Ayyappa : శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త…!

శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త…! Ayyappa

లక్షలాది మంది Ayyappa భక్తులకు గుడ్ న్యూస్. స్వామివారిని దర్శించుకోవడానికి శబరిమలకు వెళ్లేటువంటి భక్తులు ఇక నుండి విమానాల్లో కొబ్బరికాయలను తమ వెంటే తీసుకెళ్లే అవకాశం లభించింది. ఈ మేరకు Bureau of Civil Aviation Security అనుమతులను మంజూరు చేయడం జరిగింది.

వచ్చే ఏడాది జనవరి 20వ వరకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత దీన్ని రద్దు చేస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం విమానాల్లో ప్రయాణికులు ఎవ్వరు కూడా తమ వెంట కొబ్బరికాయలను తీసుకెళ్లే వెసలుబాటు లేదు.

Ayyappa మాలధారణ వేసుకున్న భక్తులు తమతో కొబ్బరికాయ మరియు ఇరుముడిని తీసుకెళ్లడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ విధంగా విమానాల్లో ఇరుముడిని తీసుకెళ్లే అవకాశం లేకపోవడం వలన రోడ్డు మరియు రైలు మార్గంలో శబరిమలకు వెలళ్లి రావడం ఆనవాయితీగా వస్తోంది.

అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటోన్న సమస్యలపై కేరళ ప్రభుత్వం,Travancore Devaswam Board అధికారులు పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపారు. వారికి వినతిపత్రాన్ని అందించారు. దీనిపై Bureau of Civil Aviation Security సానుకూలంగా స్పందించింది. తాత్కాలిక సడలింపులను ఇచ్చింది.

ఎక్స్-రే, ఎక్స్‌ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్, ఇతర పరీక్షల తర్వాత మాత్రమే కొబ్బరికాయలను విమానంలో తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. కొబ్బరికాయలకు వేగంగా మండే స్వభావం కలిగి ఉన్న వస్తువుగా పరిగణించడం వల్ల దీన్ని విమానంలో తీసుకెళ్లడానికి అనుమతులు ఉండవు.

ఇందులో ఉండేటువంటి నూనె వలన మంటలు వ్యాప్తి చెందడానికి కారణమౌతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని నిషేధించింది. అదే సమయంలో ఇరుముడిలో నెయ్యితో నింపినటువంటి కొబ్బరికాయ, భక్తులు వివిధ పుణ్యక్షేత్రాల వద్ద మొక్కులు సమర్పించుకోవడానికి సాధారణ టెంకాయలను కూడా తమవెంట తీసుకెళ్తుంటారు. వాటిని విమానంలో తీసుకెళ్లడానికి నిబంధనలు అంగీకరించవు.

అయ్యప్ప స్వామి భక్తుల ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, Bureau of Civil Aviation Security తాత్కాలికంగా ఈ నిబంధనలను సడలించింది. మకరవిళక్కు- పండళం పూజ ముగిసేంత వరకు అంటే వచ్చే ఏడాది January 20వ తేదీ వరకు ఈ సడలింపు అమలులో ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me