Orange Fruit in Telugu : బత్తాయి అలానే తింటే మంచిదా లేదా జ్యూస్ రూపం లో తీసుకుంటే మంచిదా ?

Orange Fruit in Telugu : బత్తాయి అలానే తింటే మంచిదా లేదా జ్యూస్ రూపం లో తీసుకుంటే మంచిదా ?

Orange Fruit in Telugu : బత్తాయి పండ్లలో అధిక మోతాదులో ఫైబర్, విటమిన్లు, పొటాషియం ఉంటాయి. ఇవి మనకు ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. బత్తాయి పండ్లలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడం లో తోడ్పడుతుంది.నారింజ(Orange) ఒక సిట్రస్ పండు అంటే విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. సౌందర్య ప్రయోజనాలను పెంపొందించే ఖనిజాలను కలిగి ఉంటాయి. ఆరెంజ్, ఆరెంజ్ జ్యూస్ , ఆరెంజ్ తొక్కలు ఇలా అనేక రకమైన ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగించవచ్చు. ఆరెంజ్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. నారింజ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కూడా మంచిగా పని చేస్తాయి.

శరీరంలో ఐరన్ శాతం పెంచడం ద్వారా రక్తహీనతను నివారించడంలో ఆరెంజ్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.కనిజాలాల పెరుగుదల, అభివృద్ధి కోసం ఈ పోషకం అవసరం అవుతుంది. ఇది కొల్లాజెన్ శాతం ఏర్పడటానికి ఐరెన్ను ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు మెరుగు బాగు చేస్తుంది.ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, IPS ( ప్రేగు సిండ్రోమ్) సమండిచిన వ్యాధి , మధుమేహం, ఊబకాయం , గుండె జబ్బుల అభివృద్ధిని నిరోధించడం లో దోహద పడుతుంది.

Orange Fruit in Telugu ఫోలేట్ కూడా ఆరంజ్లో ఎక్కువగా శాతం ఉంటుంది. ఫోలేట్ అనేది ఎముక మజ్జలో DNA, RNA, WBC, RBCలను ఉత్పత్తి చేసే విటమిన్ B సమ్మేళనం, కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చడంలో ఉపయోగపడుతుంది. ఫోలేట్ లోపం ఉంటే అలసట, కండరాల బలహీనత, నోటి పూతల, దృష్టి సమస్యలు, జ్ఞాపకశక్తి , అభిజ్ఞా సమస్యలు , నిరాశ , గందరగోళం వంటి ఇతర లక్షణాలకు వచ్చేలా చేస్తయి.ఫోలేట్, విటమిన్ C, ఫైబర్తో పాటు, ఆరంజ్ లో పొటాషియం, కాల్షియం, థయామిన్ కూడా ఎక్కువ మొత్తం లో లభిస్తాయి.

ఆరంజ్ ని నేరుగా తినడం మంచిదా లేదా జ్యూస్ చేసుకొని త్రాగడం మంచిదా ?


Orange Fruit in Telugu నిజం చెప్పాలంటే పండ్లను జ్యూస్ చేసుకొని త్రాగడం కన్నా నేరుగా తినడమే ఏంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి.ఎంత ఫ్రెష్ గా జ్యూస్ తీసిన సరే దాని వల్ల కలిగే ప్రయోజనాలు పండుని అలానే తినడం వల్ల వచ్చే ఫలితాలు ఉండవు. క్రమం తప్పకుండా జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి అని నిపుణులు చెప్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఫ్రక్టోజ్ ఉన్న ఆరెంజ్ జ్యూస్ తాగితే ఫ్యూచర్ లో గుండె సమందిత జబ్బులు, డియాబెటిస్, లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్యాకెట్ రసాలు కూడా బహుళ-దశల ప్రాసెసింగ్కు లోబడి ఉంటయి కాబట్టి వాటిని అతిగా తీసుకోక పోవడం మంచిది.

