Atal Pension Yojana in Telugu : నెలకు రూ.210 కాంట్రిబ్యూషన్ తో రూ. 5000 వేలు వచ్చే, కేంద్ర ప్రభుత్వ భారీ స్కీం….! పూర్తి వివరాలు & అర్హతలు

Atal Pension Yojana in Telugu : నెలకు రూ.210 కాంట్రిబ్యూషన్ తో రూ. 5000 వేలు వచ్చే, కేంద్ర ప్రభుత్వ భారీ స్కీం….! పూర్తి వివరాలు & అర్హతలు

Atal Pension Yojana in Telugu : కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అనేక పథకాలలో “అటల్ పెన్షన్ యోజన” కూడా ఒకటి. దీని ముఖ్య ఉదేశ్యం అందరి పెన్షన్ రూపంలో డబ్బుని అందివ్వడం, మనం సాదరణంగా చూసుకుంటే పదవి విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ అందుతుంది.కాబట్టి వారి జీవితం పదవి విరమణ తర్వాత వారు పొందే పెన్షన్ తో సాఫీగా సాగుతుంది.కానీ, అదే మనం కొన్ని ప్రైవేట్ సంస్థలను తీసుకుంటే వారి ఉద్యోగం తర్వాత వారికీ ఎలాంటి పెన్షన్ అందవు. అలంటి వాల్ల కి కూడా 60 ఏళ్ళు దాటాక పెన్షన్ అందాలనే ముఖ్య ఉదేశ్యంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ” Atal Pension Yojana ” స్కీం ని ముందుకు తేవడం జరిగింది. 2015 వ సంవత్సరం లో బడ్జెట్ ప్రవవేశాలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 3 సామజిక పథకాలలో ఏది కూడా ఒక్కటి. ఈ స్కీం లో చేరాలి అనుకునే వారు 60 ఏళ్ళు తర్వాత పెట్టుబడులు పెట్టిన మొత్తన్ని వారికీ నిర్ణయించిన స్కీం ని అనుసరించి ప్రతి నెలా పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది.

  • అటల్ పెన్షన్ యోజన స్కీం కి 18 నుంచి 40 ఏళ్ళ మధ్య వయసుగల వ్యక్తులు ఎవరైనా ఈ పథకానికి అర్హులు.
  • ఈ పథకం లో పెట్టుబడి పెట్టాలి అనుకునేవారికి పోస్ట్ ఆఫీస్ లో గని, లేదా ఏదైనా ప్రభుత్వం రంగ బ్యాంకులలో గని వారికీ పొదుపు ఖాతా తప్పనిసరి.
  • ఈ పథకం కోసం మీ బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు తో అనుసంధించాల్సి వస్తుంది.
  • మీరు 40 సంవత్సరాలు పైబడిన వారు ఐతే, ఈ పథకం మీకు వర్తించదు .
  • ఒకవేళ మీకు నేషనల్ పెన్షన్ వస్తే, ఈ పథకాన్ని పొందేందుకు మీరు అనర్హులు.
  • మీరు ఆదాయ పన్ను చెలిస్తున్నటైతే, అటల్ పెన్షన్ యోజనాకి మీరు పెట్టుబడి పెట్టేందుకు అనర్హులు.

ఈ పెన్షన్ స్కీం లో పెట్టుబడులు చెలించాల్సిన మొత్తం వారి యొక్క వయసును బట్టి మారుతూ ఉంటాయి. ఈ పథకంలో రూ . 1000, 2000, 3000, 4000, 5000 వరకు ప్రతి నెల స్కీం తీసుకున్న దానిపై అదర పడి ఉంటుంది.కట్టిన పథకం అనుగుణంగానే చెలింపులు కూడా ఉంటాయి. ఒక వేళ్ళ మీరు 18వ సంవత్సర వయసు నుంచే ఈ స్కీం లో చేరాలి అనుకుంటే, 60 ఏళ్ళు వచ్చే వరకు అంటే 42 సంవత్సరాలు మీరు ఈ పథకామ్లో డబ్బులు చెలించాల్సి ఉంటుంది.మీరు ఈ స్కీమ్ లో 18 వ సంవత్సరం లో చేరితే రూ. 42 నుంచి గరిష్టంగా రూ. 210 వరకు కట్టాల్సి ఉంటుంది.మీరు 40 ఏళ్ళ లో ఈ పథకంలో చేరితే 20 సంవత్సరాలు ఈ పథకానికి చెలించాల్సి ఉంటుంది.దానికి మీరు రూ. 291 నుంచి రూ. 1,454 వరకు చెలించాల్సి ఉంటుంది.

