Kitchen Utensils :వర్షాకాలంలో ఇనుప వస్తువులే కాదు- కిచెన్​లోని పాత్రలూ తుప్పు పడతాయి! ఇలా కాపాడుకోండి!

వర్షాకాలంలో ఇనుప వస్తువులే కాదు- కిచెన్​లోని పాత్రలూ తుప్పు పడతాయి! ఇలా కాపాడుకోండి! Kitchen Utensils.

సాధారణంగా వర్షాకాలంలో ఇనుప వస్తువులు తుప్పు పట్టడం సహజం. కానీ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా వంటింట్లోని పాత్రలు కూడా తుప్పు పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వంటింట్లోని గిన్నెలు తుప్పు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.

Kitchen Utensils ప్రతి ఇంట్లో వంటకు అవసరమయ్యే Iron pans, స్టీల్​ పాత్రలు తప్పకుండా ఉంటాయి. ఇవి లేకుండా కిచెన్​లో వంట చేయడం అసాధ్యం. అయితే, వర్షాకాలంలో గాలిలో అధిక తేమ కారణంగా కొన్నిసార్లు ఈ పాత్రలు తుప్పుపడుతుంటాయి. వీటిని చూడకుండా అలానే వదిలిస్తే,కొన్ని రోజులకు గిన్నెలు వంటకు పనికి రాకుండా పోతాయి.అయితే, వర్షాకాలంలో పాత్రలు తుప్పు పట్టకుండా ఉండాలంటే, కొన్ని చిట్కాలు ​ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.

Kitchen Utensils గిన్నెలు తుప్పు పట్టడానికి ప్రధాన కారణం అయితే,తేమ ఎక్కువగా ఉండడమే. ముఖ్యంగా ఐరన్​ పాత్రలు లేదా కడాయిలను వర్షాకాలంలో తడి లేకుండా,పొడి ప్రదేశంలో ఉంచడం చాలా ముఖ్యం. మీరు పాత్రలను ఉపయోగించిన తర్వాత క్లీన్ చేసి, వాటిని పొడి వస్త్రంతో తుడవండి. ఆ తర్వాత వాటిపై నూనెను రాయండి. ఇప్పుడు గిన్నెలను ప్లాస్టిక్​ కవర్లో ప్యాక్​ చేసి పొడిగా ఉండే ప్రదేశంలో స్టోర్​ చేయండి. ఇలా చేస్తే ఎన్ని రోజులైనా సరే,పాత్రలు తుప్పు పట్టకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

కిచెన్​లోని రాక్స్​లో ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులను పెడుతుంటాము కదా..! అవి ఈ వర్షాకాలంలో తుప్పుపట్టకుండా ఉండాలంటే సిలికా జెల్​ ప్యాకెట్లను రాక్స్​లో పెట్టమని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాటిపై ఎలాంటి తుప్పు పట్టదని చెబుతున్నారు.

Kitchen Utensils ఐరన్​ కడాయిలు, దోశ పాన్​లను కొంతమంది ఉపయోగించిన తర్వాత తడిగా ఉండేచోట పెడుతుంటారు. అయితే, ఇలా పెట్టడం వల్ల ఈ వర్షాకాలంలో తుప్పు పడుతుంటాయి. కాబట్టి, వాటిని పొడిగా ఉండే చోట పెట్టండి. అలాగే వీటి అవసరం ఎక్కువగా లేకపోతే,శుభ్రంగా కడిగి,పొడి వస్త్రం తో తుడిచిన తర్వాత ఆ గిన్నెకు ఆయిల్​ రాసి స్టోర్​ చేసుకోవడం మంచిదంటున్నారు.

ఒక్కోసారి మనం ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా పాత్రలు తుప్పు పడుతుంటాయి. అయితే, ఇలాంటప్పుడు ఆ పాత్రలో టేబుల్​స్పూన్​ బేకింగ్​ సోడా, ఒక నిమ్మరసం పిండి స్క్రబ్బర్​తో రుద్దాలి. బాగా రుద్దిన తర్వాత క్లీన్ చేసి, పొడి క్లాత్ తో తుడిచి , ఆయిల్​ రాసి, ప్లాస్టిక్​ కవర్లో ప్యాక్​ చేసి స్టోర్​ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే తుప్పు పోవడంతో పాటు, ఎక్కువ కాలం పాటు మన్నికగా కూడా ఉంటాయంటున్నారు.

వీలైనంత వరకు పాత్రలను శుభ్రం చేసిన తర్వాత తడిగా లేకుండా చూసుకోండి.
వాటిని కడిగిన తర్వాత పొడి వస్త్రంతో తుడిచి స్టాండ్​లో పెట్టుకోండి.
అలాగే చాలా రోజుల నుంచి ఉపయోగించని ఏవైనా పాత్రలు ఇంట్లో ఉంటే, వాటిని వర్షాకాలంలో బయటకు తీసి ఒకసారి చెక్ చేయండి.
ఈ టిప్స్ పాటించడం ద్వారా వర్షాకాలంలో వంట పాత్రలు తుప్పు పట్టకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me

Leave a comment