Orange Fruit in Telugu ఒక గ్లాసు నారింజ జ్యూస్ కంటే ,నారింజ అలానే తీసుకుంటే వచ్చే పోషకాల ఎక్కువ కేలరీలు , కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ప్రత్యేకంగా, ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్లో ఆరెంజ్ కంటే రెండు రెట్లు ఎక్కువ కేలరీలు ఉంటాయి ఇది ఆరోగ్యానికి ఇన్స్టెంట్ ఎనర్జీ ని కల్పిస్తాయి. దీనిలో పండుతో పోలిస్తే తక్కువ మొత్తంలో ఫైబర్ మాత్రమే కలిగి ఉంటుంది. అంటే సాధారణం కంటే త్వరగా రసం మీ శరీరం లో కలిసిపోతుంది. ఫలితంగా, మీరు జ్యూస్ తాగిన సంతృప్తిని పొందలేరు,దీని వల్ల మీరు ఎక్కువ జ్యూస్ త్రాగే ఆస్కారం వుంది . అలాగే మీరు అనుకున్నదానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటారు.

  • ఆరెంజ్లో విటమిన్ C, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్స్తో సహా చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
  • సిట్రస్ శాతం పండ్లు అధికంగా ఉన్న ఏదైనా ఆహారం మధుమేహం, కాలేయం, మెడ, నోరు, తల , కడుపు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • ఆరెంజ్లో ఐరన్ మంచి మూలం కాదు. కానీ వాటిలో విటమిన్ సి ఉంటుంది. Vitamin C ఇనుమును గ్రహించే మీ శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది రక్తహీనత అభివృద్ధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు వంటివి అధిక మోతాదులో ఉండే ఫ్రూప్ట్స్ ని మీరు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం యొక్క రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్యం మరింత రోగనిరోధక శక్తిగా మార్చుతుంది.
  • ఇది కొల్లాజెన్ ఉత్పత్తిలో మీ శరీరానికి సహాయపడుతుంది. ఇది మీ శరీరంలోని గాయాల వైద్యం ప్రక్రియను వేగవంతం చేయడం లో సహాయపడుతుంది.
  • దీనిలో కాల్షియం ఉన్నందున, ఇది మీ ఎముకలు, కండరాలు, అవయవాలను బలం గా చెయ్యడం లో తోడ్పడతాయి. ఆరంజ్ లో ఉండే పొటాషియం మీ రక్తపోటును తగ్గించడం లో తోడ్పతాయి.
  • ఆరెంజ్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి , ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని కలిగించే వాటి నుండి చర్మాన్ని కాపాడతాయి. చర్మ ఛాయను కాంతివంతంగా మార్చడంలో ఉపయోగపడతాయి.ఆరంజ్ లో ఉండే విటమిన్ C జుట్టు రాలడాన్ని నియంత్రించి, జుట్టు పెరుగుదలను పెంచుతుంది. ఆరెంజ్ చుండ్రు సమస్యలకు చికిత్స చేయడానికి కూడా సహాయపడతాయి.
  • నారింజలోని విటమిన్ A ,మీ శ్లేష్మ పొరల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మీ కళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.అంధత్వానికి దారితీసే వయస్సు-సంబంధిత వాస్కులర్ నష్టాన్ని కూడా నివారిస్తుంది.

Orange Fruit in Telugu గమనిక : నారింజ పండు యొక్క సమాచారం అంతర్జాలంలో తీసుకోవడం జరిగింది. ఈ పండులో సి విటమిన్ అధికంగా వున్న క్రమంగా దీనిని మోతాదులో తీసుకుంటే మంచిది. మితి మిరి తీసుకుంటే ఆరోగ్య సమస్యలకు లోనవుతారు. యెంత మోతాదులో తీసుకోవాలి అని సందేహం వున్న వారు డాక్టర్ ని సంప్రదించడం మేలు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!