ఈ రోజుల్లో గుండెకు సంబందించిన జబ్బులు ఎక్కువ అయ్యాయి, వయస్సుతో సంబందం లేకుండా అన్ని age గ్రూప్ వారికీ వస్తున్నాయి, ఆలా రావడానికి మన జీవన శైలి మారడం, అలాగే మన ఆహార పదార్థాలు మారడం, శారీరక శ్రమ తగ్గడం ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి, ఈ మధ్య కాలంలో బీపీ కూడా సర్వసాధారణం అయిపొయింది అలాగే రక్తనాళాల పూడికలు, బాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం రక్త ప్రసరణ లేకపోవడం లాంటి వాటితో చాలా మంది బాధపడుతున్నారు మరి ఈ బీపీ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలంటి ఆహారపదార్థాలలో మొదటిది avise ginjalu అవిసె గింజలు వీటినే ఇంగ్లిష్ లో Flax సీడ్స్ అంటారు. మరి ఈ అవిసె గింజల వాళ్ళ ఉపయోగాలు ఏంటి వీటిని మన ఆహార పదార్థాలు గా ఎలా ఉపయోగించాలి అనేదాన్ని క్లుప్తంగా చూద్దాం.
Avise Ginjalu – అవిసె గింజలు ఉపయోగాలు – Flax Seeds in Telugu
అవిసె గింజలు ఉపయోగాలు – Avise ginjalu uses
ఈ అవిసె గింజల్లో అల్ఫాలినొలెనిక్ ఆసిడ్ , ఒమేగా 3 ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి అలాగే ఇందులో ఉండే మంచి కొవ్వు గుండె ఆరోగ్యాంగా ఉండడానికి సహకరిస్తుంది, ఈ ఆసిడ్స్ బాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా , రక్తనాళాల్లో పూడికలు రాకుండా అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా మనల్ని రక్షిస్తుంది, ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఆసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . అమెరికా లో హార్వార్డ్ స్కూల్ అఫ్ పబ్లిక్ హెల్త్ వారు జరిపిన పరిశోధన లో ఈ అవిసె గింజలు బ్లడ్ వెస్సెల్స్ లో ఫ్యాట్స్ రాకుండా నివారించడానికి , హార్ట్ స్ట్రోక్స్ రాకుండా కాపాడటానికి ఎంత గానో ఉపయోగపడతాయి అని కనుక్కోవడం జరిగింది. అలాగే స్టెంట్స్, బైపాస్ సర్జరీ అయినవాళ్లు, బ్లాక్స్ వచ్చిన వాళ్ళు కూడా వీటిని రోజు వారి ఆహారంలో 25 నుండి 30 గ్రా తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుందని కూడా ఈ పరిశోధనలో తెలియజేయడం జరిగింది.
అవిసె గింజల్ని ఎలా తీసుకోవచ్చు ?
అవిసె గింజలు మనకు తక్కువ ధరలో మార్కెట్ అందుబాటులో ఉంటాయి , సామాన్యులు కూడా కొనుక్కొని వాడుకొనే అందుబాటు ధరలో ఉంటాయి, మరి వీటిని తెచుకున్నాక ఆహార పదార్థాలుగా ఎలా తీసుకోవాలి అని చూసినట్లయితే , వీటిని మన రోజు వారి ఆహార పదార్థాలుగా సులభంగా వాడుకోవచ్చు , ఇవి నానితే కొంచెం జిగటగా ఉంటాయి కాబట్టి నానబెట్టి గ్రైండ్ చేసుకుని కూరల్లో వేసుకోవచ్చు, లేదా అవిసె గింజల్ని కొంచెం దోరగా వేయించి పొడి చేసుకుని కార్జురంలో కలుపుకుని తినొచ్చు, లేదా పొడిని కూరల్లో కూడా వాడొచ్చు. ఇలా మనకు ఎలా నచ్చితే ఆలా ఆహార పదార్థంగా తీసుకోవచ్చు.
Fennel Seeds in Telugu : sompuసోంపు ఉపయోగాలు ఫెన్నెల్ సీడ్స్ వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా ?
Conclusion
ఈ అవిసె గింజలు మనకు ఎంతో మేలు చేస్తాయి అలాగే తక్కువ ధరలో దొరికే ఈ అవిసె గింజల్ని రోజు కొంచెం ఆహారంలో చేర్చుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యం, ఎక్కువ శాతం చేపల్లో ఉండే ఒమేగా 3 ఆసిడ్స్ ఈ అవిసె గింజల్లో పుష్కలంగా దొరుకుతాయి అలాగే గుండె జబ్బులనుండి, బ్రెయిన్ స్ట్రోక్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఇవి ఎంతగానో దోహదపడతాయి, జబ్బు వచ్చిన తర్వాత వేళల్లో ఖర్చు పెట్టేకంటే వందల్లో ఖర్చుతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.