RRB Railway Jobs 2024 : ఇంటర్, డిగ్రీ అర్హతతోనే రైల్వేలో 11,558 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్.

RRB Railway Jobs : నిరుద్యోగులకు గొప్ప శుభవార్త.. ఇంటర్, డిగ్రీ అర్హతతోనే రైల్వేలో 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

RRB Railway Jobs 2024 : నిరుద్యోగులకు రైల్వే శాఖ గొప్ప శుభవార్తను అందించింది. ఇండియా ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైల్వే జోన్లలో 11,558 ఖాళీల భర్తీ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌ కింద Non-technical పాపులర్ కేటగిరీలో గ్రాడ్యుయేట్‌/ అండర్‌ గ్రాడ్యుయేట్‌లకు సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

గ్రాడ్యుయేట్ కేటగిరీలో వచ్చేసి Chief Commercial cum Ticket Supervisor, Station Master, Goods Train Manager, Junior Account Assistant cum Typist, Senior Clerk cum Typist, Commercial cum Ticket Clerk, Account Clerk, Trains Clerk, Junior Clerk cum Typist in undergraduate category పోస్టులను భర్తీ చేయనున్నారు.

RRB Railway Jobs 2024 : గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. 01-01-2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఇందులో ఎంపికైన వారికి నెలకు రూ.29,200 నుండి రూ.35,400 వరకు జీతంగా చెల్లిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి 01-01-2025 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. SC, ST, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

ఇందులో ఎంపికైన వారికి నెలకు శాలరీ రూ.19,900 నుండి రూ.21,700 వరకు చెల్లిస్తారు. ఈ మేరకు RRB సంక్షిప్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది. September 14వ తేదీన పూర్తి వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలకానుంది.

RRB Railway Jobs 2024 : ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ గ్రాడ్యుయేట్‌ స్థాయి పోస్టులకు September 14న ప్రారంభమై.. అక్టోబర్ 13వ తేదీతో ముగుస్తుంది. ఇక Undergraduate స్థాయి పోస్టులకి September 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. October 20వ తేదీతో ముగుస్తుంది. దరఖాస్తు ఫీజు కింద General, EWS, OBC కేటగిరీ అభ్యర్థులకు రూ.500. SC, ST, ESM, EBC, Disabled, మహిళా అభ్యర్థులకు రూ.250 చెల్లించాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (టైర్-1, టైర్-2), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా చివరి ఎంపిక ఉంటుంది.

RRB Railway Jobs 2024 : కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ పోస్టులు: 1,736 స్టేషన్ మాస్టర్ పోస్టులు: 994 గూడ్స్ రైలు మేనేజర్ పోస్టులు: 3,144 జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు: 1,507 సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు: 732
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల వివరాలు
Commercial Cum Ticket Clerk Posts : 2,022
Accounts Clerk Cum Typist Posts : 361
Junior Clerk Cum Typist Posts : 990
Trains Clerk Posts : 72

గ్రాడ్యుయేట్ పోస్టులకు online లో దరఖాస్తులకు ప్రారంభ తేదీ: September 14, 2024.
గ్రాడ్యుయేట్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్‌ 13, 2024.
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు online లో దరఖాస్తుల ప్రారంభ తేదీ: September 21, 2024.
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్‌ 20, 2024.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ చుడండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me