ప్రకృతి ఒడిలో దొరికే సీజనల్ ఫ్రూట్ సీతాఫలం. పోషక విలువలు సమృద్ధిగా ఉండి ఒక్క పండు తిన్న వెంటనే శరీరానికితక్షణ శక్తి లభిస్తుంది.
ఇంకా ఇందులోని ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్రీషియం అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలుచేస్తుంది. సీతాఫలంతో కలిగే మరిన్ని లాభాలుః – రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుతుంది.
సీతాఫలం రోజు తినడం వల్ల విటమిన్ సి శరీరానికి సమృద్ధిగా లభిస్తుంది. రక్తంలోని ఇన్సులిన్ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలని దూరం చేస్తాయి. – శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. చలువ చేస్తాయి.
ఒక సీతాఫలంలోనే వెయ్యి మిల్లీ గ్రాముల కాపర్ లభిస్తుంది. ఇంకా దీనిలో లభించే డయిటరీ పీచు జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చూస్తుంది.