వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం – Vemulawada

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి, ఇది తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అనే పట్టణంలో గల ప్రసిద్ద హిందూ దేవాలయం. ఈ ఆలయ నిర్మాణం చాలా పురాతనకాలంలో జరిగింది అలాగే ఇక్కడ శివుడిని ప్రత్యేక పూజలతో కొలుస్తారు. ఈ ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించుకోవడనికి దేశం నలుమూలల నుండి ప్రతి ఏటా చాలా మంది భక్తులు దర్శించుకుంటారు, వారి వారి మొక్కులు తీర్చుకుంటారు. Vemulawada Pincode – 505302

vemulawada

Vemulawada Temple – ఆలయ చరిత్ర మరియు ప్రాముఖ్యత

ఈ వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని చాళుక్య వంశ పాలకులచేత 8 వ శతాబ్దంలో నిర్మించబడింది తరువాత కాకతీయ రాజవంశ పాలకులు 12 వ శతాబ్దంలో కాకతీయ పాలకుడైనటువంటి రుద్ర దేవుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించి మరియు పునరుద్ధరించబడింది అలాగే ఈ కాకతీయ వంశ పాలకులు ఆలయం యొక్క కళకు మరియు వాస్తుశిల్పానికి గణనీయమైన కృషి చేయడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే ఉంది తాజాగా 2017 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయలను ఆలయ పునరుద్ధరణ కోసం కేటాయించింది.

Vemulawada Temple History in Telugu

ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యతని గురించి చెప్పుకున్నట్లయితే ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన దేవాలయాలలో ఒకటిగా మరియు 108 జ్యోతిర్లింగాలలో ( శివుని భక్తి ప్రాతినిథ్యాలు ) ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ప్రసిద్ధ ఆలయంలో అమ్మవారికి అనగా రాజరాజేశ్వరి దేవికి ప్రత్యేక పూజతో పాటు బంగారు బోనం సమర్పించే సంప్రదాయం కూడా ఉంది ఈ పూజ లో బంగారం బెల్లంతో పాటు ఇతర నైవేద్యాలతో నిండిన కుండను అమ్మవారికి సమర్పిస్తారు అలాగే ఆ బోనాన్ని ఆలయం చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్తారు.

ఈ వేములవాడ యొక్క ఆలయ నిర్మాణం చాళుక్య, కాకతీయ శైలుల సమ్మేయనంగా చెప్పుకోవచ్చు ఈ ఆలయం యొక్క ప్రధాన ద్వారాన్ని మహా ద్వారం అని పిలుస్తారు అలాగే వివిధ దేవతలు దేవుళ్ళ యొక్క క్లిష్టమైన చెక్కడాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం యొక్క ప్రధాన మందిరంలో శివుని యొక్క విగ్రహం ఉన్నది దీనిని శ్రీరాజరాజేశ్వరస్వామి స్వయంగా ప్రతిష్టించాడని నమ్ముతారు ఈ విగ్రహం విలువైన అందమైన ఆభరణాలతో అలంకరించబడి ఉంది, ఈ ఆలయం సముదాయంలో విగ్నేశ్వరుడు , సుబ్రహ్మణ్యుడు అలాగే రాజరాజేశ్వరి దేవతలతో అనేక ఇతర దేవుళ్ళ యొక్క దేవాలయాలు కూడా ఉన్నాయి.

ఈ ఆలయం ముఖ్యంగా శివరాత్రి , వినాయక చవితి, దసరా వంటి పండగలకు ప్రసిద్ధి చెందింది, ఈ పండగల సందర్బంగా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయం హిందువులకు ఎంతో ముఖ్యమైన మరియు పవిత్రమైన దేవాలయం దీని ప్రత్యేక సంప్రదాయాలు , గొప్ప చరిత్ర ఉండడం వలన దేశం నలుమూలల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో వస్తారు.

Vemulawada Temple Timings

మంగళ వైద్యంఉదయం 4:00 నుండి 4:10 వరకు
సుప్రభాత సేవఉదయం 4:10 నుండి 4:30 వరకు
ప్రభాత హారతిఉదయం 4:35
ఆలయ శుద్ధిఉదయం 4:35 నుండి 05 వరకు
గోమాత పూజ & కోడె పూజఉదయం 05:00 నుండి 05:15 వరకు
ప్రాతఃకాల పూజఉదయం 5:15 నుండి 6:15 వరకు
నిత్య కళ్యాణంఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు
మధ్యన్హిక పూజ & నివేదన & అన్న పూజఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:10వరకు

Note: మరిన్ని నిర్ణీత ఖచ్చితమైన సమయాల గురించి official website అయిన https://www.vemulawadatemple.org/ సందర్శించండి.

