Raksha Bandhan 2024: అసలు రాఖీ ఎందుకు కడతారు…?

Spread the love

Raksha Bandhan 2024 :

రక్షా బంధన్, రాఖీ అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశంలోని అనేక ప్రాంతాలలో మరియు ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రవాసులలో జరుపుకునే సాంప్రదాయ హిందూ పండుగ. ఇది అన్నదమ్ముల మధ్య ప్రేమ మరియు బంధానికి అంకితమైన రోజు.

ఈ పండగను రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ గా పిలవబడుతుంది. ఈ పండుగ అక్క తమ్ముడు,అన్న చెల్లెలు కలిసి జరుపుకునే అత్యంత పవిత్రంగా, మరియు వారి బంధం పటిష్టంగా ఉండడానికి జరుపుకునే పండుగ. అక్క తమ్ముడు,అన్న చెల్లెలు ఒకరికి ఒకరు అండగా ఉంటామని, భరోసాతో పాటు ఒకరికి ఒకరు ప్రేమలను పంచుకొనే పండుగ. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలోని వారు ఈ పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి మరియు జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు . అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ .

‘రక్షా బంధన్’ అనే పదాన్ని ‘రక్షణ బంధం’ అని అనువదిస్తుంది. ఈ రోజున, సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు ‘రాఖీ’ అనే పవిత్ర దారాన్ని కట్టి, వారి దీర్ఘాయువు మరియు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. బదులుగా, సోదరులు తమ సోదరీమణులను అన్ని హాని మరియు ఇబ్బందుల నుండి కాపాడుతామని ప్రమాణం చేస్తారు. పండుగ అనేది తోబుట్టువుల మధ్య లోతైన ప్రేమ మరియు గౌరవానికి చిహ్నం మరియు వారు పంచుకునే బంధాన్ని బలపరుస్తుంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం, రక్షా బంధన్ చంద్ర క్యాలెండర్ మాసం శ్రావణ చివరి రోజున వస్తుంది. రాఖీ గురించి తేదీ నుండి సమయాలు, చరిత్ర మరియు మరిన్నింటిని క్రింద అన్వేషించండి.

రక్షా బంధన్, సాధారణంగా రాఖీ అని పిలుస్తారు, హిందూ మాసం శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దృక్పచాంగ్ ప్రకారం 2024లో, రక్షా బంధన్ ఆగస్టు 19 , సోమవారం వస్తుంది . రాఖీ వేడుకను నిర్వహించడానికి మహూరత్ యొక్క ఖచ్చితమైన సమయం పూర్ణిమ తిథి (పౌర్ణమి రోజు)పై ఆధారపడి ఉంటుంది.

రాఖీ కట్టడానికి ఉత్తమ సమయం సాధారణంగా అపరాహ్న సమయంలో ఉంటుంది, ఇది రోజులోని హిందూ విభజన ప్రకారం మధ్యాహ్నం లేదా ప్రదోష సమయం. ఈ ఆచారానికి అశుభకరమైనదిగా భావించే భద్ర సమయాన్ని నివారించడం చాలా అవసరం. దిగువన గమనించవలసిన సమయాలు ఇక్కడ ఉన్నాయి:

రక్షా బంధన్ థ్రెడ్ వేడుక సమయం: 01:30 PM నుండి 09:08 PM వరకు
అపరహ్న సమయం రక్షా బంధన్ ముహూర్తం: 01:43 PM నుండి 04:20 PM వరకు
ప్రదోష సమయం రక్షా బంధన్ ముహూర్తం: 06:56 PM నుండి 09:08 PM వరకు
రక్షా బంధన్ భద్ర ముగింపు సమయం: 01:30 PM
రక్షా బంధన్ భద్ర పంచ: 09:51 AM నుండి 10:53 AM వరకు
రక్షా బంధన్ భద్ర ముఖ: 10:53 AM నుండి 12:37 PM వరకు
పూర్ణిమ తిథి ఆగస్టు 19, 2024న తెల్లవారుజామున 03:04 గంటలకు ప్రారంభమవుతుంది.
పూర్ణిమ తిథి ఆగస్టు 19, 2024న రాత్రి 11:55 గంటలకు ముగుస్తుంది.

దేశవ్యాప్తంగా చాలా ఘనంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. ఒకప్పుడు ఉత్తర మరియు పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునేవారు. కానీ ఈ పండుగను ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు కూడా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ అన్న తనకు రక్షగా, తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని రక్షా బంధనం ద్వారా తెలియజేస్తారు. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను జరుపుకోవటం వెనుక పెద్ద చరిత్రనే ఉంది. ఈ పండుగను జరుపుకునే ఆచారం వెనుక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.

పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య చాలా కాలంపాటు యుద్ధం సాగింది. దాదాపు ఒక పుష్కర కాలం పాటు కొనసాగిన యుద్ధంలో ఓడిపోయిన దేవతల యొక్క రాజు అయినా దేవేంద్రుడు, అమరావతి నగరంలో తాను తలదాచుకున్నాడట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించటానికి తరుణోపాయం ఆలోచిస్తుంది. తన భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించే విదంగా తాను సంకల్పిస్తుంది.

అయితే సరిగ్గా అదే రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో ఆమె పార్వతీ పరమేశ్వరులను మరియు లక్ష్మీనారాయణులను పూజించిన తర్వాత అప్పుడు ఇంద్రాణి ఒక రక్షను తీసుకొని వచ్చి తన భర్త అయిన దేవేంద్రుడు యొక్క చేతికి కడుతుంది . ఇక అప్పుడు దేవతలందరూ కూడా ఆ రక్షను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు ఆ యుద్ధంలో గెలిచి వచ్చి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు.అని ప్రతిక . ఆ విధంగా ప్రారంభమైంది అని చెప్పవచ్చు ఈ రక్షాబంధనం.ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఈ రాఖీ పండుగ ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే పండుగగా మారింది.

దేవదానవుల యుద్ధంతో మొదలైన రాఖీ పండుగ నాటి నుండే ఆచారంగా కొనసాగుతుంది. ఈ ఒక్క కథ మాత్రమే కాదు.ఇలా రక్షాబంధనం గురించి ఇంకా చాలానే పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయని, అంతేకాకుండా శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో కూడా సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు యొక్క చూపుడువేలుకు గాయం అయ్యిందట. అది చూసి గమనించిన ద్రౌపతి తన యొక్క పట్టు చీర కొంగు చింపి కృష్ణుడి యొక్క చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని ద్రౌపతికి హామీ ఇచ్చారని చెప్తారు. అందుకు ప్రతికులంగా దుశ్శాసనుడి దురాగతం నుండి ద్రౌపతిని శ్రీకృష్ణుడు కాపాడారని కూడా భాగవతంలో ఉంది. ఇక అంతేకాకుండా బలి చక్రవర్తి శ్రీమహా విష్ణువును పాతాళలోకానికి తీసుకువెళ్ళిన సందర్భంలో, ఆయనను తిరిగి తీసుకు రావటం కోసం లక్ష్మీ దేవి బలిచక్రవర్తికి కూడా రాఖీ కట్టి రక్షణ కల్పించారని కోరినట్టు చెప్తుంటారు. అప్పుడు విష్ణుమూర్తిని బలిచక్రవర్తి లక్ష్మీదేవి వద్దకు పంపినట్టు కూడా ఒక కథ ఉంది.

ప్రతి ఒక్కరు రాఖీ పండుగను తమ అనుబంధాలకు ప్రతీకగా జరుపుకుంటారు.మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ శ్రావణ మాసంలో జరుపుకునేటువంటి పండుగను మన దేశ వ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమయొక్క మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు. మానవుల యొక్క సంబంధాల మెరుగుదలకు, మరియు సమాజంలో ప్రస్తుతం అవసరంగా మారినటువంటి మానవ విలువలకు రాఖీ పండుగ అనేది ఒక మంచి అద్దం పడుతుంది. రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్యనే జరుపుకోవాలని ఎం లేదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సరే సోదరుడు, సోదరి అని ఉన్నటువంటి భావన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రక్షాబంధనాన్ని కట్టుకొని , ఒకరికి ఒకరు అండగా ఉన్నామని చెప్పుకోవడానికి ఈ రారాఖీ ఒక ప్రతిక .

ఇప్పటికే రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్లో బోలెడన్ని రాఖీల సందడి నెలకొంది. ఈ సంవత్సరం బంగారం, వెండి, రాళ్ళు పొదిగిన రాఖీలకు గిరాకీ బాగా పెరిగింది .మార్కెట్లో సరికొత్త డిజైన్ల రాఖీలు సందడి చేస్తున్నాయి .ఇక పేర్లతో కూడా రాఖీలు తయారు చేయించుకుంటున్న వారు ఉన్నారు.తమ యొక్క సోదరులపై ప్రేమ అంత తెలిసేలా అందమైనటువంటి రాఖీలను సోదరీమణులు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా వారిపై ప్రేమను తెలియజేసేలా సోదరులు కూడా వారికి Gifts ఇవ్వటానికి Plan చేస్తున్నారు.

Raksha Bandhan 2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
Custard Apple : సీతాఫలం తింటే.. ఇన్ని లాభాలా..? తెలిస్తే.. Plum Fruit in Telugu : అల్ బుక‌రా పండ్లతో ఆరోగ్య ఉపయోగాలు. Curry Leaves: కరివే పాకు తో ఆరోగ్య ప్రయోజనాలు జాగ్రత్త..! వర్షాకాలం లో ఈ కూరగాయలు తింటున్నారా.. ఐతే జరిగే పరిమానాలు మీరు ఊహించలేరు….? బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగేవారికి అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..?