Bobbarlu in Telugu : బొబ్బర్లు తింటే , బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తాయి.
Bobbarlu in Telugu : బొబ్బర్లు. వీటిని కొన్ని కొన్ని ప్రాంతాల్లో అలసందలు అన కూడా పిలుస్తుంటారు. ఈ బొబ్బర్లతో వడలు, పునుగులు, దోశలు ఇలా రకరకాల వంటలను తయారు చేసుకోవచ్చు. బొబ్బర్లు రుచిగా ఉండటమే కాదు. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి.
Cowpeas in Telugu : బొబ్బర్లలో ప్రొటీన్లు, ఫైబర్ మరియు విటమిన్ A, B1, B2, B3, B5, B6, C, ఫోలిక్ యాసిడ్, రాగి, ఇనుము, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, సోడియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి.
Alasandalu in Telugu : బొబ్బర్ల ను మన రోజువారీ ఆహారంలో తరచూ తీసుకుంటే, మాత్రం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది :
Bobbarlu in Telugu : బొబ్బర్లు తరచు మన డైట్‌లో చేర్చుకుంటే.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వీటిలో కరిగే డైటరీ ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి బ్లడ్ ప్లాస్మాలో ఉన్న బాడ్ కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బొబ్బర్లలోని ఫైటోస్టెరాల్స్ అనేటువంటి స్టెరాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి.
బొబ్బర్లు మన డైట్ లో చేర్చుకుంటే, హృదయ సమస్యలు, స్ట్రోక్, హైపర్‌టెన్షన్ వంటి ముప్పు తగ్గుతుంది. బొబ్బర్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు. లిపిడ్ ప్రొఫైల్‌కు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనేక పరిశోధనలలో నిరూపించడం జరిగింది.
షుగర్ పేషెంట్స్‌కు మేలు చేస్తుంది :
బొబ్బర్లలో కరిగే లక్షణం ఉన్న ఫైబర్ అధికంగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ వారి యొక్క డైట్ లో తరచగా బొబర్లను చేర్చుకుంటే, బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణ లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి, డయాబెటిస్ మెల్లిటస్ ముప్పును తగ్గించడానికి దోహదపడతాయని పరిశోధనలు సూచిస్తున్నారు.
బరువు తగ్గుతారు :
బొబ్బర్లలో కొవ్వు, క్యాలరీలు తక్కకువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిలో సోడియం శాతం కూడా తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ కంటెంట్ సున్నా గా ఉంటుంది. ఇవన్నీ కూడా బరువు తగ్గిగంచడానికి మరియు బరువును నియంత్రణలో ఉంచడానికి తోడ్పడతాయి.
హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి :
Bobbarlu in Telugu : బొబ్బర్లలోని ఫ్లేవనాయిడ్లు, మెగ్నీషియం, పొటాషియం గుండె కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి ఇన్ఫ్లమేటరీ మార్కల్లను తగ్గిస్తుంది. బొబ్బర్లలో డైటరీ ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి బాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. వీటిలో చావ్లీలో ఫైటోస్టెరాల్ కలయికలు కూడా ఉంటాయి, ఇవి శరీరంలో లిపిడ్ ప్రొఫైల్‌ను నిర్వహించడానికి కూడా తోడ్పడతాయి.
ఈ అనారోగ్యాలకు చెక్ పెడుతుంది :
బొబ్బర్లలో ఉండే మరో మంచి భాగం లిగ్నిన్. ఇది ప్రాథమికంగా ఉన్న క్యాన్సర్ , స్ట్రోక్, రక్తపోటు , బోలు ఎముకల వ్యాధి వంటి అనేక ప్రాణాంతకమైన వ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది.
చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది :
బొబ్బర్లలోని అధిక ప్రొటీన్ కంటెంట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలు తెరుచుకొనేలా చేస్తుంది. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ A, C చర్మ కణాలను రక్షిస్తాయి. తద్వారా మృదువైన, ఆరోగ్యకరమైన చర్మం పొందవచ్చు.
గమనిక : ఇక్కడ మీకు అందించినటువంటి ఈ సమాచారం మరియు సూచనలు అన్నీ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని అధికంగా తీసుకునే ముందు మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.