Vemulawada Distance – వేములవాడ ఎలా చేరుకోవాలి ?

వేములవాడ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవాలంటే వివిధ మార్గాల ద్వారా చేరుకొని దర్శించుకోవచ్చు, ఇక్కడికి చేరుకోవడానికి దేశ నలుమూలల నుండి మార్గాలు అయితే ఉన్నాయి.

  1. రోడ్డు మార్గం

వేములవాడ చేరుకోవడానికి సులభమైన మార్గం రోడ్డు మార్గం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యొక్క బస్సులు కరీంనగర్ , హైదరాబాద్, సిద్దిపేట , జగిత్యాల , నిజామాబాదు, కామారెడ్డి, వరంగల్ నుండి అలాగే అన్ని ముఖ్య నగరాలు మరియు పట్టణాల నుండి కూడా వేములవాడ పుణ్యక్షేత్రానికి బస్సులు అందుబాటులో ఉంటాయి.

Hyderabad to vemulawada distance

హైదరాబాద్ నుండి వేములవాడ కి ఎక్కువ మొత్తంలో బస్సులు అందుబాటులో ఉంటాయి, హైదరాబాద్ నుండి వేములవాడ చేరుకోవాలంటే దాదాపుగా 150 kms దూరాన్ని మూడున్నర గంటల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. ( ఈ ప్రయాణం కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ లేదా కొన్ని సమస్యల వాళ్ళ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు ).

JBS to Vemulawada Bus Timings

JBS నుండి కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎక్కువ మొత్తంలో బస్సులు అందుబాటులో ఉంటాయి, ఇక్కడ నుండి కొన్ని ప్రధాన పట్టణాలకు అనుసంధానం చేసుతూ TSRTC బస్సులను నడుపుతుంది.

2.రైలు మార్గం

hyderabad to vemulawada distance చూసినట్లయితే వేములవాడ కి సమీప రైల్వే స్టేషన్లు కామారెడ్డి మరియు కరీంనగర్ ఉంటాయి. వీటి యొక్క దూరం చూసినట్లయితే కామారెడ్డి నుండి 67. కోలోమీటటర్లు అలాగే కరీంనగర్ నుండి 33.8 కోలోమీటర్ల దూరంలో ఉంది.

3. గాలి మార్గం

వేములవాడ కి సమీప విమానాశ్రయం అంటే హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ airport రాజన్న సిరిసిల్ల జిల్లాలో విమానశ్యం లేదు. హైదరాబాద్ విమానాశ్రయం నుండి వేములవాడకు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

Vemulawada Devasthanam Room Booking Online

vemulawada rooms – వేములవాడ దర్శనానికి వచ్చేవారు రూమ్స్ ని కూడా బుక్ చేసుకోవచ్చు, బుకింగ్ యొక్క పూర్తి సమాచారం కోసం Official వెబ్సైటు అయినటువంటి https://www.vemulawadatemple.org/ సందర్శించవచ్చు.

Read More Artcles

Conclusion

వేములవాడ పుణ్యక్షేత్రం పురాతన కలం నుండి ఎంతో ప్రఖ్యాతి గాంచిన దేవాలయం, ఈ దేవాలయానికి విచ్చేసి పూజలు చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం, ఈ పుణ్యక్షేత్రం ఎప్పుడు భక్తులతో సందడిగా ఉంటుంది, గుండంలో స్నానాలు , ప్రత్యక పూజలు, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, కాకతీయుల కాలం నుండి ఈ పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి గాంచింది, ఈ దేవాలయానికి చేరుకోవడానికి భక్తులు వివిధ రకాల మార్గాలను ఎంచుకుంటారు , బస్సులలో , కార్లలో , మోటార్ సైకిల్ లపై మరియు కాలినడకన కూడా కొందరు భక్తులు చేరుకొని వారి మొక్కులు తీర్చుకుంటారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me