకుండా, అలాగే బయటనే, ఉంచాలి. గదిలోనే వీటిని ఒకటి, 2 రోజులు అలాగే,వదిలేయాలి. ఇవి కాస్త వాసన కూడా మారుతాయి. వీటిని వేరే నీటిలో కలిపి, పేస్ కి , చర్మానికి అప్లై చేసుకోవచ్చు.
బియ్యం నీటిని ఎలా ఉపయోగించాలి..?
Rice Water For Skin బియ్యం నీటిని నేరుగా చర్మానికి, జుట్టుకు వాడొచ్చు. వీటికి సహజ సువాసనలు, పదార్థాలు కూడా కలపొచ్చు. కానీ సాధ్యమైనంత వరకు కూడా కేవలం బియ్యం నీటిని వాడటం వల్ల మంచి ఉపయోగం ఉంటుందట. ఒకవేళ మీరు నీటిని పులియబెట్టి వాడాలి అని అనుకుంటే, అందులో కొన్ని సాదా నీటిని కూడా కలుపుకోవాలి.
ఫేషియల్ క్లెన్సర్, టోనర్ :
Rice Water For Skin ఎక్కువగా బియ్యం నీటిని ఫేషియల్ క్లెన్సగా, టోనర్గా ఉపయోగిస్తారు. దీని కోసం బియ్యం నీటిని చిన్న కప్పులో పక్కకు తీసుకోవాలి. అందులో కాటన్ బాల్ ముంచి, ముఖానికి ఈవెన్గా రాసుకోవాలి. కాసేపటికి ఆరిపోయిన తర్వాత కడిగేస్తే సరిపోతుంది.
జుట్టు కోసం :
Rice Water For Hair మీరు తరచూ జుట్టుకు రంగులు వేస్తుంటారు. దీని వల్ల జుట్టు నిర్జీవంగా మారిపోయే అవకాశం ఉంది. ఇలా పాడైన జుట్టును బాగు చేయడానికి బియ్యం నీరు ఎంతగానో, ఉపయోగపడుతుంది. బియ్యం నీటిని జుట్టుకు రాసి,కుదుళ్లలో బాగా మర్దన చేయాలి. మొదళ్ల నుంచి చివరి వరకు రాయాలి. ఆ తర్వాత ఇదంతా జుట్టుకు పట్టేలా 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే,గాలి కాలుష్యం, రంగులు వేయడం వల్ల పాడైనటువంటి జుట్టుకు జీవం లభిస్తుంది. కెమికల్స్ లేని షాంపూని ఉపయోగిస్తే, మరింత ఫలితం లభిస్తుంది.
రిలాక్సింగ్ బాత్ సోక్ :
Rice Water For Skin ఇంట్లోనే Spa feeling ను పొందాలి అని అనుకుంటే, మీ Bath tub వద్ద కొన్ని కొవ్వొత్తులు వెలిగించి, చక్కటి పాటలు పెట్టుకోండి. టబ్ లోని నీటిలో కాస్త మంచి సువాసన వెదజల్లే రోజా పెటల్స్ ని వేసుకోవచ్చు.అందులో కొన్ని బియ్యం నీటిని కూడా పోసి,కొద్దీ సేపు టబ్ వాటార్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఇందులో జింజర్, కొబ్బరి నూనె కొన్ని చుక్కలు కూడా వేసుకోవచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఏ రకమైన చిన్న సమస్య ఉన్నా , వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం.అని గమనించగలరు.