ప్రతి రోజూ మొలకలు తినండి.. అందం, ఆరోగ్యం రెండింటిని మీ సొంతం చేసుకోండి..! :Sprouts Health Benefits in Telugu : 2024
Sprouts Health Benefits in Telugu: ప్రతి రోజూ ఉదయం breakfast గా లేదా evening చిరుతిండిగా మొలకలు తినడంని అలవాటు చేసుకోండి. మొలకెత్తిన గింజల్లో పోషకాలు చాలా నిండుగా ఉంటాయి. రోజు క్రమం తప్పకుండా తినడం ద్వారా గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. మొలకెత్తిన గింజల్లో వివిధ రకాల Vitaminలతో పాటు ఐరన్ , రాగి, Magnesium, పొటాషియం వంటి Minerals సమృద్ధిగా ఉంటాయి. ఈ sprouts తినడం ద్వారా శరీరంలో Red blood cells గణనీయంగా పెరుగుతాయి, దీని ద్వారా శరీరమంతా ఆరోగ్యకరమైన blood circulation జరిగి, పోషకాలు, Oxizen సరఫరా పెరుగుతుంది. మొలకలు తినడం ద్వారా కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం.
జీర్ణశక్తి మెరుగవడం కోసం:
Sprouts Health Benefits in Telugu:మొలకెత్తిన ధాన్యాలు జీర్ణక్రియ ప్రయోజనాలకు చాలా ప్రసిద్ది అని చెప్పవచ్చు. ఎందుకంటే వీటిలో ఎక్కువగా పీచు పదార్థంతో పాటు జీవక్రియకు సపోర్ట్ ఇచ్చే Enzymes సమృద్ధిగా ఉంటాయి. మొలకలలో ఉండే fiber కంటెంట్ జీర్ణక్రియను క్రమబద్ధీకరించడానికి, సాధారణ ప్రేగుల యొక్క కదలికలకు తోడ్పడుతుంది. త్వరగా పోషకాల Absorption జరుగుతుంది. దానితో ఎనర్జీ త్వరగా లభిస్తుంది. మొలకలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను నివారించవచ్చు.
రక్త ప్రసరణ ను పెంచుతుంది:
Sprouts Health Benefits in Telugu:Red blood cells ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషించేటువంటి రెండు ముఖ్యమైన ఖనిజాలైన ఐరన్ , రాగి ఈ మొలకల ద్వారా పొందవచ్చు. మొలకలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా, మీ శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య అధికమవుతుంది. మొలకలలో లభించే పోషకాల వలన డామేజ్ అయిన రక్త నాళాలను సరిచేయడంలో కూడా ఇవి సహాయపడతాయి. రక్త ప్రసరణ సమస్యలు ఉన్నవారు ఇంకా గాయాల నుండి కోలుకుంటున్న వారు మొలకలు తినడం చాలా మంచిది.
హృదయానికి మంచిది :
Sprouts Health Benefits in Telugu:మొలకలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటాయి. ఇవి రక్తప్రవాహంలో బాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. రక్త నాళాలలో వాపును నిరోధించే Anti-inflammatory లక్షణాలకు కూడా ఇవి ప్రసిద్ధి చెందాయి. ఈ లక్షణాల కారణంగా, మొలకలు హార్టుకి ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు.
కంటి చూపును మెరుగుపరుస్తుంది:
Sprouts Health Benefits in Telugu:మొలకలు తినడం వలన కంటి చూపును మెరుగుపరుస్తుంది. వీటిలో కీలకమైన విటమిన్లు ఎ , ఇ లతో సహా కంటి ఆరోగ్యానికి సంబందించినటువంటి అవసరమయ్యే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి ప్రమాద కరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కళ్ళను రక్షించడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి.
అందం కోసం:
మొలకలు జుట్టుకు, చర్మానికి సంబంధించి అనేక రకమైనటువంటి ప్రయోజనాలను అందిస్తాయి. ఎందుకంటే స్ప్రౌట్స్ తిన్నపుడు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా పుష్కలమైన పొషకాలను మీ జుట్టుకు, చర్మానికి అందెలా చేస్తాయి . కాబట్టి జుట్టు పెరుగుదలకు, మెరిసే చర్మానికి ఇవి తోడ్పడుతాయి. తలలో రక్తం ప్రవాహం వలన జుట్టు వెంట్రుకల ఫోలికల్స్‌కు పోషకాల సరఫరా జరిగి అవి దృఢంగా గట్టిగా మారతాయి. కాబట్టి జుట్టురాలడం తగ్గుతుంది. మొలకలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని డ్యామేజ్ చేసే Free radicals తో పోరాడడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా కాంతి వంతంగా ఉండటానికి సహాయపడతాయి.
గమనిక :
ఇందులోని అంశాలు కేవలం మీ యొక్క అవగాహన కోసం మాత్రమే. పై సమాచారాన్ని ఆరోగ్య నిపుణుల సలహాల సూచన మేరకు అందించడం జరుగింది. మీకు ఎటువంటి సమస్యలు , సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.