Norovirus :హైదరాబాద్ లో కొత్త వైరస్ మహమ్మారి……వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే… !2024

Norovirus :హైదరాబాద్ లో కొత్త వైరస్ మహమ్మారి……వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే… !

Norovirus : హైదరాబాద్ ప్రజలను వణికిస్తున్న మరో కొత్త నొరో వైరస్ . అతి వేగవంతంగా వ్యాపించే నొరో వైరస్.. హైదరాబాద్ నగర స్థానికులను భయపెడుతోంది. తొందరగా వ్యాపిస్తూ.. కలవరం సృష్టిస్తోంది. రోజుల వ్యవధిలోనే 100 ల సంఖ్యలో కేసులు నమోదవటం ఇప్పుడు నగర స్థానికులను ఆందోళనను కలిగిస్తోందీ. ఈ నేపథ్యంలో.. GHMC అధికారులు అప్రమత్తమై.. నగర స్థానికులకు కీలక సూచనలని తెలియజేస్తున్నారు . ఇది అంటువ్యాధి కావటంతో.. వేగంగా వ్యాపిస్తోందని.. పలు జాగ్రత్తలు తీసుకుంటే నివారించొచ్చని చెప్తున్నారు.

Norovirus లక్షణాలు: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోకముందే ప్రజలను మరో కొత్త వైరస్ భయపెడుతోంది.అతి వేగంగా వ్యాపించే నొరో వైరస్.. ఇప్పుడు హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వటమే కాకుండా అతి వేగంగా విజృంభిస్తుంది. ఈ వైరస్ కారణంగా.. కేవలం పాతబస్తీ ప్రాంతంలోనే రోజుకు 100 నుంచి 120 కేసులు నమోదవుతున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వెల్లడించింది. ఈ నొరో వైరస్ విషయంలో ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. నొరో వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు చేసింది.

అసలే వార్షాకాలం కావటం.. ఎడతెరపి లేకుండా కురిసే వర్షాలతో పరిసరాలన్ని దుర్గంధంగా మారటంతో.. రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలోనే.. పలు కొత్త వైరస్‌లు పుట్టుకొస్తుండగా.. ఇప్పుడు ఈ నొరో వైరస్ అందరినీ భయపెడుతోంది. నొరో వైరస్ సోకడానికి.. కలుషితమైన వాటర్ దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. కలుషిత వాటర్ తో పాటు నాణ్యతలేని ఆహారం కూడా ఈ వ్యాధికి కారకంగా డాక్టర్లు చెప్తున్నారు. ఈ వైరస్ సోకినవారికి లక్షణాలు ..వాంతులు, చలి జ్వరం, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ వంటి మొదలైన లక్షణాలు ఉంటాయని GHMC చెప్తోంది. ఇదొక రకమైన అంటువ్యాధి కావటంతో.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.

జీహెచ్ఎంసీ సూచనలు


ప్రజలంతా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని.. కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఇంటిని పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలని సూచించింది. కాగా.. ప్రస్తుతం ఈ నొరో వైరస్ కేసులు హైదరాబాద్‌లోని యాకత్ పురా, మలక్ పేట్, డబీర్ పురా, పురానీ హవేలీ, మొఘల్ పురాతో పాటు పలు ప్రాంతాల్లో ఎక్కువగా నమోదు అవుతున్నట్టు తెలుస్తోంది ఈ వైరస్ బారిన పడిన వారు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.

గత వారం రోజుల పరిధిలో.. పాతబస్తీ ప్రాంతంలోనే 100ల సంఖ్యలో నొరో వైరస్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఇది అంటువ్యాధి కావటంతో.. ఒకరి నుంచి మరొకరికి తొందరగా వ్యాపిస్తున్నట్టు సమాచారం. ఈ వైరస్‌ను “వింటర్ వామిటింగ్ బగ్” అని కూడా పిలుస్తారు. వానాకాలంలోనే ఈ వైరస్ సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. ప్రధానంగా అపరిశుభ్రత వల్లే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Norovirus సోకిన వారిలో కనిపించే లక్షణాలు..


నొరో వైరస్ సోకిన వారికి వాంతులు, విరేచనాలతో పాటు శరీరం డీహైడ్రేషన్ అవుతుంటుంది. వైరస్ సోకిన వ్యక్తిలో 48 గంటల్లోనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల.. మధ్య వయస్కులు, వృద్ధులు, గర్భిణులు, కౌమారదశలో ఉన్న బాలికల్లో తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్స్‌ను కలిగిస్తోందని వైద్యులు చెప్తున్నారు. శరీరం వేగంగా డీహైడ్రేషన్కి లోనవ్వడంతో అవ్వడంతో.. మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. డైయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఎక్కువుగా ఈ వైరస్ బారినపడే అవకాశాలు ఉన్నాయి.

ఇది ఒక అంటువ్యాధి కావటంతో ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారికి లేదా కలుషితమైన పరిసరాల్లో ఉన్న వారికి ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుంది. అయితే.. ఈ వైరస్ సోకిన వారిలో చాలా మంది 2,3 రోజుల్లోనే కోలుకుంటారని వైద్యులు చెప్తున్నారు. ఈ వైరస్ కోసం ప్రస్తుతానికి ఎలాంటి టీకా అందుబాటులో లేదు. వైద్యులు సూచించిన మందులు వాడటంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా 2 నుంచి 3 రోజుల్లో వైరస్ నుంచి కోలుకోవచ్చు.

Norovirus సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు


నొరో వైరస్ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు . ఇది అంటువ్యాధి కావటంతో.. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. వేడి నీళ్లను తాగటం మంచిది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వేడి వేడి ఆహారాన్ని, శుభ్రమైన ఆహార పదర్థాలను తీసుకోవాలి. వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించిన బట్టలను వేడి నీటితో శుభ్రం చేయాలి. వైరస్ సోకిన వ్యక్తికి తగ్గేవరకు దూరంగా ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
Scroll to Top