Atal Pension Yojana in Telugu పథకం లో చేరిన వారి యొక్క కాంట్రిబ్యూషన్ కి తగినట్టు గా, 60 సంవత్సరాలు దాటాక వారికీ నేలకు కచ్చితమైన పెన్షన్ అమౌంట్ ని వారు పొందవచ్చు. వారు పథకం సమయం లో ఎంచుకున్న స్కీముని బట్టి వారికీ రూ.1000, 2000, 3000, 4000, మరియు 5000 వేళ్ళ వరకు వారి పెన్షన్ అందడం జరుగుతుంది.ఒకవేళ మీరు గరిష్టంగా రూ. 5000 పెన్షన్ ని పొందాలి అనుకుంటే, మీరు 18 సంవస్తరాల నుంచి 60 ఏళ్ళు వచ్చే అంత వరకు రూ. 210 కట్టాలి, ఒకవేళ మీరు స్కీం లో 40 సంవత్సరంలో జాయిన్ అవుతే , మీరు 20 ఏళ్ళ పటు రూ. 1454 స్కీం లో పెట్టుబడిని పెట్టాల్సి ఉంటుంది.

అటల్ పెన్షన్ స్కీం లో చేరిన సభ్యులు తమ బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ను పథకం కతాకు లింక్ చేయాల్సి ఉంటుంది. ఆలా లింక్ చేసాక మీ యొక్క ఖాతాలో నుంచి నెలవారీగా డెబిట్ చేసేందుకు మీరు బ్యాంకుకు అనుమతిని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం మీరు మీ బ్యాంకు అకౌంట్ లో తగిన బ్యాలన్స్ ను ప్రతి నెల పొందుపరచాలి. లేదంటే మీకు అదన పెనాల్టీ పడే అవకాశం వుంది.

మీరు స్కీం లో తక్కువ చెలింపుతో ప్రవేశం చేసినప్పటికీ .. మీ భవిష్యతు లో పెన్షన్ మొత్తాన్ని పెంచుకోవాలి అనుకునేవారు, వారి యొక్క కాంట్రిబ్యూషన్ పెంచుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది. అలాగే మీరు తగ్గించుకోవాలి అనుకున్న తగ్గించు కొనే వెసులుబాటు కూడా ఉంటుంది. ఐతే సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. అపుడు మీరు పోస్ట్ ఆఫీస్ లో సంప్రదించాలి.

  • ఈ స్కీం ను అన్ని జాతీయ బ్యాంకులు అందిస్తున్నాయి . ఈ బ్యాంకుల ద్వారా మీరు ఏపీవై ఖాతాను తెరవచ్చు.
  • ఈ ఖాతాను తెరవాలి అంటే అప్లికేషన్ ఫారంను ఫిల్ చేసి బ్యాంకు లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫారం లను బ్యాంకు లేదా ఆన్లైన్ లో పొందవచ్చు.
  • ఫారం లో అడిగిన వివరాలను మరియు డాక్యూమెంట్లని బ్యాంకు లో జత చెయ్యాలి.
  • బ్యాంకు వారు మీ దరఖాస్తుని స్వీకరించగానే మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది
  • ఆన్లైన్ లోను కూడా అటల్ పెన్షన్ యోజన స్కీం ను ప్రారంభించవచ్చు. దీని కోసం మీరు “enps.nsdl.com” వెబ్సైటు ని సంప్రదించాలి.
  • వెబ్సైటు ఓపెన్ చేసాక అందులో కుడివైపున ” Atal Pension Yojana ” ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేయండి.
  • వెంటనే మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కనిపిస్తున్నా “APY REGISTEATION” పైన క్లిక్ చెయ్యగానే దరఖాస్తు యొక్క ఫారం ఓపెన్ అవుతుంది.
  • ఇందులో మిమల్ని అడిగిన వివరాలు అందులో పొందుపరిచాక మీ ఖాతా ఓపెన్ అవుతుంది.


మీరు 60 ఏళ్లకు ముందే ఈ స్కీం నుంచి తప్పుకోవాలి అనుకుంటే తప్పుకోవచ్చు, అయితే వాటికీ కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. మీరు కాంట్రిబ్యూషన్ చేసిన మొత్తాన్ని దానిపై వచ్చిన రాబడి పై వర్తించే చార్జీలను తీసి వేసి వాటిపై మిగిలిన మొత్తాన్ని మాత్రమే మీకు చెల్లించడం జరుగుతుంది. ఒక వేల స్కీం ను తీసుకున్న వ్యక్తి అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు ఈ పథకం నుంచి నిష్క్రమించవచ్చు. అయితే కొన్ని నిర్దిష్ట అనారోగ్యాలకు మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ నియమాల ప్రకారం ఫారం లో నియమించిన అనారోగ్యం బారిన పడి పెన్షన్ పథకం నుంచి నిష్క్రమించాలి అనుకుంటే, అర్హుడు ఐనా వ్యక్తి చేసేన కాంట్రిబ్యూషన్, దానిని బట్టి ప్రభుత్వం రావాల్సిన మొత్తాన్ని వడ్డీ తో సహా చెలిస్తారు.


ఒక వేలా పాలసీ తీసుకున్న వ్యక్తి 60 సంవత్సరాల కన్నా ముందే మరణిస్తే, ఆ వ్యక్తి యొక్క ఏపీవై స్కీం కొనసాగుతుంది. కానీ ఈ వెసులుబాటు కేవలం తమ భాగ్యస్వాములకి మాత్రమే ఉంటుంది. మరణించిన వ్యక్తి వయసు 60 ఏళ్ళు దాటే వరకు తమ భాగస్వామి పేరుపై ఖాతాను కొనసాగించవచ్చు . తర్వాత వారి వయసు పరిమితిని దాటిన నుంచి వారికీ మరణం సంభవించే వరకు పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ ఖాతాను మూసివేయ్యాలి అనుకుంటే, ఏపీవై ఖాతాను తీసుకున్న వ్యక్తి తాను పెట్టు బడి పెట్టిన మొత్తాన్ని ఇంట్రెస్ట్ తో సహా తన భాగస్వామికి చెల్లిస్తారు. ఒకవేళ మరణించిన వ్యక్తికి పెళ్ళి కాకపోతే, తాను ఎవరైతే నామినీ ని ఎంచుకున్నాడో, వారికీ ఈ స్కీం యొక్క ప్రయోజనాలను అందిస్తారు.


కొన్నిసార్లు అనుకోని చర్యల వల్ల కాంట్రిబ్యూషన్ చెయ్యడం ఆలస్యం కావొచ్చు. ఈ లాంటి సందర్భాలలో జరిమానా కట్టాల్సివస్తుంది. ఒక నెలకి మీరు 100 రూపాయలు కాంట్రిబ్యూషన్ చేస్తే దానికి మీరు 101 కట్టాల్సి ఉంటుంది అంటే మీకు 1 రూ. జరిమానా అదనంగా కట్టాల్సి వస్తుంది. ఇలా మీరు ఎంచుకున్న కాంట్రిబ్యూషన్ బట్టి జరిమాన కట్టాల్సి వస్తుంది. 6 నెలల నుంచి మీరు మీ కాంట్రిబ్యూషన్ చేయనట్లయితే మీ ఖాతాను స్తంబింపచేస్తారు. ఒకవేళ మీరు సంవత్సరం పటు అంటే 12 నెలలు పటు కాంట్రిబ్యూషన్ చేయనట్లయితే మీ యొక్క ఖాతాను డీయాక్టివేట్ చెయ్యడం జరుగుతుంది. రెండు సంవత్సరాలు అంటే 24 నెలలు ఐతే ఖాతాను మూసివేసి అంతవరకు పొందుపరిచినా కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని చందాదారునికి అందజేస్తారు.

  • ఆధార్ /పాన్ కార్డు /మొబైల్ నెంబర్ /పాస్ పోర్ట్ సైజు ఫోటో (ఇప్పటిది)
  • APY ఫారం లో పూర్తి వివరాలు పొందుపరచాలి అందులో అడిగిన వాటిని.
  • బ్యాంకు పాస్ బుక్ వారి పేరున ఉండాలి. అలాగే బ్యాంకు డీటెయిల్స్ క్లుప్తంగా ఫారం లో వివరించాలి.
  • మీ యొక్క నెలసరి కాంట్రిబ్యూషన్ ఖాతాను ను జత చెయ్యాలి.

చివరి మాటలు : రూ. 5000 వేల పెన్షన్ పొందాలంటే మీరు 18వ ఏటా నుంచే స్కీం లో జాయిన్ అవ్వాలి, ఆలా జాయిన్ అయినా వారు నెలకు రూ. 210 కాంట్రిబ్యూషన్ చేస్తే సరిపోతుంది. అదే మీరు 40వ ఏటా స్కీం లో జాయిన్ అవుతే, మీరు నెలకు రూ. 1,454 కాంట్రిబ్యూషన్ చేయాల్సి వస్తుంది. అందుకే మీరు చిన్న వయసు నుంచే ఈ స్కీం లో చేరడం ఉత్తమం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me