Marigold Flower in Telugu : ఏ దేవుడికి బంతి పువ్వు అంటే ఇష్టం? పూజలో దీని ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?
Marigold Flower in Telugu : హిందూ మతంలో అన్ని పువ్వులు వేర్వేరు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అదేవిధంగా బంతి పువ్వుకు కూడా దాని సొంత ప్రాముఖ్యత ఉంది. దీనిని పూజ దగ్గర నుంచి వివాహం, కలశ స్థాపన మరియు గృహోపకరణం మొదలైన శుభ కార్యక్రమాల్లో తప్పనిసరిగా వినియోగిస్తారు. బంతి పువ్వు జీవితంలో సానుకూలతను తెస్తుంది. దుర్గాదేవికి ఎరుపు బంతి పువ్వులు, శివునికి తెల్లటి బంతి పువ్వులు, విష్ణువుకు పసుపు బంతి పువ్వులు సమర్పిస్తారు.
About Marigold Flower in Telugu : పువ్వులు చాలా రకాలు. పువ్వులు సప్త వర్ణాల సంగమం.అందాల హరివిల్లుని గుర్తు చేసేవి పువ్వులు. కొన్ని పువ్వులు చాలా మృదువుగా ఉంటె, మరొకొన్ని మాత్రం ముగ్ధమనోహరంగా కనిపిస్తూ, కన్నులవిందును చేస్తాయి. ఇక స్థిరత్వానికి చిహ్నం బంతిపువ్వులు అని చెప్పవచ్చు. బంతిపూలను శుభకార్యాల్లో , పూజల సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దండలు గుచ్చి దేవుళ్ళకు అలంకరిస్తారు.
Banthipuvvu : గృహంలో ఏదైనా పండగ జరిగినప్పుడు తప్పని సరిగా బంతి పువ్వులతో చేసినటువంటి దండ ఉండాల్సిందే. వీటినే కాకుండా పూజలో మందారం, గులాబి, చామంతి వంటి పువ్వులను కూడా ఉపయోగిస్తుంటారు.కానీ బంతి పువ్వు ప్రాధాన్యత ఏమిటి? పూజలో దీనిని ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బంతిపువ్వుకున్న ప్రాముఖ్యత గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
నాయకత్వ లక్షణాలను నేర్పించే బంతి :
Marigold Flower in Telugu : దేవుడికి బంతిపూలను సమర్పించడం వల్ల జ్ఞానం, సంపదలు వంటివి చేకూరుతాయని చెబుతారు. ఈ పువ్వులోని ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఇది మనిషిలోని అహంకారాన్ని తగ్గిస్తుంది. ఈ పువ్వు ఒక వ్యక్తిలోని మంచి నాయకుడికి ఉండాల్సిన గుణాలను కూడా చెబుతుంది. ఒక మంచి నాయకుడు వేల మందిని తనతో పాటు నడిచేలా ఎలా మార్గదర్శనం చేయాలో ఈ బంతి పువ్వుని చూసి తెలుసుకోవాలి అని అంటారు. బంతి పువ్వు స్థిరత్వానికి చిహ్నంగా చెప్తారు. అంతే కాకుండా శుభం కలగాలంటూ ఇంటి ద్వారానికి బంతి పువ్వుల దండను కడతారు.
బంతి పువ్వులను ఏ దేవుడికి సమర్పించాలి?
Marigold Flower in Telugu :మహావిష్ణువుకు బంతిపూలు సమర్పించడం వల్ల సంతానం కలుగుతుందని మత విశ్వాసం. గణపతి పూజలో కూడా బంతి పువ్వులను ఉపయోగిస్తారు. బంతి పువ్వులోని ప్రతి రెమ్మలో వివిధ దేవతలు,నివసిస్తారని చెబుతుంటారు. ఈ కారణంగా హిందూ మతంలో బంతి పువ్వుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యతను సంతరించుకున్నది. గురువారం రోజున శ్రీ హరివిష్ణువుకు బంతి పువ్వులు సమర్పించడం ద్వారా మనం కోరిన కోర్కెలు తీరతాయని ప్రగాఢ విశ్వాసం. మహావిష్ణువు, గణేశుడు, లక్ష్మి పూజలో బంతి పువ్వును ఎక్కువగా ఉపయోగిస్తారు.
జుట్టు పెరగాలన్నా, చుండ్రు పోవాలన్నా కూడా బంతిపువ్వును ఇలా వాడండి!
బంతిపువ్వులో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు సంరక్షణకు ఉపయోగపడతాయి. జుట్టు యొక్క పెరుగుదలకు, చుండ్రు నివారణకు కూడా బంతిపువ్వును ఉపయోగించే DIY జుట్టు సంరక్షణ విధానాలు తెలుసుకోండి.
Marigold Flower in Telugu : ఈ ప్రకృతిలో పువ్వులు ఎంతో ప్రత్యేకమైనవి. ఇవి అందమైన రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా, మంచి సువాసనలను విరజిమ్ముతూ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. అలంకరణలు మొదలుకొని ఆరాధన వరకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అంతేకాదు కొన్ని పువ్వులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అలాంటి అద్భుతమైన పువ్వులలో బంతిపువ్వు కూడా ఒకటి.
ముద్దబంతి పువ్వులు ముచ్చటైన పసుపు రంగులో ఎంతో అందంగా ఉంటాయి. ఈ పువ్వులు సహజాంగా నూనెలు, పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి మన రోజువారీ జీవితంలో అనేక సమస్యలకు చికిత్స చేయడంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా జుట్టు సంరక్షణ కోసం, చర్మ సంరక్షణ కోసం బంతిపూలు చాలా ఉపయోగాలను అందిస్తాయి.
