ఈ పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎక్కడ కనబడ్డా వదలరు Mulberry Fruits
మల్బరీలు చూడటానికి బ్లాక్‌బెర్రీస్ మాదిరిగా కనిపిస్తాయి. ఇవి రుచిలో ద్రాక్షపండులా ఉంటాయి
ఈ పండ్లలో బ్లాక్, రెడ్, వైట్ మల్బరీస్ ఉంటాయి. దీనిలో పోషకాలూ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
వీటిలో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, , సోడియం, జింక్ , విటమిన్ సి, ఇ, కె, B1, B2, B3, B6, ఫోలెట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి
మల్బరీ పండ్లలో జీర్ణక్రియకు మేలు చేసే డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను సులభతరం చేస్తుంది.
మల్బరీ పండ్లలో క్యాన్సర్ కణాలను నిర్మూలించే.. ఆంథోసైనిన్‌లు ఉంటాయి. వీటిలో రెస్వెరాట్రాల్ కూడా ఉంటాయి. వీటికి క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి.
మల్బరీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తనాళాలను విస్తరించి, వాటి పనితీరును మెరుగుపరుస్తాయి.
మల్బరీలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
మల్బరీలు మాక్రోఫేజ్‌లలో ఉండే ఆల్కలాయిడ్‌లను వాటిని సక్రియం చేయడానికి ఉపయోగిస్తాయి, ఇది మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
షుగర్ పేషెంట్స్ వైట్ మల్బరీస్ తింటే.. మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వైట్ మల్బరీలో ఉండే కొన్ని సమ్మేళనాలు.. టైప్-2 డయాబెటిస్‌కు మెడిసిన్‌లా పనిచేస్తాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండ్లని తీసుకునేముందు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం