ఆడ పిల్లలు పుట్టిన తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. అధిక వడ్డీ రేటుతో పాటు సుకన్య సమృద్ధి యోజన స్కీం ప్రయోజనాలు : Sukanya Samriddhi Yojana : 2024

ఆడ పిల్లలు పుట్టిన తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. అధిక వడ్డీ రేటుతో పాటు సుకన్య సమృద్ధి యోజన స్కీం ప్రయోజనాలు : Sukanya Samriddhi Yojana : 2024

Sukanya Samriddhi Yojana సుకన్య సమృద్ధి యోజన : కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో ఆడ పిల్లల కోసం కూడా ప్రత్యేకమైన స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది. అదే సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకం కేవలం అడ పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. ఆడ పిల్లలకు ఆర్థిక భద్రతను కల్పించాలనే ఒక లక్ష్యంతో సెంట్రల్ గవెర్నమెంట్ ఈ స్కీం ని తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

సుకన్య సమృద్ధి యోజన పథకం వివరాలు:

పథకం పేరు : సుకన్య సమృద్ధి యోజన
ఆవిష్కరణ : కేంద్ర ప్రభుత్వం
లబ్ధిదారులు : ఆడ పిల్లలు
లక్ష్యం : అమ్మాయిలకు ఆర్థిక భద్రత
ప్రయోజనం : ఇతర స్కీమ్స్ కన్నా అధిక వడ్డీ రేటు

స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది..?

Sukanya Samriddhi Yojana : సెంట్రల్ గవెర్నమెంట్ అందిస్తున్న ఈ స్కీమ్ కేవలం ఆడ పిల్లలకు మాత్రమే వర్తించబడుతుంది. అది కూడా పది సంవత్సరాల లోపు వయసు ఉన్న వారు మాత్రమే ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులు. అందువల్ల మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే, వెంటనే ఈ స్కీమ్‌లో చేర్పించేయండి . ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు ఈ స్కీమ్ కింద చేరొచ్చు.

పథకంలో ఎలా చేరాలి…?


కేంద్రం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరాలని భావించే వారు దగ్గరిలోని బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లితే సరిపోతుంది. అక్కడ సులభంగానే ఈ స్కీమ్‌లో చేరిపోవచ్చు. అయితే ఈ పథకం లో చేరాలని అనుకునే వారు మాత్రం కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాల్సి ఉంటుంది.

ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి:

Sukanya Samriddhi Yojana : సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో చేరాలని అనుకునే వారు కొన్ని ధ్రువ పత్రాలను అందుబాటులో ఉంచుకొని , పోస్టాఫీస్‌లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

  • బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్
  • పాన్ కార్డు
  • ఆధార్ కార్డు
  • పాప ఫోటోలు
  • పాప ఆధార్ కార్డు
  • పాప బర్త్ సర్టిఫికెట్

ఎంత డబ్బులు కట్టాలి?

Sukanya Samriddhi Yojana : సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఒక విషయం గమనించాలి. ఒక financial సంవత్సరంలో ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ.1.5 Lakhs వరకు Deposit చేసుకోవచ్చు. అంటే నెలకు రూ.12,500 వరకు Deposit చేయొచ్చు. ఇకపోతే మీరు ప్రతి నెల నెలా ఎంత డబ్బులు Invest చేస్తారనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎంతైనా చేసుకోవచ్చు. కేవలం రూ.250తో సుకన్య అకౌంట్ తెరవొచ్చు. ఉదాహరణకు మీరు నెలకు రూ. ఐదు వేలు ఇన్వెస్ట్ చేస్తే Maturity సమయంలో రూ.25 Lakhs కు పైగా వస్తాయి.

ఎన్నేళ్లు డబ్బులు కట్టాలి…?

సుకన్య సమృద్ధి యోజన స్కీం కి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 15 సంవత్సరాల పాటు డబ్బులు పెట్టుబడిని పెడుతూనే ఉండాలి . తర్వాత డబ్బులు కట్టాల్సిన పని లేదు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ Maturity కాలం 21 సంవత్సరాలు . అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొంత డబ్బులు Withdraw చేసుకోవచ్చు. 21 సంవత్సరాల తర్వాత పూర్తి డబ్బులను పొందవచ్చు.

వడ్డీ రేటు ఇలా:

సుకన్య సమృద్ధి యోజన పథకంపై Present 7.6% వడ్డీ రేటు లభిస్తోంది. ఈ వడ్డీ రేటు ఎప్పటికీ ఒకేలా ఉండదు. ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను Reviewing ఉంటుంది. అందువల్ల వడ్డీ రేట్లు పెరగొచ్చు. లేదంటే తగ్గొచ్చు. కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు నిలకడగా కూడా కొనసాగుతూ ఉండవచ్చు.

పన్ను మినహాయింపు ప్రయోజనం :

ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీం లో డబ్బులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా మనం పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80c కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. అందువల్ల ఉద్యోగం చేసే వారికి ఈ స్కీమ్ చాలా అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me