బంతి ఆకులను జుట్టుకు మాస్క్‌లుగా (Hair Mask) కూడా తయారు చేసుకోవచ్చు, బంతిపూల నుండి తీసిన ఆయిల్ ను జుట్టు పెరుగుదలకు ఉపయోగించవచ్చు. చుండ్రును నివారించటానికి వాడుకోవచ్చు. బంతి పువ్వుల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను , వాటిని ఎలా ఉపయోగించాలో తెలిపే DIY జుట్టు సంరక్షణ విధానాలను ఇక్కడ తెలుసుకోండి.
జుట్టు పెరుగుదలకు బంతిపువ్వు:
Marigold Flower in Telugu : మీరు జుట్టు బాగా పెరగాలని కోరుకుంటే బంతిపువ్వు నూనెను ఉపయోగించవచ్చు. మీరు ఇప్పటి వరకు ట్రై చేసిన అనేక హెయిర్ ఆయిల్‌ల కంటే కూడా బంతిపువ్వు ఆయిల్ మీ జుట్టుకు మిరాకిల్ చేస్తుంది. ఇది జుట్టు రాలడం ఆపేసి వెంట్రుకలు పెరుగుదలకు, రాలిపోయిన వెంట్రుకలు తిరిగి పెరగటానికి రెండింటికీ అవసరమయ్యేటువంటి కొన్ని ప్రోటీన్లను కలిగి ఉంటుంది. వారానికి 2సార్లు ఈ ఆయిల్ ను మీ తలకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు త్వరగా పెరుగుతుంది, కేవలం 2 వారాలలో కనిపించే ఫలితాలు కనిపిస్తాయని నివేదికలు పేర్కొన్నాయి. బంతిపువ్వు నూనెను మీకు మీరుగా నేరుగా చేసుకోవచ్చు, ఎలాగో ఇక్కడ చూడండి.
జుట్టు పెరుగుదలకు :
కొన్ని బంతి ఆకులను సేకరించి శుభ్రంగా కడగండి.
దాని తర్వాత ఒక బౌల్ లో ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా బాదం నూనె ఏదైనా తీసుకోండి.
ఇప్పుడు ఆ నూనెలో బంతి పువ్వు ఆకులు వేసి 10-15 నిమిషాలు చిన్న మంట మీద వేడిచేయండి.
ఆపై గిన్నెను మంట నుంచి తీసేసి, నూనెను చల్లారనివ్వాలి.
తర్వాత ఈ ఆయిల్ ను వడ కట్టి ఒక గాజు సీసాలో నిల్వ చేయండి.
మీకు అవసరం అయినపుడు ఈ నూనె రాసుకోండి.
జుట్టు రాలడం అరికట్టడానికి :
Marigold Flower in Telugu : మీరు రోజ్ వాటర్ ఏ విధంగా తయారు చేసుకుంటారో, అదే విధానంలో బంతిపువ్వులతో Marygold water కూడా తయారు చేయవచ్చు. ఇది మీ జుట్టు రాలడాన్ని కూడా అరికడుతుంది. మీకు దీర్ఘకాలికంగా జుట్టు ఊడే సమస్యను ఎదుర్కొంటుంటే, జుట్టు రాలడాన్ని నివారించడానికి మీ జుట్టును బంతిపువ్వు వాటర్ తో కడగండి. Hair fall preventing Marygold water ఇలా తయారు చేయండి.
2 కప్పుల నీటిలో, ఒక కప్పు బంతి పువ్వు రెమ్మలను కలపండి.
ఈ నీటిని సగానికి అయ్యే వరకు 15 నిమిషాలు తక్కువ మంటపై మరిగించండి.
తర్వాత చల్లారే వరకు వేచి చూడండి, మేరీగోల్డ్ వాటర్ రెడీ అయినట్టే.
షాంపూ చేసుకున్న తర్వాత మీ జుట్టును శుభ్రం చేయడానికి ఈ మేరిగోల్డ్ వాటర్ ని ఉపయోగించండి.
చుండ్రు నివారణకు :
చుండ్రు అనేది నెత్తిమీద మంట, దురద కలిగించే ఒక పరిస్థితి. తెల్లని పొలుసులు రాలే ఈ చుండ్రు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చుండ్రు నివారణకు ఇప్పటికే అనేక రకమైన రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. అవన్నింటి తో లాభం లేదనుకుంటే ఈ బంతివువ్వు ఫ్యూజన్ ప్రయత్నించండి.
రాత్రి పడుకునే ముందు మీ తలకు మేరిగోల్డ్ నూనెను మసాజ్ చేయండి. మరుసటి రోజు బంతి పువ్వు నీటితో మీ జుట్టును కడిగి శుభ్రం చేసుకోండి.
ఈ రెండింటి యొక్క కలయిక మీ జుట్టుపై Cleansing, యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను చూపుతాయి. మీ స్కాల్ప్ నుండి బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. ఇది చుండ్రును క్రమంగా తగ్గించడానికి స్కాల్ప్‌ను క్లీన్ చేస్తుంది. ఇంకా పోషణ కూడా చేస్తుంది. కొన్ని వారాలలో ఆరోగ్యకరమైన మెరిసే జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని మరియు అంతర్జాలం నుండి తీసుకోవడం జరిగింది.మీకు ఏదేని చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మేలు అని గమనించగలరు. దీనిని teluguvanam.com ధృవీకరించడం లేదు.