Tirupathi Balaji : తిరుమలలో వరాహస్వామినే ముందుగా ఎందుకు దర్శించుకోవాలి…? 2024 & SLOTTED SARVA DARSHAN (SSD) Tokens ఇచ్చు ప్రదేశాలు :

Tirupathi Balaji : తిరుమలలో వరాహస్వామినే ముందుగా ఎందుకు దర్శించుకోవాలి…? 2024 & SLOTTED SARVA DARSHAN (SSD) Tokens ఇచ్చు ప్రదేశాలు :

కలియుగ ప్రారంభంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకు అశ్రయమిచ్చారని పురాణ కథనం. అందుకు ప్రతిగా తిరుమలను సందర్శించే భక్తులు తొలుత వరాహస్వామిని దర్శించాకే తనను దర్శిస్తారని వరమిచ్చారట.

Tirupathi Balaji : హిరణాక్షుడిని చంపి భూదేవిని రక్షించి పని పూర్తయిన తర్వాత వరాహస్వామి భూమిమీద సంచరించిన ప్రదేశమే నేటి తిరుమలకొండ. తిరుమల క్షేత్రం మొదటగా వరాహ క్షేత్రం గా ప్రసిద్ధి చెందినది.అయితే తిరుమలకొండ పైన ఉండేందుకు, వేంకటేశ్వరస్వామి వారికి అనుమతిని ఇచ్చినది వరాహస్వామియే.

వరాహస్వామి భూమిమీద సంచరించేటప్పుడు వృషభాసుడనే రాక్షసుడు తటస్థపడేసరికి వాడ్ని చంపి ఆకొండమీదే నివాసస్థలం ఏర్పరచుకొని వుండేవాడట, కొంత కాలానికి అక్కడికి శ్రీనివాసుడు వస్తాడు . శ్రీనివాసుడే శ్రీ మహావిష్ణువని గ్రహిస్తాడు ఆదివరాహస్వామి . వరాహస్వామి రూపములో ఉన్నది కూడా ఆ శ్రీ మహావిష్ణువే అని శ్రీనివాసుడు తెలుసుకుంటాడు . మహావిష్ణువే రెండు రూపాలను ధరించి ముచ్చటించుకుంటుంటే , అది చుసిన ముక్కోటి దేవతలు మురిసిపోయారట.

Tirupathi Balaji :నాకు ఈ ప్రదేశం లో కలియుగాంతము వరకు నివసించాలన్న సంకల్పము కలిగింది . ఇక్కడ నాకు కొంత స్థలము ప్రసాదించమని శ్రీనివాసుడు కోరగా, అప్పుడు ఆయన (వరాహస్వామి) మూల్యము చెల్లిస్తే స్థలమిస్తానని, శ్రీనివాసుడితో అంటారు . అప్పుడు శ్రీనివాసుడు ” నా దగ్గర ధనం లేదు ,కాబట్టి అందుకు ప్రతిగా మీరిచ్చే స్థలానికి, దర్శనానికి వచ్చే భక్తుల ప్రధమ దర్శనము మరియు ప్రధమ నైవేద్యము కూడా మీకె జరిగేటట్లు చేస్తానని ” చెబుతాడు .అప్పుడు ఆ ఒప్పందానికి ఆదివరాహస్వామి అంగీకరిస్తారు. అప్పుడు శ్రీనివాసుడికి 100 అడుగులు స్థలాన్ని ఇచ్చినట్లు పురాణాలు చెప్పబడుతున్నాయి .

Tirupathi Balaji : శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవతరించి , . శ్రీనివాసునికి స్థలాన్ని ఇచ్చి ప్రస్తుత భక్తులు కొలుస్తున్న తిరుమల కొండ క్షేత్రానికి మూల కారణ మైనాడు . రెండు అవతారాలతో , రెండు మూర్తులతో భక్తుల కోరికల్ని తీరుస్తున్న శ్రీ మహావిష్ణువు అవతార రహస్యాలలో ఈ ఇద్దరి అవతారాలకు ఎంతో ప్రాముఖ్యము ఉన్నది .

SLOTTED SARVA DARSHAN (SSD) Tokens:-

తిరుపతిలో ఉదయం 2 గంటల నుంచి ఉచిత దర్శనం టోకెన్లు ఇస్తారు.

ఇచ్చు ప్రదేశాలు :


🔔 శ్రీనివాసం – RTC బస్టాండ్ దగ్గర తిరుపతి

🔔 విష్ణు నివాసం -రైల్వే స్టేషన్ ఎదురుగా తిరుపతి

🔔 భూదేవి కాంప్లెక్స్ – అలిపిరి దగ్గర తిరుపతి

శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్లే భక్తులకు ఉదయం 5.30 / 6.00 నుండి ఆ నడకదారిలో ఇస్తారు.

Note: No Tokens Given on Alipri Steps

SSD – TIRUPATI – OPENING COUNT
STARTS FROM 2 AM – SRINIVASAM + VISHNUNIVASAM + BHUDEVI COMPLEX

DD – SRIVARI METTU – OPENING COUNT
STARTS FROM 5.30 / 6 AM ON 50TH STEP
TICKET SCANNING COMPULOSRY ON 1250 STEP

Note: Bring Original Aadhar card or printout with clearly identifiable photo. Soft copy in mobile Not allowed.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
Scroll to Top