Tella Galijeru Uses in Telugu :తెల్ల గలిజేరు యొక్క బెనిఫిట్స్ తెలిస్తే,అది ఎక్కడ కనిపించినా సరే,వదిలిపెట్టరు.! Punarnava.
Punarnava ఖాళీ ప్రదేశాలు, పల్లె ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరుగుతుంటాయి. వాటిల్లో తెల్లగలిజేరు ఆకు కూర కూడా ఒకటి . ఈ మొక్కలను చూసి మనందరం పిచ్చిమొక్కగానే అనుకుంటాం. కానీ వాస్తవానికి ఈ మొక్కల్లో ఉన్న ఔషధగుణాల గురించి తెలిస్తే, మాత్రం ఆ మొక్క ఎక్కడ ఉందా.? అని వెతుకుంటూ వెళ్లి మరి ఇంటికి తెచ్చుకుంటారు.
Tella Galijeru Uses in Telugu : తెల్ల గలిజేరు మొక్కని ఔషధాల ఘని అని, ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో ఈ మొక్కను పునర్నవ అని పిలుస్తారు. మన భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో ఈ గలిజేరు మొక్కను చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు. ఇది ఎన్నో రకాల జబ్బులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ గలిజేరులో రెండు రకాలుఉంటాయి. తెల్లపూలు ఉంటే, తెల్ల గలిజేరు అని,ఎర్రపూలు ఉంటే ఎర్ర గలిజేరు అని పిలుస్తారు. నేలమీద పాకే ఈ మొక్కకు ఆకులు గుండ్రంగా, అర్థ రూపాయంత ఉంటాయి. ఔషధ గుణాలను ఈ రెండు మొక్కలకు ఒకటేలా ఉన్నా, వీటిలో తెల్ల గలిజేరు మాత్రమే ఉత్తమమని అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే,ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవితం చేయగలదు కాబట్టే దీన్ని ‘పునర్నవ’ అంటారు.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది. దీనిలోని విటమిన్ C, D మూత్రనాళల ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కిడ్నీ సమస్యలకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. తెల్లగలిజేరు ఆకులు పిడికెడు తీసుకొని, శుభ్రపరిచి 1/4 లీటర్ మంచినీటిలో వేసి,బాగా మరగించాలి.తర్వాత చల్లార్చి వడపోసి, రోజు ఉదయం పరగడుపున ఒక గ్లాసు తీసుకున్నట్లయితే కిడ్నీలు శుద్ధితో పాటు, మూత్ర నాళల సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి.
ఇలా ఇరవై ఒక్క రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే , మంచి ఫలితం ఉంటుందిన నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు,ఇది తీసుకున్న తరువాత అరగంట ఏమీ తీసుకోకూడదు.
Tella Galijeru Uses in Telugu : ఈ తెల్లగలిజేరు ఆకు, కాండం, వేరుతో సహా ఔషధగుణాలు నిండివుంది. ఈ ఆకులను తరచూ కూరలాగా చేసుకొని తినడాం వల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫం వంటి సమస్యలను నయం చేస్తుంది. లివర్ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, వాతం, శ్వాస సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తుంది. రక్త శుద్ధి, కీళ్ళ నొప్పులు, బహిష్టు సమస్యలు, అన్ని రకాల జ్వరాలను తగ్గించటంలో ఇది అద్భుతంగా పని చేస్తుంది.
Tella Galijeru Uses in Telugu : ఈ తెల్లగలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. ఈ గలిజేరు మొక్కను నూరి దీని రసం తీసి, దానికి సమానం గా నువ్వుల నూనె ని కలిపి,కేవలం నూనె మాత్రమే,మిగిలేదాకా సన్నని సెగ మీద కాచి, చల్లార్చిన తర్వాత దానిని వాతం నొప్పులున్న చోట, కీళ్ల నెప్పులకు మర్దనా చేస్తే , సులువుగా ఆ నొప్పులన్నీ తగ్గుతాయి. శరీరాన్ని డిటాక్స్‌ఫై చేయటానికి ఇది అద్భుతం గా ఉపయోగపడుతుంది .
పునర్నవ మూత్ర ఇన్ఫెక్షన్ సమస్యను నయం చేయడంలోమంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మూత్ర నాళాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
గమనిక : ఈ సమాచారాన్ని అంతర్జాలం నుంచి మరియు నిపుణుల సలహా మేరకు అందించడం జరిగింది. ఇది కేవలం మీ యొక్క అవగాహన కోసం మాత్రమే. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యుల సలహా తీసుకోవడమే ఉత్తమమైన మార్గం అని గమనించగలరు.