కిసాన్ క్రెడిట్ కార్డు – Kisan Credit Card ఎలా అప్లై చేయాలి వాటి అర్హతలు

Spread the love

కిసాన్ క్రెడిట్ కార్డు అనేది 1998 లో ప్రారంభించడం జరిగింది. ఇది రైతులకు రుణాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన క్రెడిట్ పథకమే ఈ Kisan Credit Card. ఈ పథకాన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు లు, సహకార బ్యాంకులు మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులచే అమలు చేయబడుతుంది. రైతుల యొక్క వినియోగ మరియు ఉత్పత్తి అవసరాలను తీర్చే ఉద్దేశ్యంతో అలాగే వారి అవసరానికి తగిన రుణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది, ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో గల చేతి వృత్తుల వారికి రైతులకు, మత్స్యకారులకు, భూమిని కలిగి ఉన్న వారికి అలాగే వ్యవసాయ కార్యక్రమాలను నిర్వహించే వారికీ ఈ కార్డును జారీ చేయడం జరుగుతుంది. ఈ క్రెడిట్ కార్డు ను వ్యవసాయ మరియు దాని అనుబంధ కార్యకలాపాలకు సంబందించిన పెట్టుబడుల కోసం అలాగే రైతు గృహ వినియోగ అవసరాలకు, పంట ఉత్పత్తి మరియు దాని కోత అనంతర ఖర్చుల కోసం క్రెడిట్ ను అందిస్తుంది.

కిసాన్ క్రెడిట్ కార్డు – Kisan Credit Card ఎలా అప్లై చేయాలి వాటి అర్హతలు

kisan Credit Card Benefits

ఈ కార్డు యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే తక్కువ వడ్డీ రేట్లు , వడ్డీ రాయితీ, సులభమైన రీ పేమెంట్ సదుపాయం , పంట భీమా కవర్ మరియు వ్యక్తిగత ప్రమాద భీమా వంటి ఇతర ప్రయోజనాలు ఉన్నాయి, ఈ కార్డు ఉన్నవారు వారి అవసరాన్ని బట్టి అమౌంట్ ను విత్ డ్రా చేసుకోవచ్చు అలాగే షరతులు మరియు నిబంధనల ప్రకారం తీసుకున్న మొత్తాన్ని వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. రైతులకు సరసమైన మరియు సులభమైన రుణాన్ని అందించడం వలన భారత దేశంలో వ్యవసాయ వృద్ధి అలాగే అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ఎంతగానో విజయవంతమైంది. 

Eligibility

KCC పథకం భారత దేశంలోని నిర్దిష్టమైన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నటువంటి రైతులకు ఇది అందుబాటులో ఉంది. ఈ పథకానికి అర్హత పొందడానికి గల ప్రమాణాలు చూసినట్లయితే.

1. వ్యవసాయ భూమిని కలిగి ఉన్న రైతులు లేదా సాగుచేసే రైతులు, ఉమ్మడి రుణ గ్రహీతలు లేదా వ్యక్తులు.

2. వ్యవసాయం కోసం సాగు చేసుకుంటున్న వాటా దారులు, మౌఖిక కౌలుదారులు , కౌలు రైతులు.

3. జాయింట్ లయబిలిటీ గ్రూప్ లు ( JLG లు), వాటాదారుల స్వయం సహాయక గ్రూప్ లు ( SHG ), కౌలు రైతులు , రైతులు.

4. తేనెటీగల పెంపకం, పిసికల్చర్, తోటల పెంపకం , పశుపోషణ  మొదలైనటువంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలలో నిమగ్నమైన రైతులు

5. గతంలో రుణాలను  తీసుకుని సకాలంలో చెల్లించేవారు, మంచి రుణ చరిత్ర కలిగి ఉన్న రైతులు.

6. ఈ కార్డు కోసం దరఖాస్తు చేసే బ్యాంకు లో సేవింగ్స్ అకౌంట్ ఉన్న రైతులు.

How to apply

భారత దేశంలో ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ను అప్లై చేయడం కోసం ఈ క్రింద తెలిపిన దశలను అనుసరించవచ్చు .

* మీకు సమీపంలోని బ్యాంకు శాఖాను సంప్రదించండి: అలాగే రైతులు కార్డు సౌకర్యాలను అందించే వారి ఎంపికకు దగ్గరలోని బ్యాంకు ను సందర్శించవచ్చు అలాగే అక్కడ దరఖాస్తు ఫారం ను సేకరించవచ్చు.

* దరఖాస్తు ఫారం ను పూరించండి  : రుణ అవసరాలు , పంట వివరాలు, భూమి యొక్క పూర్తి వివరాలు, వ్యక్తిగత అవసరాలు వంటి అన్ని అవసరమైన వివరాలతో మీకు ఇచ్చిన దరఖాస్తు ఫారం ని పూరించాలి.

* అవసరమైన పాత్రలను సమర్పించాలి:  రైతుల యొక్క గుర్తింపు పత్రాలు , చిరునామా రుజువు పత్రాలు, దరఖాస్తు ఫారం మరియు పాస్ పోర్ట్ సైజు ఫోటో వంటి అవసరమైన పాత్రలను సమర్పించాలి.

* దరఖాస్తును ధ్రువీకరించడం : బ్యాంకు అధికారులు రైతులు అందించిన దరఖాస్తు పారం అలాగే వాటికి సంబంధిన పాత్రలను, వివరాలను ద్రువీకరిస్తారు.

* కిసాన్ క్రెడిట్ కార్డు ఆమోదం మరియు జారీ :  ధ్రువీకరణ ప్రక్రియ విజయ వంతంగా ముగిసిన తర్వాత kcc కార్డు ని బ్యాంకు రైతులకు క్రెడిట్ కార్డు ను జారీ చేస్తుంది.

Conclusion

ఈ క్రెడిట్ ని అందించే ఆర్థిక సంస్థ లేదా బ్యాంకు పై ఆధారపడి ఈ స్కీం కు అర్హత ప్రమాణాలు స్వల్పం గా మారవచ్చని గమనించడం చాల ముఖ్యం ఈ కిసాన్ క్రెడిట్ కార్డు కి సంబందించిన పూర్తి వివరాలు మరియు అర్హతల కోసం సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ తో చెక్ చేసుకోవడం మంచిది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
Custard Apple : సీతాఫలం తింటే.. ఇన్ని లాభాలా..? తెలిస్తే.. Plum Fruit in Telugu : అల్ బుక‌రా పండ్లతో ఆరోగ్య ఉపయోగాలు. Curry Leaves: కరివే పాకు తో ఆరోగ్య ప్రయోజనాలు జాగ్రత్త..! వర్షాకాలం లో ఈ కూరగాయలు తింటున్నారా.. ఐతే జరిగే పరిమానాలు మీరు ఊహించలేరు….? బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగేవారికి అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..?