Telangana Family Digital Card : అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.! దరఖాస్తు చేసుకోవడానికి ఈ 4 పత్రాలు జతచేయాలి..!

Telangana Family Digital Card : అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.! దరఖాస్తు చేసుకోవడానికి ఈ 4 పత్రాలు జతచేయాలి..!

TG ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబం వివిధ పథకాల కింద వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతోంది. అయితే ఆ వివరాలన్నీ ఒకే చోట ఉండవు. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక ముఖ్య ఉధ్యేశంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డును CM Revanth Reddy గారు జారీ చేయడంను నిర్ణయించారు. ఈ కార్డును జారీ చేయడం ద్వారా,ముప్పై ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే చోట యాక్సెస్ చేయవచ్చు. దీనికి అర్హులైన వారికి త్వరలో సంక్షేమ ఫలాలు అందే అవకాశం ఉంది.

Telangana Family Digital Card తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును రూపొందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలనే, సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభము జరిగింది. ఈ కార్యక్రమంలో CM Revanth Reddy ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అప్లికేషన్‌ను ప్రారంభించారు.ఒకే రాష్ట్రం-ఒకే కార్డు అనే కాన్సెప్ట్‌తో చేపట్టిన బహుళ ప్రయోజన కార్డుల జారీ ప్రక్రియను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని రేవంత్ గారు పిలుపునిచ్చారు.

రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ, రైతు భీమా, రైతు భరోసా, షాదీముబారక్, కళ్యాణలక్ష్మి, ఆసర పింఛన్ల వంటి తదితర ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ముప్పై శాఖలు ముప్పై రకాలుగా సమాచారాన్ని సేకరిస్తున్నాయని CM Revanth తెలిపారు. అంతే కాకుండా అర్హులైన వారందరూ ఈ ఒకే ఒక కార్డు ద్వారా ఈ సేవలను పొందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డును అందజేస్తామని, ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని CM గారు కోరారు. కుటుంబ డిజిటల్ కార్డ్‌లో అవసరమైన మార్పులు ఎప్పుడైనా చేయవచ్చు. కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒకే click తో పొందాలనే ఆలోచనతో ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఒక్కసారి కార్డు వస్తే ఎక్కడి నుంచి అయినా సరే, రేషన్, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు కూడా పొందవచ్చని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.

Telangana Family Digital Card అప్లికేషన్ 3 భాగాలుగా విభజించబడింది. మొదటి భాగంలో కుటుంబ పెద్ద లేదా యజమాని వివరాలను నమోదు చేయాలి. అభ్యర్థి పేరు, ఫోన్ నంబర్, రేషన్ కార్డు రకం, పుట్టిన తేదీ, వార్షిక ఆదాయం, విద్యార్హత, కులం, వృత్తి తదితర వివరాలను పేర్కొనాలి. రెండవ భాగంలో అభ్యర్థి చిరునామాను పేర్కొనాలి.

మూడో భాగంలో కుటుంబ సభ్యుల వివరాలను పొందుపరచాలి. దరఖాస్తుదారుడికి అవ్వాల్సిన అనుబంధం,పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ వంటి ఇతర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ మరియు Date of Birth ని ఎంటర్ చేసేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోని,నమోదు చేయాలి. ఎందుకంటే, ఎటువంటి పొరపాటు జరిగినా ఆ కుటుంబంలోని సభ్యులకు సంక్షేమ పథకాలు అందకపోవచ్చు.కాబట్టి ఆధార్ నంబర్ మరియు Date of Birth వివరాలను సరిగ్గా నమోదు చేయాలి. అప్లికేషన్‌లో ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అతికించాలి. చివరగా దరఖాస్తుదారుని యొక్క తన సంతకాన్ని పెట్టాలి.

  1. కుటుంబ పెద్ద యొక్క ఆధార్ కార్డ్
  2. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు
  3. సమూహ ఫోటో
  4. జనన ధృవీకరణ పత్రాలు సమర్పించాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me